Skip to main content

యోగాతో నిద్రలేమిని సమస్యను జయించండి

నవీన యుగంలో చాలామందిని పట్టి పీడిస్తున్న సమస్య నిద్రలేమి. దీనినే వైద్య పరిభాషలో ‘ఇన్‌సోమ్నియా' అంటారు. ఇటీవల జరిపిన సర్వేల ప్రకారం ఈ సమస్యతో బాధపడేవారు ప్రతి నలుగురిలో ఒకరు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ సమస్య వినటానికి చిన్న సమస్యగానే అనిపిస్తుంది గాని ఈ సమస్యను అనుభవించేవారి బాధ ఇంతా అంతా కాదు. నిద్రకు సంబంధించిన సమస్యలన్నింటినీ నిద్రలేమి (ఇన్‌సోమ్నియా)గా పరిగణించడం తరచూ జరుగుతుంటుంది. 

ఈ పదానికి అర్థం నిద్రలేమి అయినప్పటికీ ఇది మూడు సమస్యలను సూచిస్తుంది:

1. నిద్రలోకి వెళ్ళడం కష్టం కావడం

 2.నిద్రావస్థలో ఎక్కువ సేపు ఉండలేకపోవడం.

3. నిద్ర లేచిన తరువాత తాజాగా అనిపించకపోవడం. నిద్రలోకి జారుకోలేకపోవడం, ఒకవేళ నిద్రపోయినప్పటికీ తెల్లవారుఝామునే లేవడం, రాత్రిళ్ళు మధ్య మధ్యలో మెలకువ రావడం, ప్రశాంతమైన నిద్రలేక పోవడంలో అన్న వాటిలో ఒకటి రెండు లక్షణాలు కానీ లేదా అన్నీ కానీ ఉండటమే స్లీప్‌ డిజార్డర్‌ లేదా ఇన్‌సోమ్నియా అని ఆధునిక వైద్యం అభివర్ణిస్తోంది. నిద్రలేమిని ఎదుర్కోవడానికి యోగా గ్రేట్ గా సహాయపడుతుంది. యోగ వల్ల మనస్సు ప్రశాతం పడుతుంది, మరియు మంచి నిద్రపడుతుంది. దాంతో మరుసటి రోజు ఉదయం సంతోషంగా, ఫ్రెష్ గా నిద్రలేవగలుగుతారు. మరి నిద్రకు సహాయపడే యోగసనాలేంటో ఒక సారి చూద్దం...


పశ్చిమోత్తనాసనం: 



పశ్చిమోత్తా నాసనం: సులభంగా బరువు తగ్గించే మరొక సమర్ధవంతమైన యోగాసనం. అలాగే దీన్ని ఫార్వర్డ్ బెండ్ అని కూడా పిలుస్తారు. ఈ యోగా భంగిమ ఉదరంలో పేరుకొన్న కొవ్వును తగ్గిస్తుంది. మరియు వెన్ను నొప్పిని తగ్గిస్తుంది. చక్కగా పడుకుని రెండు పాదాలు దగ్గరగా ఉంచి రెండు చేతులు తలపైకి లేపి నేలకానించి గాలి పీలుస్తూ లేచి కుర్చుని గాలి వదులుతూ ముందుకు వంగాలి. తల మోకాళ్ళ వైపు, చేతులు పాదాల వైపు పోనిచ్చి వాటిని అన్చాడానికి ప్రయత్నిచాలి. ప్రారంభంలో తల మోకాళ్ళకు తగలకపోవచ్చు, చేతులు పాదాలకు అందకపోవచ్చు, కాని రోజు సాదన వల్ల సాధ్యమవుతుంది. తిరిగి పండుకుని మళ్ళి మళ్ళి లేస్తూ ఈ ఆసనం చేయాలి. కనిసం 5 నుండి 20 సార్లు చేయాలి.


ఉత్తనాసన 


నీరసాన్ని దూరం చేయడంలో ఈ ఆసనం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మెనోపాజ్ లక్షణాల నుంచి ఉపశమనాన్ని అందించడంలోనూ ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది.

అపనాసన: 


శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపించడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. జీర్ణాశయ వ్యవస్థకు తగిన శక్తిని అందిస్తుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది.

సుప్త బద్దకోనాసన 


ఈ ఆసనం వల్ల శరీరం మరియు మనస్సు విశ్రాంతి పొందేలా చేస్తుంది, మరియు ఇది వెన్నెముక మరియు కాళ్ళలోని కండరాలను వదలుచేస్తుంది. ఈ ఆసనం చేయడానికి ముందుగా రెండు కాళ్లనూ ముందుకు చాపి రెండు అరచేతులను రెండు తొడలపై బోర్లించి ఉంచి వెన్నెముక నిటారుగా ఉంచుకుని సమస్థితిలో కూర్చోవాలి. నిదానంగా రెండు అరచేతులను శరీరానికి ఇరువైపులా నేలపైన ఉంచి రెండు మోచేతులను ఒకదాని తర్వాత ఒకటి నేలపైన తాకిస్తూ శరీర బరువు మోచేతులపైన ఉంచుతూ వెనుకకు వంగాలి. ఇప్పుడు తలను నేల మీద ఆనించి రెండు చేతివేళ్లను ఇంటర్‌లాక్ చేసి తలకింద ఉంచుకోవాలి. తర్వాత రెండుకాళ్లను మోకాళ్ల వద్ద మడిచి రెండు అరిపాదాలను ఒకదానికి ఒకటి పూర్తిగా తాకించి ఉంచాలి. ఈ స్థితిలో రెండు మోకాళ్లు పరస్పరం వ్యతిరేక దిశలో పక్కకు వాలి ఉంటాయి. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా తీసుకోవాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత యథాస్థితికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలి.ఇలా ప్రతిరోజూ మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.

శవాసన:


 ఈ ఆసనం వేయడం వల్ల తలలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దాంతో జుత్తుకు బలం లభిస్తుంది. సైనస్, జలుబు వంటి సమస్యలున్నట్లయితే ఉపశమనం లభిస్తుంది. మానసిక అలసట దూరమవుతుంది. డిప్రెషన్, ఇన్సోమ్నియా వంటి స్లీపింగ్ డిజార్డర్స్ దూరమవుతాయి.












Comments

Popular posts from this blog

సూర్యనమస్కారాలతో ఆ సమస్య తగ్గుతుంది...

రకరకాల ఒత్తిళ్లతో బిజీగా ఉండే మహిళలకు ఆరోగ్యవంతమైన జీవితం చాలా ముఖ్యం. మరి అదేలా సాధ్యం... రోజూ తీసుకునే ఆహారాలలో పోషక విలువలు అధికంగా ఉండాలి. అలానే రోజుకో ఆపిల్ పండు తీసుకోవాలి. కొన్ని రకాల వ్యాయామాలతో మహిళలు ఆరోగ్యపరమైన జీవితాన్ని పొందవచ్చును. మరి ఆ వ్యాయామాలేంటో.. ఎలా చేయాలో చూద్దాం... అధిక బరువు గలవారు బరువు తగ్గాలనుకుంటే.. స్క్వాట్స్ వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామం చేయడం వలన ఊపిరితిత్తులు, హృదయానికి ఎంతో మేలు చేస్తుంది. తద్వారా బరువు తగ్గుతారు. తరచుగా సూర్యనమస్కారాలు చేయడం వలన నడుము భాగం గట్టి పడుతుంది. అలానే మోకాళ్లపై భాగం దృఢంగా మారుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.  ప్లాంక్స్ వ్యాయామం చేస్తే.. కండారాలకు చాలా మంచిది. ముఖ్యంగా ఛాతీ, కటి వలయ భాగం దృఢంగా మారుతుంది. ఈ వ్యాయామంతో రక్తంలోని చక్కెర స్థాయిలు మెరుగుపడుతాయి. తద్వారా శ్వాస తీసుకోవడంలో అడ్డంకులు ఉండవు. అలానే నెలసరి సమస్యలు అదుపులో ఉంటాయి. వ్యాయామం చేయడం వలన ముడతల చర్మం కాస్త తాజాగా మారుతుంది.

కాయకల్ప యోగ భంగిమ దశలు మరియు ఉపయోగాలు

కాయకల్ప యోగ విధానం అనేది యోగ ప్రక్రియలో అత్యంత ప్రశంసనీయమైనది, జీవన శక్తిని మెరుగుపర్చడానికి ఈ యోగ విధానంను అభ్యసించడం జరుగుతుంది. కాయకల్ప యోగ భంగిమల ప్రాథమిక లక్ష్యం- శరీర విధానాన్ని గాడిలో పెట్టడం, సహజంగానే వృద్దాప్య ప్రక్రియను మందగింపచేసి, జీవిత కాలాన్ని పెంచుతుంది. యోగ అనేది భౌతిక జీవితం మరియు స్మారక స్థితితో కూడుకొని ఉంటుంది. కాయకల్ప యోగ విధానంను సాధన చేయడం ద్వారా లైంగిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిలోకి రూపాంతరం చెందించవచ్చు. కాయకల్ప యోగ విధానం యొక్క నియమావళి కాయకల్ప యోగ, నరాలు సరైన విధంగా పని చేయడానికి మరియు శరీర కేంద్ర నాడీ వ్యవస్థని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. యోగ పద్దతిలో "క్రౌన్ చర్కా" అనే ఆసనం వుంటుంది, దీనిని నుదుటి మధ్య భాగంలో ఉంచుతారు అది శక్తి ప్రవాహంపై ప్రభావం చూపుతుంది. ఈ సాధనను ఆచరించడం వలన మనం ఆరోగ్యకరమైన శరీరంతో పాటు ప్రశాంతమైన మనస్సు కలిగి ఉండేలా ప్రోత్సహిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, కాయకల్ప నియమావళి వలన సాధకుడు శరీర దారుడ్యం మరియు ఆధ్యాత్మికంగా కూడా సంతృప్తి పొందేలా చేస్తుంది. కాయకల్ప యోగ భంగిమల అనుసరణ     కాయకల్ప యోగ శ్వాససంబంధిత వ్యాయామాలత...

12 ఆసనాలతో సూర్య నమస్కారం... ఎలా వేయాలి? ఫలితాలు ఏమిటి...?

సూర్యనమస్కారం పలు యోగాసనాల మేలు కలయిక. ఈ ఆసనాన్ని ఏ వయస్సులోని వారైనా వేయవచ్చు. దీని వలన శారీరకంగానూ, మానసికంగానూ ఉపయోగంగా ఉంటుంది. సూర్యనమస్కారం 12 ఆసనాలతో కలసి ఉంటుంది.  ఆసనం వేయు పద్ధతి... నిలబడిన స్థితిలో కాళ్ళను పరస్పరం దగ్గరకు తీసుకు రావాలి. భుజాలను చక్కగా పైకి తీసుకు రావాలి. తలకుపైకి తీసుకు వచ్చిన అరచేతులను కలపాలి. ఆలాగే ముఖం ఎదుటకు తీసుకువచ్చి నమస్కారం చేసే స్థితికి రావాలి. కలిపిన చేతులు ఛాతీ వద్ద ఉండేలా చూసుకోవాలి. గాలిపీల్చుకుంటూ భుజాలను పైకి తీసుకురావాలి. చెవులను తాకుతూ ఉండాలి. మెల్లగా చేతులను వెనకవైపుకు తీసుకురావాలి. వీలైనంతగా తలను వెనక్కు వంచాలి. మెల్లగా గాలి వదులుతూ ముందుకు వంగాలి. చేతులను సమాంతరంగా ఉంచుతూ నేలను తాకాలి. ఈ సమయంలో తల మోకాలిని తాకుతూ ఉండేంతవరకూ తీసుకురావాలి. ఈ స్థితిలో కొన్నిసెకనులు అలాగే ఉండాలి. దీనినే పాద పశ్చిమోత్తాసనం అంటారు. గాలి పీల్చుతూ కుడికాలును వెనక్కు తీసుకురావాలి. వీలైనంత వెనక్కు ఉండేలా చూడాలి. ఈ స్థితిలో తలపైకెత్తాలి. కొన్ని సెకనలు ఈ స్థితిలో ఉండాలి. మెల్లగా గాలి వదులుతూ అదే విధంగా ఎడమ కాలిని వెనక్కు తీసుకురావాలి. పాదాలు రెండూ పక్కపక్క...