Skip to main content

Posts

Showing posts from March, 2018

ఆహారం మీద కోరికలను యోగాతో నియంత్రించండి

ఆహారం విషయంలోప్రతి ఒక్కరు వారివారికి నచ్చింది, ఇష్టమైనది తింటూ ఆనందంలో మునిగిపోతారు, అయితే, వారి తినేటటువంటి అలవాట్ల మీద ద్రుష్టిపెట్టకపోతే, ఫలితం తీవ్రమైన తినేటటువంటి రుగ్మత ఏర్పడుతుంది. మరియు అది ఆహారపు అలవాట్లను ఇష్టాఇష్టాలను వ్యక్తిగతంగా నియంత్రించుకోవడం మరియు క్రమశిక్షణతో ఉండటం ఎల్లప్పుడు సులభం కాదు. ముఖ్యంగా ఆహారం మీద కోరికలు నియంత్రించుకోలేరు, కానీ, యోగా ద్వారా ఈ ఫుడ్ కర్వింగ్స్(ఆహారం మీద కోరికలను)నియంత్రించుకోవచ్చని యోగా ద్వారా నిరూపించబడినది.  రెగ్యులర్ గా యోగా చేసే వారు ఆకలి ఎలా కంట్రోల్ ఉంటుందనే విషయాన్ని యోగా ద్వారా గమనించారు. ఆకలి కోరికలను అరికట్టడానికి యోగ సహాయపడుతుందని అంటారు . ఆసక్తికరంగా ఉంది కదూ, రెగ్యులర్ గా యోగా చేసే వారు శరీరాన్ని ఫిట్ గా ఉంచడం , వారి మనస్సును విశ్రాంతి పరచడం , వారి శరీరాలు సంతృప్తికరంగా మార్చుకోవడం మాత్రమే కాదు, యోగా ద్వారా స్వీయ క్రమశిక్షణ ఉంచుతుంది మరియు యోగా వల్ల యోగా సాధకులల్లో తరచూ ఆకలి అరికట్టేందుకు అత్యంత ఎఫెక్టివ్ గా సహాయపడుతుందని అంగీరించారు. ఆకలి నిరోధించే యోగ సులభమైన భంగిమ  యోగ సెషన్స్ లో సాధారణంగా వివిధ శ్వాస వ్యాయామ...

సంతాన సాఫల్య యోగా అంటే ఏమిటి? సంతాన సాఫల్య యోగా యొక్క కొన్ని లాభాలు...

ఎవరన్నా యోగా గురించి అనుకున్నప్పుడు, దాన్ని ఒక బరువు తగ్గే పద్ధతిగానో, పొందికగా కన్పించే మరియు చురుకుతనాన్ని పెంచే పద్ధతిగానో అలాంటి లాభాలకోసమేనని భావిస్తారు. నిజానికి, ఫ్లెక్సిబిలిటీ మరియు టోనింగ్ యే కాక, యోగాకి ఇతరలాభాలు కూడా ఉన్నాయి, అందులో సంతాన సాఫల్యతను మెరుగుపర్చటం కూడా ఒకటి. మీరు గర్భవతి అవటానికి మరియు మిమ్మల్ని ఆ దశకి తయారుచేయటానికి యోగా మంచి మార్గం.  యోగాలో చాలారకాల పద్ధతులు, యోగాసనాలు కూడా చాలానే ఉన్నాయి. ప్రతి యోగాసనం శరీరం మరియు మనస్సును బలోపేతం చేయటమే కాదు, మీ శరీరంలో తిరిగి సమతుల్యత సాధించటానికి కూడా ఉపయోగపడుతుంది. కేవలం శారీరక సమతుల్యత, చలాకీదనం మాత్రమే కాదు, మీ శరీర తీరు, పనులు, మీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అన్నిటిమధ్యా మంచి సమతుల్యత వస్తుంది. సంతాన సాఫల్య యోగాలో హార్మోన్లను ఉత్పత్తి చేసే వినాళ వ్యవస్థ మరియు ప్రత్యుత్పత్తి వ్యవస్థను ప్రేరేపించే యోగాసనాలు ముఖ్యంగా ఉంటాయి. మీ వినాళగ్రంథుల వ్యవస్థ సరిగా ఉండటం సరైన హార్మోన్ల సమతుల్యత కోసం అవసరం, అందుకని దానికి సంబంధించిన ఆసనాలతో హార్మోన్ల వ్యవస్థను బాగా చూసుకోవటం ఎంత ముఖ్యమో ప్రత్యుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యకరంగా చే...

స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారా?ఐతే ఈ స్మార్ట్ యోగలు మీకోసమే..

మొబైల్ ఫోన్ వాడటం వలన మీకు మెడనొప్పివస్తోందా? లేక తలనొప్పి? లేదా భుజాలనొప్పి?  ఈనాటి అత్యాధునిక టెక్నాలజీ యుగంలో మొబైల్ ఫోన్ అనేది ప్రపంచమంతటా అత్యధికంగా వాడబడుతున్న తనటంలో అతిశయోక్తి లేదు. చదువునుండి ఆరోగ్యందాకా, మానవ సంబంధాలనుండి వ్యాపారందాకా, మొబైల్ ఫోన్లు ప్రపంచాన్ని సమూలంగా మార్చివేస్తున్నాయి.  అయితే అతిగా మొబైల్ ఫోన్లను వాడటం వల్ల జీవనశైలిలో వచ్చే ఇబ్బందులూ పెరిగాయి. ఉదాహరణకు మీరు ఈ వ్యాసాన్ని మీ మొబైల్ లో చదువుతున్నారనుకోండి, మీ మోచేతులు శరీరానికి రెండుపక్కలా వంగి ఉన్నాయి, వెన్ను వంగి ఉంది, మెడ కొంచెం ముందుకు వంగి, తలను నిలబెడుతోంది, అవునా? ఈ భంగిమలో ఉండటం, మీరు గమనించినా, లేకున్నా సరే మీకు బహుశా నొప్పిని కలిగిస్తూ ఉండవచ్చు. ఇది వైద్య పరిభాషలో ‘టెక్స్ట్ నెక్' అని పేర్కొనే ఆరోగ్య విపరిణామానికి దారితీయవచ్చు. టెక్స్ట్ నెక్ అనేది ఒక జీవనశైలి సమస్య. ఎక్కుసేపు ముందుకు వంగిన భంగిమలో గడిపేవారికి మెడ, వెన్నులో వచ్చే నెప్పి ఇది. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు,  -బుక్ రీడర్లు అతిగా వాడటంవలన ఇది రావచ్చు.  మీ తల సాధారణంగా స్థిరంగా ఉన్నపుడు - అంటే మీ చెవులు మీ భుజా...

వృక్షాసనం చేయండిలా...!

i) వృక్షాసనం చేసేటప్పుడు సమస్థితిలో నిలబడి ఎడమ కాలును మోకాలు వద్ద వంచి ఎడమ మడిమను మూలస్థానం వద్ద ఉంచుతూ, పాదాన్ని కుడి తొడకు అదిమి పట్టి ఉంచాలి. పాదము భూమికి లంబంగా, వ్రేళ్ళు నేలపైవైపు ఉండాలి, చేతులు నడుముపైన ఉంచాలి. ii) గాలి పీలుస్తూ కుడికాలిని సమంగా నిలిపి రెండు చేతులు ప్రక్కలకు లాగుతూ భూమికి సమాంతరంగా అర చేతులు నేల వైపు చూపాలి. iii) గాలి పీలుస్తూ రెండు చేతులూ తలపైకి తీసుకెళ్ళి అరచేతులను కలిపి శరీరం మొత్తాన్ని పైకి లాగాలి. గాలి వదులుతూ ii స్థితిలోకి రావాలి. అలాగే మళ్ళీ గాలి వదులుతూ i స్థితిలోకి రావాలి. తర్వాత సమస్థితిలోకి రావాలి. లాభాలు : కాలి కండరాలకు అధిక వ్యాయామం కల్గుతుంది. ఇలా చేసిన వ్యక్తికి తన శరీరం యొక్క సంతులున జ్ఞానం కల్గుతుందంటున్నారు యోగా నిపుణులు.

నిటారుగా ఉండే వెన్నెముక కోసం చెయ్యవలసిన యోగ !

మీరు నిటారుగా ఉన్న వెన్నెముక వల్ల కలిగే ప్రయోజనాలను గూర్చి ఎప్పుడైనా గుర్తించారా? వంగి ఉన్న వెన్నెముక వల్ల వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి నష్టపరిచేదిగా మాత్రమే కాకుండా, అనేకమైన ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా వేగంగా పరుగులు తీసే నేటి జీవన గమనంలో, వంగి ఉన్న వెన్నెముక వల్ల కలిగే సమస్యలనేవి సాధారణ ప్రజలకు విసుగును తెప్పించేవిగా ఉన్నాయి.  వక్రంగా ఉన్న వెన్నెముక అనేది, తరచుగా తప్పుడు స్థితిలో కూర్చోవడం వల్ల (లేదా) తలను వంచి నడవటం వల్ల కలిగే ఫలితమని చెప్పవచ్చు. గత కొన్ని దశాబ్దాల నుంచి, వెన్నెముక ఆరోగ్యం అనేది ప్రధానమైన ఆరోగ్య సమస్యల్లో ఒకటి ఉంది. మరియు ఇది ఆరోగ్యకరమైన శరీరాన్ని సూచించేందుకు వెన్నెముక ఆరోగ్యం చాల కీలకమైనదని సరిగ్గా చెప్పబడినది. కాబట్టి, ఎవరైతే వెన్నెముక సమస్యలను ఎదుర్కొంటున్నారు అలాంటి వారికోసం ఏదైనా పరిష్కారం ఉందా ? అవును ఉంది ! యోగాను ప్రతినిత్యం సాధన చేయటం వల్ల వెన్నెముక సమస్యలతో బాధపడుతున్నా వారికి సత్వరమే నివారణ చర్యలను చేపట్టి త్వరగా ఉపశమనాన్ని కలిగిస్తుంది మరియు మీ వెన్నెముకను నిటారుగా ఉంచడానికి సహాయపడుతుంది.  వెన్నెముక సమస్య అనేది ఒక వ్యక్...

యువతులకు యోగా

కోమలమైన శరీరం, అందం మీ దరి చేరాలంటే యోగా తప్పనిసరి అంటున్నారు యోగా గురువులు. ముఖ్యంగా యువతులకు యోగా ఎంతో లాభం అంటున్నారు వారు. ఈ యోగా మిమ్మల్ని అందంగా, నాజూకుగా, సెక్సీగానూ చేస్తుందంటున్నారు వారు. ముఖ వర్చస్సు మీ శరీరం ఏ రంగులోనున్నాసరే, ముఖం కోమలంగా, కళకళలాడుతుండాలంటే యోగా చేయడంతో మీరు అందర్నీ ఆకర్షిస్తారంటున్నారు యోగా గురువులు. మన ముఖ వర్చస్సు తేజోవంతంగా వుండాలంటే దానికి మన ఉదరం, నోరు ప్రధానమైనవి. ఈ రెండింటిని శుభ్రంగా వుంచుకోవడం ఉత్తమమైన మార్గం. దీనికి సంబంధించి నాలుగు ఉపాయాలున్నాయి. **1 ముందుగా మెడను శుభ్రపరుచుకోవాలి. **2 నోటికి సంబంధించి వ్యాయామం, బ్రహ్మ ముద్ర. **3 సర్వాంగ ఆసనం, శీర్షాసనం. **4 జలనేతి, కపాలభాంతి ప్రాణాయామం. ఇవి చేసిన తర్వాత ఐదు నిముషాలపాటు ధ్యానం చేయండి. శరీర సౌందర్యం శరీరం పుష్టిగావుంటే సౌందర్యం ఇనుమడిస్తుంది. దీంతో ఆరోగ్యంతోబాటు అందంగానూ ఉంటుంది. శరీర సౌందర్యానికి సంబంధించినంతవరకు మనయొక్క వెన్నెముక, శరీరంలోని మాంసం ప్రధాన పాత్రను పోషిస్తాయని యోగా గురువులు తెలిపారు. ఇందులో అధిక కొవ్వువుంటే కాస్త ప్రమాదమే. కాని శరీరానికి కావలసినంత కొవ్వుకూడా అవసరమేనంటున్నారు...

నాడీ వ్యవస్థ పనితీరును మెరుగు పరిచే సర్వాంగాసన

సర్వాంగాసన అనే పదం సంస్కృత భాషలో నుంచి వచ్చింది. సర్వ, అంగ, ఆసన అనే మూడు పదాల కలయికే సర్వాంగాసన. సర్వ అంటే అన్ని, అంగ అంటే శరీరంలోని భాగాలు, ఆసన అంటే యోగ పరమైన భంగిమ. సర్వాంగాసన అంటే శరీరంలోని అన్ని భాగాలతో కలిసి చేసే యోగ భంగిమ. చేసే విధానం 1. సమతల ప్రాంతంపై పడుకుని శరీరాన్ని సమాంతరంగా ఉంచండి. కాళ్లను పైకి చాపి చేతులను వదులుగా ఉంచాలి. అరచేతులను భూమికి ఆన్చాలి. 2. గాలి పీలుస్తూనే మోకాళ్లను ఛాతీ సమీపానికి తీసుకురావాలి. అరచేతులను వెనక్కు తిప్పాలి. తొడలను పైకిలేపే సమయంలో పిర్రలకు సహాయంగా అరచేతులు ఆన్చాలి. 3. అరచేతులను తొడల లోపలికి పోనిచ్చి మోకాళ్లను నుదురు సమీపానికి తీసుకురావాలి. ఈ సమయంలో కాళ్లను నేరుగా పైకి ఎత్తాలి. 4. ఊపిరి వదులుతూ వెన్ను, కాళ్లను నేరుగా ఉంచుతూనే మోచేతులను భుజాలకు సమాంతరంగా లేపాలి. కాళ్లను నేరుగా పైకి చాపి కాలి వేళ్లను సడలించాలి. వీటితోపాటే కాళ్లు, శరీరాన్ని కొద్దిగా సడలించాలి. 5. అరచేతులను భుజాల మీదకు తీసుకురావాలి. 6. ఊపిరి తీసుకుంటూనే భంగిమ నుంచి సాధారణ స్థితికి రావాలి. ఊపిరి వదులుతూ మోకాళ్లను వంచుతూ ఛాతీ మీదకు తీసుకురావాలి. చిన్నగా తొడలను కిందకు దించుతూ పిరుదులను ...

బరువు తగ్గాలనుకుంటే ఈ ఆసనం చేయండి

బరువు తగ్గడానికి రకరకాల మందులు, డైటింగ్ తదితరాలు చేపడుతుంటారు. కాని తేలికగావుండే ఈ ఆసనం చేస్తే బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చంటున్నారు యోగా నిపుణులు. ఆ ఆసనం పేరేంటో తెలుసా.. "హస్త ఉత్తాన ఆసనం". హస్త ఉత్తాన ఆసనం:   ఉత్తానమంటే పైకి లేపడం. చేతుల్ని పైకి లేపి చేసే ఆసనం గనుక దీన్ని హస్త ఉత్తాన ఆసనం అన్నారు. రెండు చేతులనూ నిటారుగా ఆకాశమువైపు జతగా సాచి నిదానంగా, నిండుగా ఊపిరిని తీసుకుని లోపల బంధించాలి. ఇదే స్థితిలోనడుము పైభాగము నుంచి అర చేతుల వరకూవున్న శరీరాన్ని వీలైనంత వెనక్కి వంచాలి. ఈ స్థితిలో చేతులు, భుజాలు, ఉదర స్థానం బాగా సాగడంవలన అవి పటిష్టంగా తయారవుతాయి. పొట్ట సాగడంవలన జీర్ణ శక్తి పెరుగుతుంది. ఊపిరితిత్తులు బలాన్ని పెంచుకుంటాయి. కొవ్వు కరగటం ద్వారా క్రమంగా బరువు తగ్గుతుంది. ఈ ఆసనం చేసేటప్పుడు ప్రారంభంలోనే వెన్ను పూర్తిగా వెనక్కి వంచే ప్రయత్నం చేయకూడదు. ప్రారంభంలో కొంతమందికి కళ్ళు తిరిగి చీకట్లు కమ్మి కింద పడే అవకాశం ఉంది. అలా జరిగితే మరోసారి ప్రయత్నించేటప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి, కాళ్ళు, పాదాలు తగినంత ఎడంగావుంచి వెన్ను వెనక్కు వంచగలిగే స్థితికి మాత్రమే వ...

టీనేజర్స్ లో బరువు తగ్గించే సులభ వ్యాయామాలు!

ప్రస్తుత రోజుల్లో టీనేజర్స్ లో కూడా ఊబకాయన్ని చూస్తున్నాం. అందుకు కారణం అపక్రమ ఆహార శైలి మరియు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం. ఇదికాకుండా, సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ మరియు ఇంటర్నెట్ వంటివి వారి పొటాటో కోచ్ లా తాయారు చేస్తాయి. దాంతో వారు నిజమైన ప్రపంచంతో పరిచయం కోల్పోయిన వాస్తవ ప్రపంచంలో జీవిస్తున్నారు. దాని ఫలితం, టీనేజర్స్ లో ఊబకాయం మరియు అనుకోకుండా అపూర్వమైన విధంగా అధిక బరువు పెరగడం. టీనేజర్స్ బరువు తగ్గడానికి మంచి పద్దతి వారు యాక్టివ్ గా ఉండటమే.  టేనేజర్ చిన్న వయస్సులో ఉన్నప్పుడే ఫిజికల్ యాక్టివిటీస్ సాధారణంగా ఉంటాయి. కాబట్టి బరవు తగ్గాలని కోరుకొనే టీనేజర్స్ ఫేస్ బుక్ ను సెలవు తీసుకొని అవుట్ డోర్ యాక్టివిటీస్ లో పాల్గొనడమే. అంతే కంటే ముందు, రెగ్యులర్ వెయిట్ లాస్ వ్యాయామాలు నిజంగా మిమ్మల్ని తిరిగి యాథాస్థితికి తీసుకొచ్చి మిమ్మల్ని స్లిమ్ గా మార్చుతాయి. మరి టీనేజర్స్ బరువు తగ్గించుకోవడానికి కొన్ని విలువైన వ్యాయామాలు క్రింది విధంగా ఉన్నాయి పరిశీలించండి.. రన్నింగ్:  మీరు టీనేజ్ లో ఉన్నట్టైతే, మీ జీవక్రియలను నిధానం అవ్వడంలో మీరు ఇంకా యవ్వనంగా ఉన్నట్లే. కాబట్టి మంచి ...

యోగాతో నిద్రలేమిని సమస్యను జయించండి

నవీన యుగంలో చాలామందిని పట్టి పీడిస్తున్న సమస్య నిద్రలేమి. దీనినే వైద్య పరిభాషలో ‘ఇన్‌సోమ్నియా' అంటారు. ఇటీవల జరిపిన సర్వేల ప్రకారం ఈ సమస్యతో బాధపడేవారు ప్రతి నలుగురిలో ఒకరు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ సమస్య వినటానికి చిన్న సమస్యగానే అనిపిస్తుంది గాని ఈ సమస్యను అనుభవించేవారి బాధ ఇంతా అంతా కాదు. నిద్రకు సంబంధించిన సమస్యలన్నింటినీ నిద్రలేమి (ఇన్‌సోమ్నియా)గా పరిగణించడం తరచూ జరుగుతుంటుంది.  ఈ పదానికి అర్థం నిద్రలేమి అయినప్పటికీ ఇది మూడు సమస్యలను సూచిస్తుంది: 1. నిద్రలోకి వెళ్ళడం కష్టం కావడం  2.నిద్రావస్థలో ఎక్కువ సేపు ఉండలేకపోవడం. 3. నిద్ర లేచిన తరువాత తాజాగా అనిపించకపోవడం. నిద్రలోకి జారుకోలేకపోవడం, ఒకవేళ నిద్రపోయినప్పటికీ తెల్లవారుఝామునే లేవడం, రాత్రిళ్ళు మధ్య మధ్యలో మెలకువ రావడం, ప్రశాంతమైన నిద్రలేక పోవడంలో అన్న వాటిలో ఒకటి రెండు లక్షణాలు కానీ లేదా అన్నీ కానీ ఉండటమే స్లీప్‌ డిజార్డర్‌ లేదా ఇన్‌సోమ్నియా అని ఆధునిక వైద్యం అభివర్ణిస్తోంది. నిద్రలేమిని ఎదుర్కోవడానికి యోగా గ్రేట్ గా సహాయపడుతుంది. యోగ వల్ల మనస్సు ప్రశాతం పడుతుంది, మరియు మంచి నిద్రపడుతుంది. దాంతో మరుసటి రోజు ఉదయం...

బెల్లీ ఫ్యాట్ తగ్గించే 5 సింపుల్ యోగాసనాలు

ఫిట్ నెస్...ఫిట్ నెస్ అంటూ పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో మహిళల్ని వేధిస్తున్న సమస్యల్లో పొట్ట దగ్గర పేరుకుపోతున్న కొవ్వు కూడా ఒకటి. అయితే యోగాసనాల ద్వారా ఈ సమస్యను కూడా పరిష్కరించుకోవచ్చు. ఈ క్రమంలో పొట్టతగ్గడానికి ఉపకరించే కొన్ని ఆసనాల గురించి తెలుసుకుందాం... కపాలభాతి కపాలభాతి కఫాలం అంటే పుర్రె. భాతి అంటే ప్రకాశించడం అని అర్ధం. మనం తీసుకున్న గాలి మెదడుకు ఎక్కువగా చేరి, అక్కడున్న కేంద్రాలన్నీ ప్రకాశవంతమవుతాయి . అలాగని ఇది ప్రాణాయామం కాదు. ఇది ఒక క్రియ. కపాలభాతి వల్ల మన శరీరంలో అణువణువుకీ ఆక్సిజన్ బాగా అందుతుంది. ఇంకా ఈ ఆసనం వేసేటప్పుడు పొట్టను ముందుకు, వెనుకకు కదలించడం వల్ల పొట్ట దగ్గర ఉండే కొవ్వు చాలా తొందరగా తగ్గుతుంది. ముందుగా వజ్రాసనం లేదా సుఖాసనంలో కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి, ముక్కు రంధ్రాల ద్వార శ్వాసని బలంగా బయటకు వదలాలి. అలా గాలిని బయటకు వదిలేటప్పుడు లోపల నుంచి కాకుండా ముక్కు రంధ్రాల చివర నుంచి వదలాలి. కేవలం గాలిని బయటకు వదలడంపైనే మీ దృష్టి పెట్టాలి. తర్వాత మెల్లగా శ్వాసతీసుకోండి. శ్వాస బయటకు విడిచిపెట్టిన ప్రతిసారీ పొట్టని లోపలికి లాగుతూ ఉండాలి. ఇలా సెకనుకు ఒకటి చొప్ప...