Skip to main content

బెల్లీ ఫ్యాట్ తగ్గించే 5 సింపుల్ యోగాసనాలు

ఫిట్ నెస్...ఫిట్ నెస్ అంటూ పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో మహిళల్ని వేధిస్తున్న సమస్యల్లో పొట్ట దగ్గర పేరుకుపోతున్న కొవ్వు కూడా ఒకటి. అయితే యోగాసనాల ద్వారా ఈ సమస్యను కూడా పరిష్కరించుకోవచ్చు. ఈ క్రమంలో పొట్టతగ్గడానికి ఉపకరించే కొన్ని ఆసనాల గురించి తెలుసుకుందాం... కపాలభాతి కపాలభాతి కఫాలం అంటే పుర్రె. భాతి అంటే ప్రకాశించడం అని అర్ధం. మనం తీసుకున్న గాలి మెదడుకు ఎక్కువగా చేరి, అక్కడున్న కేంద్రాలన్నీ ప్రకాశవంతమవుతాయి . అలాగని ఇది ప్రాణాయామం కాదు. ఇది ఒక క్రియ. కపాలభాతి వల్ల మన శరీరంలో అణువణువుకీ ఆక్సిజన్ బాగా అందుతుంది. ఇంకా ఈ ఆసనం వేసేటప్పుడు పొట్టను ముందుకు, వెనుకకు కదలించడం వల్ల పొట్ట దగ్గర ఉండే కొవ్వు చాలా తొందరగా తగ్గుతుంది. ముందుగా వజ్రాసనం లేదా సుఖాసనంలో కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి, ముక్కు రంధ్రాల ద్వార శ్వాసని బలంగా బయటకు వదలాలి. అలా గాలిని బయటకు వదిలేటప్పుడు లోపల నుంచి కాకుండా ముక్కు రంధ్రాల చివర నుంచి వదలాలి. కేవలం గాలిని బయటకు వదలడంపైనే మీ దృష్టి పెట్టాలి. తర్వాత మెల్లగా శ్వాసతీసుకోండి. శ్వాస బయటకు విడిచిపెట్టిన ప్రతిసారీ పొట్టని లోపలికి లాగుతూ ఉండాలి. ఇలా సెకనుకు ఒకటి చొప్పున చెయాలి. ఇలా చేసేటప్పుడు ముఖ కండరాలు, ఛాతీ, భుజాలు మెడ బిగించకూడదు. ఇలా 300సార్లు చేయ్యాలి . అగ్నిసార అగ్నిసార ముందుగా నిటారుగా నిల్చుని రెండు పాదాల దూరంగా ఉంచాలి. మెల్లగా శ్వాస తీసుకుంటూ, బయటకు వదిలేస్తూ రెండు మోకాళ్లనూ కాస్త వంచాలి. ఆ తర్వాత రెండు చేతులనూ రెండు మోకాళ్లకు కొంచెం పైన పెట్టాలి. శ్వాస పూర్తిగా వదిలిన తర్వాత మళ్ళీ వెంటనే శ్వాస తీసుకోకుండా అలానే ఉంటూ పొట్టను ముందుకు, వెనుకకు కదిలించాలి. అలా ఎన్నిసార్లు కదిలించగలిగితే అన్ని సార్లు చేయాలి. తర్వాత శ్వాసతీసుకుంటూ మెల్లగా యథాస్థితికి వచ్చి నిలబడాలి. తర్వాత మళ్లీ ఇదే విధంగా చేయాలి. ప్రారంభించిన మొదట్లో ఎక్కువసార్లు కదిలించలేరు. 

కానీ బాగా అభ్యాసం చేస్తే రోజురోజుకూ ఈ ఆసనం వేయడం సులభమవుతుంది. 10-50సార్లు చేయవచ్చు. రోజుకు 5సెట్స్ లెక్కన చెయ్యాలి. ఉదయం సమయంలో ఈ ఆసనం వల్ల చాలా అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. ఉత్థాన పాదాసనం ఉత్థాన పాదాసనం ముందుగా వెల్లకిలా పడుకుని రెండు చేతులూ శరీరానికి రెండు పక్కలా ఉండాలి. శ్వాసతీసుకుంటూ మెల్లగా రెండు కాళ్ళు పైకి లేపాలి. అలా 90డిగ్రీలు వచ్చే వరకూ లేపి, తర్వాత మెల్లగా 30డిగ్రాల వరకూ కిందకు తీసుకురావాలి. కాళ్లను పూర్తిగా నేలపై పెట్టకూడదు. అలా 30డిగ్రాలు వచ్చేలా కాళ్లు పెట్టాక ఆ భంగిమలో సెకన్లు అలానే ఉండాలి. మళ్లీ 30డిగ్రీల నుండి 90డిగ్రీలకు కాళ్ళు లేపాలి. ఇలా 10నుంచి 20సార్లు కాళ్లు పూర్తిగా కింద పెట్టకుండా చేయాలి. అలాగే ఈ ఆసనంలో కాళ్ళు పైకి లేపే సమయంలో తల పైకి ఎత్తకూడదు. 

ఈ ఆసనం మొదటి సారి చేసేప్పుడు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లే వేయాలి. తర్వాత రోజుకు కొంత సంఖ్య పెంచుతూ ఉండాలి. నడుము నొప్పి ఉన్నవారు రెండు చేతులూ శరీరానికి పక్కన కాకుండా నడుము క్రింది పెట్టుకుని చేయవచ్చు, ఈ ఆసనం వల్ల పొట్ట చాలా త్వరగా తగ్గుతుంది. నేకాసనం నేకాసనం ముందుగా వెల్లకిలా పడుకుని రెండు కాళ్లు, చేతులు, తల, భుజాలు మెల్లగా పైకి లేపాలి. తల, పాదాలు ఒకే ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. శరీర బరువంతా పిరుదలపైన ఉండాలి. మీ ధ్యాస అంతా పొట్టపైనే పెట్టాలి. శ్వాస మామూలుగానే తీసుకుంటూ ఇదే స్థితిలో 20సెకన్లు ఉండాలి. ఇలా 6 సార్లు చేయాలి. నేకాసనం వేయడం వల్ల పొట్ట దగ్గర ఉండే కొవ్వు తగ్గడమే కాకుండా జీర్ణశక్తికి కూడా ఇది దోహదపడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు ఉన్నవారికి ఇది చక్కగా ఉపకరిస్తుంది. మకరాసనం మకరాసనం ఈ ఆసనం వేసినపుడు చూసే వారికి మొసలి ముందుకు వస్తుంటే ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంటుంది.

 అందుకే దీనికి మకరాసనం అని పేరు. ఈ ఆసనం వేయడానికి ముందుగా పొట్ట నేలకు ఆనించి బోర్లాపడుకోవాలి. రెండు కాళ్ళు దగ్గరకు పెట్టుకోవాలి. రెండు అరచేతులు ఒకదానిపై ఒకటి పెట్టి గడ్డం కింద పెట్టాలి. తల భుజాలు పైకి లేపాలి. కుడి మోకాలు పైకి మడిచి తల, భుజాలు ఎడమ పక్కకు తిప్పి శ్వాస వదులుతూ పక్కకు చూడాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ యధాస్థితికి అంటే మధ్యలోకి రావాలి. 

ఇప్పుడు కుడి కాలు కింద పెట్టి ఎడమ కాలితో ఇదే విధంగా కుడివైపుకు తిరిగి చేయాలి. మళ్లీ శ్వాస వదులుతూ యధాస్థితికి రావాలి. ఇలా కుడి, ఎడమ రెండుపక్కలా 20సార్లు చేయాలి. ఈ ఆసనం వేసేటప్పుడు తలను కింద పెట్టకూడదు. మెడనొప్పి, నడుము నొప్పి సమస్యలున్నవారు ఈ ఆసనం వేయకూడదు.

 దీని ద్వారా పొట్టదగ్గర, నడుము దగ్గర ఉండే కొవ్వు తొందరగా తగ్గుతుంది. ఈ 5 ఆసనాలు కలిపి రోజూ అభ్యాసం చేస్తే పొట్ట దగ్గర ఉన్న కొవ్వును 20రోజుల్లోనే తగ్గించుకోవచ్చు. రోజూ గంటల తరబడి వ్యాయామం చేస్తూ కిలోమీటర్లు పరుగులు పెట్టేకన్నా...ఇంట్లోనే ఒక అరగంట క్రమం తప్పకుండా చేస్తే పొట్టను తగ్గించుకోవచ్చు.

కపాలభాతి


 కఫాలం అంటే పుర్రె. భాతి అంటే ప్రకాశించడం అని అర్ధం. మనం తీసుకున్న గాలి మెదడుకు ఎక్కువగా చేరి, అక్కడున్న కేంద్రాలన్నీ ప్రకాశవంతమవుతాయి . అలాగని ఇది ప్రాణాయామం కాదు. ఇది ఒక క్రియ. కపాలభాతి వల్ల మన శరీరంలో అణువణువుకీ ఆక్సిజన్ బాగా అందుతుంది. ఇంకా ఈ ఆసనం వేసేటప్పుడు పొట్టను ముందుకు, వెనుకకు కదలించడం వల్ల పొట్ట దగ్గర ఉండే కొవ్వు చాలా తొందరగా తగ్గుతుంది. ముందుగా వజ్రాసనం లేదా సుఖాసనంలో కూర్చోవాలి. 

వెన్నెముక నిటారుగా ఉంచి, ముక్కు రంధ్రాల ద్వార శ్వాసని బలంగా బయటకు వదలాలి. అలా గాలిని బయటకు వదిలేటప్పుడు లోపల నుంచి కాకుండా ముక్కు రంధ్రాల చివర నుంచి వదలాలి. కేవలం గాలిని బయటకు వదలడంపైనే మీ దృష్టి పెట్టాలి. తర్వాత మెల్లగా శ్వాసతీసుకోండి. శ్వాస బయటకు విడిచిపెట్టిన ప్రతిసారీ పొట్టని లోపలికి లాగుతూ ఉండాలి. ఇలా సెకనుకు ఒకటి చొప్పున చెయాలి. ఇలా చేసేటప్పుడు ముఖ కండరాలు, ఛాతీ, భుజాలు మెడ బిగించకూడదు. ఇలా 300సార్లు చేయ్యాలి .

అగ్నిసార 


ముందుగా నిటారుగా నిల్చుని రెండు పాదాల దూరంగా ఉంచాలి. మెల్లగా శ్వాస తీసుకుంటూ, బయటకు వదిలేస్తూ రెండు మోకాళ్లనూ కాస్త వంచాలి. ఆ తర్వాత రెండు చేతులనూ రెండు మోకాళ్లకు కొంచెం పైన పెట్టాలి. శ్వాస పూర్తిగా వదిలిన తర్వాత మళ్ళీ వెంటనే శ్వాస తీసుకోకుండా అలానే ఉంటూ పొట్టను ముందుకు, వెనుకకు కదిలించాలి. అలా ఎన్నిసార్లు కదిలించగలిగితే అన్ని సార్లు చేయాలి. తర్వాత శ్వాసతీసుకుంటూ మెల్లగా యథాస్థితికి వచ్చి నిలబడాలి. తర్వాత మళ్లీ ఇదే విధంగా చేయాలి. ప్రారంభించిన మొదట్లో ఎక్కువసార్లు కదిలించలేరు. కానీ బాగా అభ్యాసం చేస్తే రోజురోజుకూ ఈ ఆసనం వేయడం సులభమవుతుంది. 10-50సార్లు చేయవచ్చు. రోజుకు 5సెట్స్ లెక్కన చెయ్యాలి. ఉదయం సమయంలో ఈ ఆసనం వల్ల చాలా అద్భుతమైన మార్పు కనిపిస్తుంది.

ఉత్థాన పాదాసనం


 ముందుగా వెల్లకిలా పడుకుని రెండు చేతులూ శరీరానికి రెండు పక్కలా ఉండాలి. శ్వాసతీసుకుంటూ మెల్లగా రెండు కాళ్ళు పైకి లేపాలి. అలా 90డిగ్రీలు వచ్చే వరకూ లేపి, తర్వాత మెల్లగా 30డిగ్రాల వరకూ కిందకు తీసుకురావాలి. కాళ్లను పూర్తిగా నేలపై పెట్టకూడదు. అలా 30డిగ్రాలు వచ్చేలా కాళ్లు పెట్టాక ఆ భంగిమలో సెకన్లు అలానే ఉండాలి. మళ్లీ 30డిగ్రీల నుండి 90డిగ్రీలకు కాళ్ళు లేపాలి. ఇలా 10నుంచి 20సార్లు కాళ్లు పూర్తిగా కింద పెట్టకుండా చేయాలి. అలాగే ఈ ఆసనంలో కాళ్ళు పైకి లేపే సమయంలో తల పైకి ఎత్తకూడదు. 

ఈ ఆసనం మొదటి సారి చేసేప్పుడు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లే వేయాలి. తర్వాత రోజుకు కొంత సంఖ్య పెంచుతూ ఉండాలి. నడుము నొప్పి ఉన్నవారు రెండు చేతులూ శరీరానికి పక్కన కాకుండా నడుము క్రింది పెట్టుకుని చేయవచ్చు, ఈ ఆసనం వల్ల పొట్ట చాలా త్వరగా తగ్గుతుంది.

నేకాసనం 


ముందుగా వెల్లకిలా పడుకుని రెండు కాళ్లు, చేతులు, తల, భుజాలు మెల్లగా పైకి లేపాలి. తల, పాదాలు ఒకే ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. శరీర బరువంతా పిరుదలపైన ఉండాలి. మీ ధ్యాస అంతా పొట్టపైనే పెట్టాలి. శ్వాస మామూలుగానే తీసుకుంటూ ఇదే స్థితిలో 20సెకన్లు ఉండాలి. ఇలా 6 సార్లు చేయాలి. 

నేకాసనం వేయడం వల్ల పొట్ట దగ్గర ఉండే కొవ్వు తగ్గడమే కాకుండా జీర్ణశక్తికి కూడా ఇది దోహదపడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు ఉన్నవారికి ఇది చక్కగా ఉపకరిస్తుంది.

మకరాసనం


 ఈ ఆసనం వేసినపుడు చూసే వారికి మొసలి ముందుకు వస్తుంటే ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంటుంది. అందుకే దీనికి మకరాసనం అని పేరు. ఈ ఆసనం వేయడానికి ముందుగా పొట్ట నేలకు ఆనించి బోర్లాపడుకోవాలి. రెండు కాళ్ళు దగ్గరకు పెట్టుకోవాలి. రెండు అరచేతులు ఒకదానిపై ఒకటి పెట్టి గడ్డం కింద పెట్టాలి. తల భుజాలు పైకి లేపాలి. కుడి మోకాలు పైకి మడిచి తల, భుజాలు ఎడమ పక్కకు తిప్పి శ్వాస వదులుతూ పక్కకు చూడాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ యధాస్థితికి అంటే మధ్యలోకి రావాలి. ఇప్పుడు కుడి కాలు కింద పెట్టి ఎడమ కాలితో ఇదే విధంగా కుడివైపుకు తిరిగి చేయాలి. మళ్లీ శ్వాస వదులుతూ యధాస్థితికి రావాలి. 

ఇలా కుడి, ఎడమ రెండుపక్కలా 20సార్లు చేయాలి. ఈ ఆసనం వేసేటప్పుడు తలను కింద పెట్టకూడదు. మెడనొప్పి, నడుము నొప్పి సమస్యలున్నవారు ఈ ఆసనం వేయకూడదు. దీని ద్వారా పొట్టదగ్గర, నడుము దగ్గర ఉండే కొవ్వు తొందరగా తగ్గుతుంది. ఈ 5 ఆసనాలు కలిపి రోజూ అభ్యాసం చేస్తే పొట్ట దగ్గర ఉన్న కొవ్వును 20రోజుల్లోనే తగ్గించుకోవచ్చు. రోజూ గంటల తరబడి వ్యాయామం చేస్తూ కిలోమీటర్లు పరుగులు పెట్టేకన్నా...ఇంట్లోనే ఒక అరగంట క్రమం తప్పకుండా చేస్తే పొట్టను తగ్గించుకోవచ్చు.













Comments

Popular posts from this blog

నిద్రలేచిన వెంటనే చేయాల్సిన 5 యోగాసనాలు

ఈ ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యం మీద అవగాహన, బాధ్యత కలిగి ఉండాలి. ఆరోగ్యంగా ఉండటానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. అందుకు యోగా బాగా సహాయపడుతుంది. యోగా చేయాలంటే బద్దకిస్తున్నారా? అయితే మీకు సహాయం చేయడానికి మేమున్నాం.  ప్రతి రోజూ ఉదయం యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని, చాలా మందికి తెలుసు, అయితే ఎంత మంది ఈ పద్దతిని అనుసరిస్తున్నారు? ఖచ్చితంగా ఏ కొద్ది మాత్రమే రోజూ యోగను సాధన చేస్తుంటారు.  మరికొద్దిమంది, యోగ మొదలు పెడతారు ఒక నెలలో, రెండు నెలలో ప్రాక్టీస్ చేసి, ఆపేస్తుంటారు. ఆ తర్వాత ఐదు, ఆరు నెలలు బ్రేక్ తీసుకుని, తిరిగి ప్రారంభిస్తుంటారు. రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే పరగడపుతో యోగాను ప్రాక్టీస్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. రోజూ యోగ సాధన చేయడం వల్ల శరరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. యోగ అనేది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు, దీని వల్ల ఆస్త్మా, వెన్నునొప్పి, ఇతర శ్వాస సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు. నిద్రలేచిన వెంటనే చేయాల్సిన కొన్ని యోగాసనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 1.లార్డ్ ఆఫ్ డ్యాన్స్ ఫోజ్ (నటరాజ ఆసనం):  నటరాజాసన (నట-డ్యాన్స్, రాజ-కింగ్, ఆసన-భంగిమ)...

సూర్యనమస్కారాలతో ఆ సమస్య తగ్గుతుంది...

రకరకాల ఒత్తిళ్లతో బిజీగా ఉండే మహిళలకు ఆరోగ్యవంతమైన జీవితం చాలా ముఖ్యం. మరి అదేలా సాధ్యం... రోజూ తీసుకునే ఆహారాలలో పోషక విలువలు అధికంగా ఉండాలి. అలానే రోజుకో ఆపిల్ పండు తీసుకోవాలి. కొన్ని రకాల వ్యాయామాలతో మహిళలు ఆరోగ్యపరమైన జీవితాన్ని పొందవచ్చును. మరి ఆ వ్యాయామాలేంటో.. ఎలా చేయాలో చూద్దాం... అధిక బరువు గలవారు బరువు తగ్గాలనుకుంటే.. స్క్వాట్స్ వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామం చేయడం వలన ఊపిరితిత్తులు, హృదయానికి ఎంతో మేలు చేస్తుంది. తద్వారా బరువు తగ్గుతారు. తరచుగా సూర్యనమస్కారాలు చేయడం వలన నడుము భాగం గట్టి పడుతుంది. అలానే మోకాళ్లపై భాగం దృఢంగా మారుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.  ప్లాంక్స్ వ్యాయామం చేస్తే.. కండారాలకు చాలా మంచిది. ముఖ్యంగా ఛాతీ, కటి వలయ భాగం దృఢంగా మారుతుంది. ఈ వ్యాయామంతో రక్తంలోని చక్కెర స్థాయిలు మెరుగుపడుతాయి. తద్వారా శ్వాస తీసుకోవడంలో అడ్డంకులు ఉండవు. అలానే నెలసరి సమస్యలు అదుపులో ఉంటాయి. వ్యాయామం చేయడం వలన ముడతల చర్మం కాస్త తాజాగా మారుతుంది.

శలభాసనంతో మధుమేహం నియంత్రణ

శలభాసనం తామర స్థితి తెలుపుతుంది. ఇది పశ్చమోత్తనాసనానికి, హలాసనానికి వ్యతిరేక స్థితిలో ఉంటుంది. దీనివలన శరీరానికి ప్రయోజనాలు చేకూరుతాయి. అర్ధ శలభాసనం వేయడానికి మొదట నేలపై పడుకోవాలి. ఉదరం, ఛాతీ,చుబకం నేలను తాకుతూ ఉండాలి. భుజాలు చదునుగా పరచాలి. వేళ్ళను నేలపై ఉంచాలి. పిడికిలి బిగించి పైకి తీసుకు రావాలి. మెల్లగా గాలి పీల్చకుని 10 సెకనులు బిగపట్టాలి. పూర్తిగా గాలి పీల్చకుంటే కాళ్ళు ఎత్తడానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి పూర్తిగా గాలి పీల్చుకోరాదు. ఊపిరి వదలడం మొదలు పెట్టాలి. గాలి పీల్చుతూనే ఆసనాన్ని పూర్తిచేయాలి. నిశ్చ్వాసమనేది కాళ్ళు నేలను చేరేటప్పటికి పూర్తి కావాలి. శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి చేతులు లేదా అరచేయి లేదా పిడికిలి వినియోగించాలి. పిడికిలిని కేవలం అనుభవజ్ఞులు మాత్రమే వినియోగించాలి. మెల్లగా కాళ్ళ వీలైనంత ఎత్తుకు తీసుకురావాలి. నాభి వరకు ఉన్న శరీరభాగం నేలను తాకి ఉండాలి. అది కదలకూడదు. మొండెం చక్కగా ఉండాలి. కాళ్ళు లేపడానికి కేవలం నాభి కింది భాగంలో ఉన్న ప్రాంతాన్ని మాత్రమే వినియోగించాలి. ఉదరం, ఛాతీ, చేతులు, చుబుకం ఖచ్చితంగా ఆసనంలో ఉన్నంతసేపు నేలను తాకే ఉండాలి. కాళ్ళు ఎత్తిన స్థానంల...