Skip to main content

స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారా?ఐతే ఈ స్మార్ట్ యోగలు మీకోసమే..

మొబైల్ ఫోన్ వాడటం వలన మీకు మెడనొప్పివస్తోందా? లేక తలనొప్పి? లేదా భుజాలనొప్పి? 

ఈనాటి అత్యాధునిక టెక్నాలజీ యుగంలో మొబైల్ ఫోన్ అనేది ప్రపంచమంతటా అత్యధికంగా వాడబడుతున్న తనటంలో అతిశయోక్తి లేదు. చదువునుండి ఆరోగ్యందాకా, మానవ సంబంధాలనుండి వ్యాపారందాకా, మొబైల్ ఫోన్లు ప్రపంచాన్ని సమూలంగా మార్చివేస్తున్నాయి.

 అయితే అతిగా మొబైల్ ఫోన్లను వాడటం వల్ల జీవనశైలిలో వచ్చే ఇబ్బందులూ పెరిగాయి. ఉదాహరణకు మీరు ఈ వ్యాసాన్ని మీ మొబైల్ లో చదువుతున్నారనుకోండి, మీ మోచేతులు శరీరానికి రెండుపక్కలా వంగి ఉన్నాయి, వెన్ను వంగి ఉంది, మెడ కొంచెం ముందుకు వంగి, తలను నిలబెడుతోంది, అవునా? ఈ భంగిమలో ఉండటం, మీరు గమనించినా, లేకున్నా సరే మీకు బహుశా నొప్పిని కలిగిస్తూ ఉండవచ్చు. ఇది వైద్య పరిభాషలో ‘టెక్స్ట్ నెక్' అని పేర్కొనే ఆరోగ్య విపరిణామానికి దారితీయవచ్చు.
టెక్స్ట్ నెక్ అనేది ఒక జీవనశైలి సమస్య. ఎక్కుసేపు ముందుకు వంగిన భంగిమలో గడిపేవారికి మెడ, వెన్నులో వచ్చే నెప్పి ఇది. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, 

-బుక్ రీడర్లు అతిగా వాడటంవలన ఇది రావచ్చు. 

మీ తల సాధారణంగా స్థిరంగా ఉన్నపుడు - అంటే మీ చెవులు మీ భుజాలకు పైగా ఉండేలా తల ఉన్నప్పుడు - మీ తల సుమారు 4.5 కేజీల బరువు ఉంటుంది. మీ తలను ముందుకు వంచినపుడు, అలా వంగే ప్రతీ అంగుళానికీ మీ వెన్నెముకపై కలిగే ఒత్తిడి రెట్టింపు అవుతూ పోతుంది. కాబట్టి మీరు మీ స్మార్ట్ ఫోన్ నో, లేదా ట్యాబ్ నో ఉపయోగిస్తున్నపుడు మీ మెడ 10 నుండి 14కేజీల బరువు మోస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ అధికఒత్తిడి మీ వెన్నెముకను అదికంగా సాగదీసి సమతుల్యతను కోల్పోయేలా చేయవచ్చు.

ఒక్క క్షణం! మిమ్మల్ని నిరుత్సాహపరచి ఈ పరికరాల్ని వాడవద్దని చెప్పటం మా ఉద్దేశం కాదు. మనలో ప్రతీ ఒక్కరి జీవితాన్నీ ఈ బుల్లిబుల్లి పరికరాలు ఎంతో సౌకర్యవంతంగా చేస్తున్నాయి. అయితే వాటి వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలను దూరంగా ఉంచటానికి కొన్ని చిట్కాలు సహాయపడతాయి. కొన్ని చక్కని యోగా సూత్రాలు మీకెలా సహాయపడతాయో ఇపుడు చూద్దాం.
బలంగా ఉండి, సులభంగా వంగగలిగే వెన్ను, మెడభాగాలు మనకు అధిక ఒత్తిడిని తట్టుకోవటంలో సహాయపడి, మొబైల్ ఫోన్ తరచుగా వాడటంవల్ల కలిగే నొప్పులను తగ్గిస్తాయి. ఇక్కడ చెప్పబడిన యోగ వ్యాయామాలు వెన్నుకు,మెడ కండరాలకు బలాన్ని, విశ్రాంతిని ఇస్తాయి. వీటిని నిత్యమూ సాధనచేస్తూ ఉంటే మీ కిష్టమైనవారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు హటాత్తుగా మెడ పట్టేయడం లాంటి ఇబ్బందులనుండి తప్పించుకోవచ్చు!!

చెవి తమ్మెల మర్దనా:


 చెవుల పైభాగం నుండి మొదలుపెట్టి తమ్మెల వరకూ నొక్కండి. ఒకటి రెండు సార్లు తమ్మెలను కిందకు లాగండి. చెవులను సవ్య దిశలోనూ, అపసవ్యదిశలనూ కొద్దిసార్లు త్రిప్పటంవలన చెవుల చుట్టూ ఉండే ఒత్తిడి దూరమవుతుంది.

చెతులను సాగదీయండి:


 అరచేతులను ఆకాశంవైపు ఉండేలా చేతుల్ని పైకి చాపండి. అలా చేతుల్ని సాగదీయండి. అక్కడినుండి నెమ్మదిగా చేతుల్ని రెండు పక్కలకూ చాపి, వేళ్ళను అటూఇటూ ఊపుతూ మీ భుజాలు, మోచేతులలోని ఒత్తిడికి టాటా చెప్పేయండి. 

భుజాలను గుండ్రంగా తిప్పండి:


 మోచేతులను పక్కకు చాపి ఉంచండి. బొటనవేలిని చిటికెనవేలి మొదట్లో ఉంచండి. ఇప్పుడు చేతులను కదపకుండా భుజాలనుమాత్రం సవ్యదిశలో 5 సార్లు, అపసవ్యదిశలో 5 సార్లు తిప్పండి.

అరచేతులను వత్తండి: 


అరచేతులను ఛాతీకి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లుగా ఉంచండి. భుజాలను స్థిరంగా ఉంచి, అరచేతులను ఒకదానికొకటి గట్టిగా వత్తి, మరలా వదులు చేయండి. ఇలా రెండుసార్లు చేసినాక, అరచేతులను వెనక్కు తిప్పిమరలా రెండుసార్లు చేయండి. 

మోచేతులతో ఎనిమిది అంకె: 


అరచేతులను ఛాతీకి ఎదురుగా ఉంచి, వేళ్ళను పెనవేయండి. ఇపుడు అరచేతులను ఛాతీకి ఎదురుగా ఉంచి మోచేతులను, భుజాలను నీటి అలలవలే కదుపుతూ (కిందకు వాలి ఉన్న ఎనిమిది) అంకె ఆకారంలో తిప్పండి. 

భుజాలను సాగదీయండి:


 కుడిచేతిని తలపై పెట్టుకోండి. ఎడమచేత్తో ఎడమమోకాలిని గట్టిగా అదిమి ఉంచండి. ఇప్పుడు ఎడమచేతిని అలాగే కదపకుండా ఉంచి, కుడి చేయిని అన్నివైపులా తిప్పుతూ మీ పిరుదులకు తగిలేలా తీసుకువచ్చి, మరలా పైకెత్తండి. ఇలా కొద్దిసార్లు చేసినాక, చేతులు మార్చి మరలా చేయండి.

వేళ్ళకు మర్దనా: 


బొటనవేళ్ళను ఛాతీకి ఎదురుగా తెచ్చి, రెండువైపులా గుండ్రంగా కొద్దిసార్లు తిప్పండి. అన్నివేళ్ళనూ ఒకసారి దగ్గరగా అదిమి, వదలండి. ఇలా రెండుసార్లు చేయండి.

 నొప్పిని ఎదుర్కొనటానికి ఈ యోగాసనాలను చేస్తున్నపుడు, ఈ కింది విషయాలను మరిచిపోవద్దు: మీరు మొబైల్ వాడే భంగిమను మార్చుకోండి: 

మీ చరవాణిని ఒడిలో పెట్టుకుని, వంగి లేదా తల కిందకు వంచి చూస్తూ ఉంటే, ఆ ఫోన్ ను లేదా ట్యాబ్ ను నిటారుగా, కంటి చూపుకు సమానమైన ఎత్తులో ఉండేలా పెట్టుకొనే విధానాన్ని ఎంచుకోండి. 

మధ్యలో విరామం తీసుకోండి: 


మీ చరవాణిని రోజంతా వాడుతున్నారని గుర్తుంచుకోండి. బలవంతంగానైనా మధ్యమధ్య కొంతసేపు విరామం తీసుకుని మీ భంగిమను మార్చుకోండి.

సులభమైన ఈ యోగా వ్యాయామాలను సాధనచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, స్మార్ట్ ఫోన్ యోగిగా మారిపోండి! 

ఇక్కడ చెప్పబడిన యోగాసనాలు శ్రీశ్రీ యోగా సంస్థకు డైరెక్టర్ గా పనిచేస్తున్న కమలేష్ బర్వాల్ గారి సూచనలను అనుసరించి ఇవ్వబడ్డాయి. ఒక దశాబ్దకాలంగా యోగా శిక్షకురాలిగా ప్రసిద్ధి చెందిన ఆమె ప్రపంచవ్యాప్తంగా పర్యటించి భిన్న సంస్కృతుల, భిన్న మతాల ప్రజలకు యోగా వలన కలిగే లాభాలను బోధించారు.






















Comments

Popular posts from this blog

నిద్రలేచిన వెంటనే చేయాల్సిన 5 యోగాసనాలు

ఈ ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యం మీద అవగాహన, బాధ్యత కలిగి ఉండాలి. ఆరోగ్యంగా ఉండటానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. అందుకు యోగా బాగా సహాయపడుతుంది. యోగా చేయాలంటే బద్దకిస్తున్నారా? అయితే మీకు సహాయం చేయడానికి మేమున్నాం.  ప్రతి రోజూ ఉదయం యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని, చాలా మందికి తెలుసు, అయితే ఎంత మంది ఈ పద్దతిని అనుసరిస్తున్నారు? ఖచ్చితంగా ఏ కొద్ది మాత్రమే రోజూ యోగను సాధన చేస్తుంటారు.  మరికొద్దిమంది, యోగ మొదలు పెడతారు ఒక నెలలో, రెండు నెలలో ప్రాక్టీస్ చేసి, ఆపేస్తుంటారు. ఆ తర్వాత ఐదు, ఆరు నెలలు బ్రేక్ తీసుకుని, తిరిగి ప్రారంభిస్తుంటారు. రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే పరగడపుతో యోగాను ప్రాక్టీస్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. రోజూ యోగ సాధన చేయడం వల్ల శరరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. యోగ అనేది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు, దీని వల్ల ఆస్త్మా, వెన్నునొప్పి, ఇతర శ్వాస సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు. నిద్రలేచిన వెంటనే చేయాల్సిన కొన్ని యోగాసనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 1.లార్డ్ ఆఫ్ డ్యాన్స్ ఫోజ్ (నటరాజ ఆసనం):  నటరాజాసన (నట-డ్యాన్స్, రాజ-కింగ్, ఆసన-భంగిమ)...

సూర్యనమస్కారాలతో ఆ సమస్య తగ్గుతుంది...

రకరకాల ఒత్తిళ్లతో బిజీగా ఉండే మహిళలకు ఆరోగ్యవంతమైన జీవితం చాలా ముఖ్యం. మరి అదేలా సాధ్యం... రోజూ తీసుకునే ఆహారాలలో పోషక విలువలు అధికంగా ఉండాలి. అలానే రోజుకో ఆపిల్ పండు తీసుకోవాలి. కొన్ని రకాల వ్యాయామాలతో మహిళలు ఆరోగ్యపరమైన జీవితాన్ని పొందవచ్చును. మరి ఆ వ్యాయామాలేంటో.. ఎలా చేయాలో చూద్దాం... అధిక బరువు గలవారు బరువు తగ్గాలనుకుంటే.. స్క్వాట్స్ వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామం చేయడం వలన ఊపిరితిత్తులు, హృదయానికి ఎంతో మేలు చేస్తుంది. తద్వారా బరువు తగ్గుతారు. తరచుగా సూర్యనమస్కారాలు చేయడం వలన నడుము భాగం గట్టి పడుతుంది. అలానే మోకాళ్లపై భాగం దృఢంగా మారుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.  ప్లాంక్స్ వ్యాయామం చేస్తే.. కండారాలకు చాలా మంచిది. ముఖ్యంగా ఛాతీ, కటి వలయ భాగం దృఢంగా మారుతుంది. ఈ వ్యాయామంతో రక్తంలోని చక్కెర స్థాయిలు మెరుగుపడుతాయి. తద్వారా శ్వాస తీసుకోవడంలో అడ్డంకులు ఉండవు. అలానే నెలసరి సమస్యలు అదుపులో ఉంటాయి. వ్యాయామం చేయడం వలన ముడతల చర్మం కాస్త తాజాగా మారుతుంది.

శలభాసనంతో మధుమేహం నియంత్రణ

శలభాసనం తామర స్థితి తెలుపుతుంది. ఇది పశ్చమోత్తనాసనానికి, హలాసనానికి వ్యతిరేక స్థితిలో ఉంటుంది. దీనివలన శరీరానికి ప్రయోజనాలు చేకూరుతాయి. అర్ధ శలభాసనం వేయడానికి మొదట నేలపై పడుకోవాలి. ఉదరం, ఛాతీ,చుబకం నేలను తాకుతూ ఉండాలి. భుజాలు చదునుగా పరచాలి. వేళ్ళను నేలపై ఉంచాలి. పిడికిలి బిగించి పైకి తీసుకు రావాలి. మెల్లగా గాలి పీల్చకుని 10 సెకనులు బిగపట్టాలి. పూర్తిగా గాలి పీల్చకుంటే కాళ్ళు ఎత్తడానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి పూర్తిగా గాలి పీల్చుకోరాదు. ఊపిరి వదలడం మొదలు పెట్టాలి. గాలి పీల్చుతూనే ఆసనాన్ని పూర్తిచేయాలి. నిశ్చ్వాసమనేది కాళ్ళు నేలను చేరేటప్పటికి పూర్తి కావాలి. శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి చేతులు లేదా అరచేయి లేదా పిడికిలి వినియోగించాలి. పిడికిలిని కేవలం అనుభవజ్ఞులు మాత్రమే వినియోగించాలి. మెల్లగా కాళ్ళ వీలైనంత ఎత్తుకు తీసుకురావాలి. నాభి వరకు ఉన్న శరీరభాగం నేలను తాకి ఉండాలి. అది కదలకూడదు. మొండెం చక్కగా ఉండాలి. కాళ్ళు లేపడానికి కేవలం నాభి కింది భాగంలో ఉన్న ప్రాంతాన్ని మాత్రమే వినియోగించాలి. ఉదరం, ఛాతీ, చేతులు, చుబుకం ఖచ్చితంగా ఆసనంలో ఉన్నంతసేపు నేలను తాకే ఉండాలి. కాళ్ళు ఎత్తిన స్థానంల...