యోగాలో చాలారకాల పద్ధతులు, యోగాసనాలు కూడా చాలానే ఉన్నాయి. ప్రతి యోగాసనం శరీరం మరియు మనస్సును బలోపేతం చేయటమే కాదు, మీ శరీరంలో తిరిగి సమతుల్యత సాధించటానికి కూడా ఉపయోగపడుతుంది. కేవలం శారీరక సమతుల్యత, చలాకీదనం మాత్రమే కాదు, మీ శరీర తీరు, పనులు, మీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అన్నిటిమధ్యా మంచి సమతుల్యత వస్తుంది.
సంతాన సాఫల్య యోగాలో హార్మోన్లను ఉత్పత్తి చేసే వినాళ వ్యవస్థ మరియు ప్రత్యుత్పత్తి వ్యవస్థను ప్రేరేపించే యోగాసనాలు ముఖ్యంగా ఉంటాయి. మీ వినాళగ్రంథుల వ్యవస్థ సరిగా ఉండటం సరైన హార్మోన్ల సమతుల్యత కోసం అవసరం, అందుకని దానికి సంబంధించిన ఆసనాలతో హార్మోన్ల వ్యవస్థను బాగా చూసుకోవటం ఎంత ముఖ్యమో ప్రత్యుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యకరంగా చేసే,బలపర్చే యోగాసనాలు కూడా ముఖ్యం.
సంతాన సాఫల్య యోగా అంటే ఏమిటి?
సంతాన సాఫల్య యోగాను చేయటం వలన మీ శరీరానికి వివిధ రకాల లాభాలు చేకూరుతాయి. ఈ యోగాసనాలు చేయటం వలన మీ శరీరంలో శక్తి ప్రవాహం మెరుగయ్యి మీ హార్మోన్ల వ్యవస్థ మరియు ప్రత్యుత్పత్తి వ్యవస్థకు కూడా సరైన బలం లభిస్తుంది. సంతాన సాఫల్య యోగా, నిజానికి యోగాలో అన్నిరకాలు, శరీరంలో ఉష్ణోగ్రతను సమానస్థాయిలో నిలిపి ఉంచటానికి, తద్వారా శరీరం చక్కగా పనిచేయటానికి ఉపయోగపడతాయి.
సంతాన సాఫల్య యోగాలో కొన్ని ప్రత్యేక స్ట్రెచ్ లు, మీ ప్రత్యుత్పత్తి ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలు చూపిస్తాయి. ప్రతి ఆసనంలో మీ శరీరాన్ని గర్భానికి అనుకూలంగా తయారుచేసే, అండగా ఉండేట్లు శరీరాన్ని మలచే విధంగా, హార్మోన్ల హెడ్ క్వార్టర్స్ ను అంటే మీ ప్రత్యుత్పత్తి మరియు వినాళ వ్యవస్థలకు పోషణ అందిస్తాయి. సంతానం కోసం సహజంగా ప్రయత్నించే ప్రక్రియతో పాటు సంతాన సాఫల్య యోగా కార్యక్రమాన్ని కూడా కలిపి పాటించి మంచి ఫలితాలు పొందండి.
సంతాన సాఫల్య యోగా యొక్క కొన్ని లాభాలు
మీరు గర్భం దాల్చాలనుకుంటున్నప్పుడు సంతాన సాఫల్య యోగా మీ ఆరోగ్యానికి అనేక లాభాలు అందిస్తుంది. కొన్ని లాభాలు ఏంటంటేః
మీ హార్మోన్ల వ్యవస్థను 'తిరిగి’ సరి చేస్తుంది; మీ హార్మోన్ల సమతుల్యతను చూసుకుంటుంది.
మీ ప్రత్యుత్పత్తి అవయవాలలో ఏమైనా అడ్డంకులుంటే తొలగిస్తుంది.
ప్రత్యుత్పత్తి అవయవాలకు రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది.
మంచి రోగనిరోధకతను పెంచటమే కాక, శరీరంలో విషపదార్థాలను తొలగిస్తుంది.
మీ ప్రెగ్నెన్సీ ప్రయాణంలో మీకు శాంతి, శక్తిని అందిస్తుంది.
అన్నీ అర్థమయ్యే ప్రశాంతత ఇస్తుంది మరియు మానసిక వత్తిడిని తగ్గించే వాతావరణాన్ని సృష్టిస్తుంది.
Comments
Post a Comment