కోమలమైన శరీరం, అందం మీ దరి చేరాలంటే యోగా తప్పనిసరి అంటున్నారు యోగా గురువులు. ముఖ్యంగా యువతులకు యోగా ఎంతో లాభం అంటున్నారు వారు. ఈ యోగా మిమ్మల్ని అందంగా, నాజూకుగా, సెక్సీగానూ చేస్తుందంటున్నారు వారు.
మీ శరీరం ఏ రంగులోనున్నాసరే, ముఖం కోమలంగా, కళకళలాడుతుండాలంటే యోగా చేయడంతో మీరు అందర్నీ ఆకర్షిస్తారంటున్నారు యోగా గురువులు. మన ముఖ వర్చస్సు తేజోవంతంగా వుండాలంటే దానికి మన ఉదరం, నోరు ప్రధానమైనవి.
ఈ రెండింటిని శుభ్రంగా వుంచుకోవడం ఉత్తమమైన మార్గం. దీనికి సంబంధించి నాలుగు ఉపాయాలున్నాయి.
**1 ముందుగా మెడను శుభ్రపరుచుకోవాలి.
**2 నోటికి సంబంధించి వ్యాయామం, బ్రహ్మ ముద్ర.
**3 సర్వాంగ ఆసనం, శీర్షాసనం.
**4 జలనేతి, కపాలభాంతి ప్రాణాయామం. ఇవి చేసిన తర్వాత ఐదు నిముషాలపాటు ధ్యానం చేయండి.
శరీరం పుష్టిగావుంటే సౌందర్యం ఇనుమడిస్తుంది. దీంతో ఆరోగ్యంతోబాటు అందంగానూ ఉంటుంది. శరీర సౌందర్యానికి సంబంధించినంతవరకు మనయొక్క వెన్నెముక, శరీరంలోని మాంసం ప్రధాన పాత్రను పోషిస్తాయని యోగా గురువులు తెలిపారు.
ఇందులో అధిక కొవ్వువుంటే కాస్త ప్రమాదమే. కాని శరీరానికి కావలసినంత కొవ్వుకూడా అవసరమేనంటున్నారు వారు. దీనికి సమతుల్యమైన ఆహారంతో శరీరంలోని ఎముకలకు పటిష్ఠత ఏర్పడుతుందని వారు పేర్కొన్నారు. దీనికికూడా నాలుగు ఉపాయాలున్నాయంటున్నారు యోగా గురువులు.
**1 తేలిక పాటి వ్యాయామం చేయండి.
**2 ముఖ్యంగా ఆరు రకాల ఆసనాలు వేయండి- తాడాసనం, త్రికోణాసనం, పశ్చిమోత్తాసనం, ఉష్ట్రాసనం, ధనురాసనం, నౌకాసనం.
**3 ప్రాణాయామం
**4 మాలిష్ చేసుకోవడం.
వీటితోబాటు మీరు తీసుకునే ఆహారంకూడా తేలికపాటిదైవుండాలంటున్నారుయోగా గురువులు.
ముఖ వర్చస్సు

శరీర సౌందర్యం

Comments
Post a Comment