Skip to main content

Posts

Showing posts from January, 2018

యోగాసనాలు వేసే ముందు పాటించాల్సిన జాగ్రత్తలు

ఆసనాలు వేసే ముందు మొట్ట మొదటగా మీరు పాటించాల్సిన అంశాలు కొన్ని వున్నాయి. అవి ఆసనాలకు మీరు కేటాయించే సమయం. తర్వాత ప్రాణాయామం, ధ్యానంకు నిర్దేశించుకున్న సమయం. ఇందుకు సంబంధించి ప్రతి రోజు యోగకు గంట సమయం కేటాయించండి. దానిలో అరగంట ఆసనాలకు, పది నిమిషాలు ప్రాణాయామం, ఇరవై నిమిషాలు ధ్యానంకు కేటాయించుకుంటే మంచి ఫలితం వస్తుంది. ఆసనాలు వేస్తున్నామని ఇప్పటికే మీరు వాడుతున్న మందులు, వైద్యులను సంప్రదించటాన్ని మాత్రం మానకండి. తర్వాత ఆసనాలు వేసే విషయంలో మీకు ఏ ఇబ్బంది వచ్చినా దగ్గరిలోని యోగ మాష్టారును సంప్రదించి ఆసనాలను మీరు సరిగా వేస్తున్నారో లేదో నిర్ధారించుకోండి. ఆసనాలు వేసే ముందు మనం కొన్ని అంశాలను పాటించాల్సివుంది. * ఎనిమిది నుంచి 60 సంవత్సరాల వాళ్లు మాత్రమే యోగ చేయాలి. * తెల్లవారు జామునే లేచి కాలకృత్యాలు తీర్చుకోండి * ఆసనాలు వేసే ముందుగా గోరు వెచ్చటి నీటితో స్నానం చేయండి. * తెల్లవారు జామునే ఆసనాలు వేయండి. ఆ సమయంలో గాలిలో ప్రాణ శక్తి ఎక్కువగా వుంటుంది. గాలి బాగా వచ్చే ప్రదేశం చూసుకుని వేయండి. * శబ్దాలు, గోలలు లేకుండా వుండే ప్రదేశాన్ని ఎన్నుకోండి.

ఉదర వ్యాయామం చేయండిలా

ఉదరానికి కూడా వ్యాయమం ఉండాలంటున్నారు వ్యాయామ ఆచార్యులు. ఈ వ్యాయామం చేస్తే ఉదర కండరాలు, శరీర అంగాలు బలపడుతాయంటున్నారు వారు. మలబద్దకం వదులుతుంది. డయాబెటీస్ నుండి ఉపశమనం కలుగుతుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్తకూడా బాగవుతుందంటున్నారు ఆచార్యులు. కాని తీవ్ర రక్త పోటు, అల్సర్ ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదంటున్నారు. ఉదర వ్యాయామం చేయండిలా.. రెండు చేతులను మోకాళ్ళమీద పెట్టి కొద్దిగా ముందుకు వంగాలి. గాలి వదిలి మీ పొట్టను లోపలికి, బయటకు ఆడించండి. మీకు ఇబ్బంది కలిగేంత వరకు ఇలా చేస్తూవుండండి. ఆ తర్వాత అదే భంగిమలో కొద్దిసేపువుండి ఆ తర్వాత నుంచోవాలి.

హి హ్హి హ్హ్హి.. హ హ్హ హ్హ్హ... హాస్య యోగా!!

తలకు మించిన పనిభారంతో స్త్రీలు పురుషులు మహా ఒత్తిడికి గురవుతున్నారని తాజా సర్వేలు చెపుతున్నాయి. ఈ ఒత్తిడి తెచ్చే అనర్థాలు అనేకం ఉన్నాయి. మధుమేహం నుంచి గుండె జబ్బుల వరకూ అనేక వ్యాధులకు మూలకారణం మానసిక ఒత్తిడేనని పలు పరిశోధనల్లో తేలింది. వీటిని తరిమికొట్టి ఉల్లాసంగా గడపడానికి మంచి మార్గం ఒకటుందంటున్నారు వైద్యులు. అదే హాస్య యోగా. హాస్య యోగా చేసేవారిలో ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. మెదడుకు ప్రాణవాయువు సరఫరా మెరగవుతుంది. శరీరంలోపలి అవయవాల పనితీరు చురుకుగా మారుతుంది. కనుక రోజులో సాధ్యమైనంత ఎక్కుగా పగలబడి నవ్వమని హాస్య యోగా వైద్య నిపుణులు చెపుతున్నారు. కానీ చాలా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కనీసం 10 నుంచి 15 నిమిషాల సమయాన్ని కూడా నవ్వడానికి కేటాయించడం లేదు. నవ్వడానికి అవకాశం దొరికినా మూతి ముడిచి కూచుంటున్నట్లు తమ అధ్యయనంలో తేలిందంటున్నారు. ఇదిలా ఉంటే నవ్వు ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న ఒకే ఒక్క కారణంతో కొందరు గదంతా బీటలు వారిపోయేటంతటి పెద్ద శబ్దం చేస్తూ హ హ్హ హ్హ్హ అని నవ్వడం.. ఇతరులకు ఇబ్బందిని కలుగజేస్తుంది. ఆ సమయంలో తోటి ఉద్యోగులు మిగిలిన వారితో "సిగ్గు.. ఎగ్గూ లేకుండా ఎంత ...

యోగ సాధనలో పాటించాల్సిన నియమాలు

యోగ సాధనలో సక్రమ ఫలితాలకోసం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అవేంటో ఒక్కసారి చూద్దాం... ఉదయం పూట మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు, తాజాగా అన్పించినప్పుడు, శరీరం తేలికగా ఉందని తోచినప్పుడు యోగాను అభ్యసించాలి. లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని ముఖం బాగా కడుక్కోవాలి. నాసికా రంధ్రాలు, గొంతును బాగా శుభ్రం చేసుకోవాలి. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లను తాగి కొన్ని నిమిషాలు తర్వాత యోగాను మొదలుపెట్టాలి. ప్రాణాయామం చేసేటపుడు మరీ కష్టంగా అనిపిస్తే ఆపడం మంచిది. యోగావల్ల డప్రెషన్ తొలగిపోయి శక్తిని పుంజుకోవాలే కానీ నీరసించకూడదు. యోగాసనాలు వేసేటపుడు సుదీర్ఘంగా, లయబద్ధంగా శ్వాస పీల్చుకోవడం మంచిది. శ్వాస పీల్చుకునేటప్పుడు నోరు మూసుకునే ఉండటం మంచిది.

హైపర్ థైరాయిడిజాన్ని తగ్గించే యోగాసనాలు

థైరాయిడ్ అనేది ఒక గ్రంథి, దీని నుండి స్రవింపచేసే హార్మోన్ శరీరం యొక్క జీవక్రియ స్థాయిని నియంత్రిస్తుంది. హైపర్ థైరాయిడిజంలో, హార్మోన్ ఉత్పత్తి పెరిగిన కొలది శరీర జీవక్రియ స్థాయిని కూడా వేగతరస్థితికి చేరుస్తుంది. యోగ సాధనతో, హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలైన కండరాల బలహీనత, గుండె వేగం పెరుగుదల, బరువును కోల్పోవడం, కళ్ళు పొడవడం, చిరాకు వంటి అన్నింటిని నియంత్రణలోకి తీసుకురావచ్చు.  హైపర్ థైరాయిడిజం కొరకు యోగ చికిత్స వ్యాధికి సంపూర్ణ మార్గాన్ని అందిస్తుంది మరియు ఈ వ్యాధి నివారణకి గల ప్రయోజనాలు దూరంగా వ్యాపించి వున్నాయి. వంతెన (బ్రిడ్జ్) భంగిమ ఈ భంగిమ చేయడం వలన హైపర్ థైరాయిడిజంపైనే కాకుండా, మిగితా అనేక అంశాలపై కూడా ప్రభావం చూపుతుంది. వంతెన భంగిమ పిరుదులు, ఉదరం, వెన్ను మరియు కాలి కండరాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ యోగ భంగిమ అనుసరణ గురించి కింద పేర్కొనబడింది.     మీ శరీర వెనుక భాగాన్ని నేలపై ఆనించి, మీ పాదాలను నేలకి చదునుగా పెట్టి నడుము వరకి తీసుకురావాలి.     తప్పకుండా మీ పాదాలు మరియు మోకాళ్ళు సమాంతరంగా ఉండేట్లు చూసుకోవాలి.     పాదాలను నేలక...

మలబద్దకాన్ని నివారించే "ఉదరాకర్షణాసనం"

మలబద్ధకంతో బాధపడేవారు ముందుగా ఉదయాన్నే నిద్రలేవగానే నాలుగు గ్లాసుల గోరువెచ్చటి నీటిని త్రాగి ఆ తరువాత "ఉదరాకర్షణాసనం" వేసినట్లయితే మలబద్ధకాన్ని నివారించవచ్చు. ఈ ఆసనం ఎలా వేయాలంటే.. రెండు పాదాలను నేలకు ఆనించి కూర్చుని, రెండు చేతులనూ మోకాళ్లపైన కేంద్రీకరించాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి, వదలి.. కుడికాలును నేలమీద ఆనించి, ఎడమకాలును పొట్టకు ఆన్చి, ఎడమవైపుకు మెడ, ఛాతీ, నడుమును తిప్పాలి. ఇప్పుడు తిరిగీ శ్వాసను పీల్చుకుంటూ రెండు కాళ్లపైన కూర్చోవాలి. అదే విధంగా ఎడమవైపుకు ఎడమకాలు నేలమీద ఆనించి, కుడికాలును పొట్టకు ఆన్చి, కుడివైపుకు మెడ, ఛాతీ, నడుమును తిప్పాలి. శ్వాసను పీల్చుకుంటూ యధాస్థానానికి రావాలి. ఇలా కుడి, ఎడమవైపుల్లో పదిసార్లు చేయాలి. దీంతోపాటు కపాలబాతి చేస్తే మంచిది. ఆ తరువాత సుఖాసనంలో కూర్చుని రెండు చేతుల చూపుడు వేళ్లను మడిస్తే వాయుముద్ర ఏర్పడుతుంది. శ్వాస బయటకు, పొట్టలోపలికి తీసుకుంటూ సెకనుకు ఒకసారి, నిమిషానికి 60సార్లు మొదటిరోజు 5 నిమిషాలు, అలా నెల రోజుల చివరికి 15 నిమిషాలపాటు చేసేలా అలవర్చుకోవాలి. ఇలా చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయి. అయితే ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే....

మానసిక ఒత్తిడిని తగ్గించండిలా

మానసిక ఒత్తిడితో రకరకాల జబ్బులు సునాయాసంగా మన శరీరంలోకి చేరుకుంటాయి. దీంతో లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయి. విపరీతమైన పని ఒత్తిడివల్ల, మానసికమైన ఒత్తిడులతో ఏ పనీ చేయడానికి మనస్కరించదు. మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడానికి భ్రమరి అనే వ్యాయామం చేస్తే మానసిక ఒత్తిడిని తగ్గించి, నిద్రలేమిని, గుండె సమస్యలను, అధిక రక్త పోటును పరిష్కరిస్తుందంటున్నారు యోగా నిపుణులు. ఈ భ్రమరి వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేస్తే జ్ఞాపక శక్తికూడా పెరుగుతుందని తెలిపారు. ** చేయండిలా..  కూర్చుని కళ్ళుమూసుకుని, చెవులను చూపుడువేళ్ళతో మూసుకుని గాలిని గట్టిగా లోపలికి పీల్చండి. గాలిని బయటికి వదిలేటప్పుడు మీ గొంతునుండి తుమ్మెద ఎగిరేటప్పుడు వచ్చే శబ్దం తెప్పించండి. ఇలా రోజుకు ఐదుసార్లు చేయండి. తుమ్మెద ఎగిరే శబ్దం వస్తుందికాబట్టే ఈ యోగాకు భ్రమరి అనే పేరు వచ్చిందంటున్నారు నిపుణులు.

యోగాసనాలతో వ్యాధి నిరోధక శక్తి పెంపు

యోగక్రియలు శరీరం లోపల మరియు బయటనున్న పలు రకాల జబ్బులను మటుమాయం చేస్తుంది. యోగాసనాలు చేస్తుంటే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి కూడా తగ్గి జీవితం సాఫీగా సాగిపోతుంది. దీంతో శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. యోగాసనాలు మన దేశంలో అతి పురాతనమైన వ్యాయామం. దీనిని ఇప్పటికీ మనలో చాలామంది పాటిస్తున్నారు. విషయం ఏంటంటే ప్రస్తుతం యోగాసనాలను సులభంగా చేసే విధానంతోపాటు శాస్త్రపరమైన సిద్ధాంతాలను కూడా జోడించారు. యోగాసనాల్లో ఆదునిక విజ్ఞానాన్ని కలిపి ఇప్పుడు చాలామంది ప్రయోగిస్తున్నారు. ప్రస్తుతం యోగాసనాలు చేసే వారు చాలామంది ఉన్నారని యోగా గురువులు అంటున్నారు. చాలామంది నిత్యం యోగాసనాలు చేసి తమ జీవితాలను ఆరోగ్యమయం చేసుకుంటున్నారని వారు తెలిపారు.

అర్ధధనురాసనంతో శరీరానికి కొత్త బలం

సంస్కృతంలో ధనుస్ అంటే బాణం. యోగాసనాలలో శరీరాన్ని బిగుతుగా ఆ ఆకృతిలోకి వంచడాన్ని అర్ధధనురాసనం అంటారు. ఒక క్రమ పద్దతిలో వళ్ళు వెనక్కి విరిచి పాదాల పైభాగాన్నిచేతులతో పట్టకునే విన్యాసమిది. చదునైన నేలపై బోర్లా పడుకోవాలి. గడ్డం నేలపై ఆనించి ఉంచాలి. భుజాలను శరీరానికి ఆనుకుని ఉండేలా చూడాలి. పాదాలను కాస్త యడముగా ఉంచాలి. కండరాలు చాలా వదులుగా ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా గాలి పీల్చుకోవాలి. కాళ్ళను మెల్లగా వెనక్కి వంచాలి. చేతులతో చీలమండను గట్టిగా పట్టుకోవాలి. తల, మెడను మెల్లగా వెనక్కి వంచాలి. ధీర్ఘంగా గాలి పీల్చుకోవాలి. తరువాత 10 సెకనులలో గాలి పీల్చుకోవడం పూర్తికావాలి. కనీసం 3 సెకనులు ఆగి గాలి వదలడం ఆరంభించాలి. గాలి వదలడం 15 సెకన్లలో పూర్తి కావాలి. కాళ్ళు వెనక్కు లాగాలి. క్రమంగా మోకాళ్ళు, బొటన వేళ్ళు దగ్గరకు చేర్చాలి. వాటిని దగ్గరకు చేర్చకపోతే గరిష్టంగా వెనక్కు వంగే అవకాశం ఉండదు.  ఉపయోగాలు అర్ధధనురాసనం శరీరానికి శక్తి, బలాన్ని ఇస్తుంది. శరీర అంతర్భాగాలకు బలం చేకూరుతుంది. మూత్రపిండాలు, పునరుత్పత్తి వ్యవస్థ ఉత్తేజమవుతాయి. జాగ్రత్తలు హరేనియా, పెద్దప్రేవు, పొట్ట అల్సర్లు, గుండె జబ్బు, ర...

వెన్నెముకను వంచే అర్ధ మత్స్యేంద్రాసనం

అర్థ మత్స్యేంద్రాసనంలో వెన్నెముకను సగభాగానికి మీరు వంచాల్సి ఉంటుంది. భారతీయ యోగ శిక్షకుల్లో ప్రసిద్ధులైన హఠయోగ మత్స్యేంద్రనాథ పేరిట ఈ అర్ధ మత్స్యేంద్రాసనం ఉనికిలోకి వచ్చింది. సంస్కృతంలో 'అర్ధ' అంటే సగం అని అర్థం. వెన్నెముకను పూర్తిగా వంచడం చాలా కఠినతరమైన భంగిమ కావడంతో యోగాభ్యాసకులు అర్ధ మత్స్యేంద్రాసనాన్ని మాత్రమే ఎక్కువగా అభ్యసిస్తుంటారు. ఉత్తమమైన మెలి తిప్పే భంగిమలలో అర్ధ మత్స్యేంద్రాసనం ఒకటి. ఈ ఆసనంలో వెన్నెముక మొత్తంగా దాని అక్షం చుట్టూ తిరుగుతుంది. పైగా ఈ పద్ధతిలో వెన్నెముకను రెండుసార్లు కుడిఎడమలకు మెలితిప్పవచ్చు. ఇలా వెన్నెముకను పూర్తిగా మెలితిప్పేందుకు గాను మన చేతులు, మోకాళ్లే సాధనాలుగా ఉపకరిస్తాయి ఆసనం వేయు పద్ధతి పద్మాసన స్థితికి రావాలి. స్థిరంగా కూర్చోవాలి. కాళ్లు వెలుపలకు చాచిన విధంగా ఉండాలి. ఒక పాదాన్ని మీ పిరుదుల కిందకు తేవాలి. కుడి తొడను నేరుగా ఉంచాలి. ఇప్పుడు మీ ఎడమ కాలిని నేలమీద ఆనించాలి. కుడి మోకాలును వంచాలి. మీ ఎడమ మోకాలును మీ కుడి మోకాలు యొక్క కుడివైపున దగ్గరగా ఆనేలా ఉంచాలి. మీ కుడి చేతిని మీ ఎడమ మోకాలి ఎడమ వైపు పైభాగానికి ఆనేలా ఉంచాలి. కుడిచేతిని ఎడమ పిక...

వృద్ధాప్యంలో మతిమరుపును యోగాతో నివారించటం ఎలా?

యోగాను దీర్ఘకాలం చేస్తే మీ మెదడు ఆకారాన్ని మార్చేసి, మీ మెదడు పనితీరును వృద్ధాప్యంలో మందగించకుండా చేస్తుందని పరిశోధనల్లో వెల్లడయింది.  పరిశోధకులు ఒక యోగాలో నిపుణురాలైన వృద్ధమహిళ మెదడును చిత్రీకరించినపుడు, ఈ యోగినుల మెదడు ఎడమ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఎక్కువ మందంగా ఉందని తెలుసుకున్నారు. మెదడులో ఈ భాగాలు శ్రద్ధకి, జ్ఞాపకశక్తికి కారణమవుతాయి.  యోగ ముద్రలు-వాటి ఆరోగ్య ప్రయోజనాలు  వయస్సు మీరుతున్నప్పుడు, మెదడు ఆకారం, పనితీరులో మార్పులొచ్చి ఇదివరకు ఉన్నంత శ్రద్ధ, జ్ఞాపకశక్తి ఉండవు. అలాంటి ఒక మార్పు మెదడులోని సెరెబ్రల్ కోర్టెక్స్ పల్చనవటం. శాస్త్రవేత్తలు ఇదే మన మతిమరుపుకి కూడా కారణమని తేల్చారు. మరి, ఈ మార్పులను ఎలా తగ్గించి, నెమ్మది చేయాలి?  ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్ జర్నల్ లో ప్రచురించబడ్డ ఈ ఫలితాలు, జవాబు యోగా అభ్యాసంలో ఉండొచ్చని తెలుపుతోంది.  ఇస్రాయెలిటా ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ఆస్పత్రికి చెందిన ఎలిసా కొజాసా అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ, "కండరాలలాగానే మెదడు కూడా శిక్షణ వల్ల ఎదుగుతుంది," అని వివరించారు.  నగ్నంగా యోగ చేస్తే పొందే ఆశ్చర్యకరమైన ఆ...

శరీర బరువును తగ్గించే యోగాసనాలు

చాలా మంది వారి బరువును పెంచుకొనుటకు లేదా తగ్గించుకొనుటకు యోగాను చేస్తున్నారు, కొంత మంది అధిక బరువుకు లేదా తక్కువ బరువుకు జన్యువులు కారణంగా చెబుతున్నారు. కానీ ఈ కారణం అన్ని సమయాల్లో నిజం కాకపోవచ్చు. జన్యువులు మాత్రమే కాకుండా మనం తినే ఆహరం, అనుసరించే జీవన విధానాలపై శరీర బరువు ఆధారపడి ఉంటుంది. సహజంగా శరీర బరువును తగ్గించుకోటానికి చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి, వీటిలో యోగా కూడా ఒకటి. ఇతర పద్దతులతో పోలిస్తే, బరువు తగ్గించుటలో యోగా భంగిమలు శక్తివంతంగా పని చేస్తాయి. శరీర బరువును శక్తివంతంగా తగ్గించే కొన్ని యోగా భంగిమల గురించి ఇక్కడ తెలుపబడింది. వక్రసనా ఈ ఆసనంలో, సౌకర్యవంతంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోండి. ఇప్పుడు, మీ ఎడమ మోకాలిని పైకి అని, దానిపై మీ కుడి చేతిని ఉంచండి. ఈ సమయంలో ఎడమ దిశలో మీ శరీరాన్ని కొద్దిగా తిప్పండి. ఎడమ వైపుగా చేయాలనే నియమం ఏమి లేదు కుడి వైపుగా కూడా ఈ భంగిమను రోజు అనుసరించటం వలన శరీర బరువు మరియు అధిక కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గుతాయి. భుజంగాసన (కోబ్రా భంగిమ) ఈ రకమైన భంగిమలో, స్వతహాగా శరీరాన్ని వంచాలి, అనగా నుదురు భాగం భూమికి అనుకునేలా నెలపై పడుకోండి. ఆ తర...

యోగ సాధనతో వ్యాధులు దూరం !

పతంజలి మహర్షి యోగని ఎనిమిది భాగాలుగా విభజించారు. వీటిలో మొదటి అయిదు ధ్యానసాధనలో బాహ్యంగా సహాయపడితే, చివరి మూడు అంతర్గత శక్తులను వెలికి తీసేందుకు దోహదం చేసి, యోగ సాధన ఫలాలను యిస్తాయి. ఎనిమిది విధానాలు: యమ:  ఒక సైనికుడి ఆయుధాలను అప్పగించినప్పుడు ముందుగా క్రమశిక్షణ నేర్పుతారు. ఎప్పుడు వాటిని ప్రయోగించాలి అనే విషయంతో పాటు సమాజ పరిరక్షణకు, శాంతి స్థాపనకు ఎలా ఉపయోగపడాలనేది అవగతం చేసుకుంటారు. జీవిత విధానంపై, ప్రవర్తనపై నిర్దిష్టమైన క్రమశిక్షణ వుండాలి. ఆ అయిదు అంశాలు: 1. అహింస 2. సత్యం 3. బ్రహ్మచర్యం 4. దొంగతనానికి పాల్పడకపోవడం 5. కోరికలను అదుపులో ఉంచుకోవడం ఈ అయిదు అంశాలను పాటించినప్పుడే యోగ సాధకుడు ముందు అడుగు వేయగలడు. నియమాలు:  యోగ సాధన ఈ దేహంతోనే చేయవలసి వుంటుంది. అందువల్ల శరీరం రోగగ్రస్తం కాకూడదు. ఆరోగ్యంగా, ధృఢంగా వుండాలి. ప్రకృతిలోని ఎటువంటి మార్పులని అయినా తట్టుకునే శక్తి కలిగి వుండాలి. వాంఛలు అదుపులో వుండాలి. సాధకుడు తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించగలగాలి. ఆ అనంతశక్తిని తెలుసుకోవాలనే జ్ఞానతృష్ణ కలిగి వుండాలి. పతంజలి మహర్షి సూచించిన అయిదు నియమాలు ఇవి:- 1. పరి...

త్రికోణాసనం చేయండిలా...!

చక్కగా నిలబడి సమస్థితిలో ఉంటూ శ్వాస పీలుస్తూ, ఎగురుతూ తమ కాళ్ళు పక్కన, చేతులు ప్రక్కకు- భూమికి సమాంతరంగా, అరచేతులు నేలవైపుకు చూపించాలి. ఎడమ పాదం ఎడమవైపుకు, కుడి పంజాను ఎడమవైపుకు తిప్పుతూ తమ దృష్టిని ఎడమచేతివైపు మోకాళ్ళను బిగించాలి. గాలి వదులుతూ ఎడమవైపుకు వంగి, ఎడమ అరచేతిని ఎడమ పాదానికి వెనుకగా నేలపై ఉంచాలి. ఈ స్థితిలో ఎడమచేయి, తమ ఛాతీ, కుడి చేయి ఒకే రేఖలో భూమికి సమాంతరంగా ఉంచాలి. నెమ్మదిగా మీ దృష్టిని కుడిచేతివైపు ప్రస్తుతమున్న స్థితిలోనే అరనిమిషంనుండి ఒక నిమిషంవరకు దీర్ఘశ్వాసక్రియతో ఉండాలి. తర్వాత యధాస్థితికి చేరుకోవాలి. ఇదే రకంగా సమస్థితిలోకి వచ్చి కుడివైపు కూడా చేయాలి. లాభం... త్రికోణాసనం వలన కాలికండరాలకు మంచి బలం చేకూరుతుంది. ఇందులోనున్న వికృతులు దూరమవుతాయి. రెండుకాళ్ళు సమాంతరంగా వికసిస్తాయంటున్నారు యోగా నిపుణులు. దీంతో చీలమండలలో శక్తి పుంజుకుంటుంది. వెన్నునొప్పి దూరమై, మెడ సునాయాసంగా తిరుగుతుందంటున్నారు యోగా గురువులు.

నరాలను ఉత్తేజపరిచే పశ్చిమోత్తానాసనం

ఇంతవరకు మనం కూర్చుని తలను మోకాలికి ఆనించే భంగిమతో కూడిన ఆసనాలను గురించి నేర్చుకున్నాం. ఈ వారం మనం ఈ భంగిమతో కూడిన మరో ఆసనం గురించి తెలుసుకుందాం. దాని పేరు పశ్చిమోత్తానాసనం. పశ్చిమోత్తానాసనం అనేది పశ్చిమ, ఉత్థాన, ఆసన అనే మూడు పదాల కలయికతో కూడిన ఒక సంస్కృత మిశ్రమ పదం. సంస్కృతంలో పశ్చిమ అంటే పడమటి దిక్కు అని అర్థం. దీనికి వెనుకభాగం లేదా కటి అనే అర్థం కూడా ఉంది. ఉత్తాన అంటే ముందుకు చాపటం లేదా విస్తరించడం అని అర్థం. ఈ ఆసనాన్ని అభ్యసించటడం అని అర్థం. కాబట్టి ఆసన పరిభాషలో సాధారణంగా చెప్పాలంటే, వ్యక్తి తన వెన్నెముకను ముందుకు చాపి దృఢపర్చుకోవడం అని అర్థం. అదే పశ్చిమోత్తానాసనం. ఈ ఆసనం వేయు పద్ధతి:- చాప లేదా దుప్పటి నేలమీద పరిచి కూర్చోండి. కాళ్లను సమాంతరంగా ముందుకు చాపండి. మీ వెన్నెముకను నిటారుగా ఉంచండి. కాళ్లు రెండూ దగ్గరగా చేర్చండి. మోకాళ్లు సమాంతరంగా ఉండాలి. అలా అని వాటిని మరీ సాగదీయకండి. మీ చేతుల్ని కాళ్ల వెలుపల నుంచి ముందుకు చాపి ఉంచండి. శ్వాస పీలుస్తున్నప్పుడు చేతులను మీ భుజాలపైగా లేపి ఉంచండి. మీ వెన్నెముకను వీలైనంత నిటారుగా నిలిపి ఉంచండి. ఈ స్థితిలో శ్వాస వదులుతూ కూర్చున్న స్థితిలోనే కటిభ...

మెడ భుజాలకు వ్యాయామం.. ఆకర్ణ ధనురాసనం

సాధారణంగా ఆఫీసుల్లో పని చేసేవారు కొన్ని గంటలపాటు ఒకే స్థితిలో కూర్చుని పని చేస్తుంటారు. ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసేవారికి మెడ భుజాల్లో కండరాలు పట్టేయటం, నొప్పులు లాంటి సమస్యలు ఉంటాయి. మెడ భుజాలకు సంబంధించిన బాధలు తరచుగా వస్తుంటాయి. ఈ భాగాలు విపరీతమైన ఒత్తిడికి గురవుతాయి. క్రమంతప్పకుండా వీటికి ఉపశాంతినిచ్చే ఆసనాలు, వ్యాయామం సాధన చేస్తుంటే దీర్ఘకాలిక సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు. అలాంటిదే ఈ ఆకర్ణ ధనురాసనం. రెండుకాళ్లూ దగ్గరగా ఉంచి నిటారుగా నిలబడాలి. చేతులను భుజాల నుండి పక్కలకు చాపాలి. కుడికాలిని ఒక అడుగు ముందుకు వేయాలి. ఇప్పుడు చేతులను ముందుకు తీసుకువచ్చి కళ్లకు సమాంతరంగా ఉంచాలి. చేతుల పిడికిళ్లు బిగించి ఉంచాలి. తలని కుడికాలి వైపు తిప్పి ఉంచాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ… బాణాన్ని లాగుతూ చేతిని వెనక్కు తీసుకుని వెళ్లినట్టుగా… ఎడమచేతిని వెనక్కు తీసుకుని వెళ్లి పిడికిలి చెవి దగ్గరకు వచ్చేలా ఉంచాలి. తలను కాస్త వెనక్కు వంచి కుడిచేతిని చూస్తున్నట్టుగా ఉంచాలి. ఇప్పుడు శ్వాసని వదులుతూ సాధారణ స్థితికి రావాలి. ఇలాగే చేతులను మార్చి చేయాలి. ఈ ఆసనాన్ని తరచూ వేయడం వల్ల మెడ భుజాలకు వ్యాయామం కలుగుత...

శుప్తవజ్రాసనం

ఆసనం వేయు విధానం :- 1.ముందుగా వజ్రాసన స్థితిలో కూర్చోవాలి. 2.కుడి మరియు ఎడమ మోచేతులను శరీరానికి ఇరువైపులా సమానంగా ఉండేలా నెమ్మదిగా వెనుకవైపు నేలమీద ఉంచాలి. 3.మోచేతి భాగం నుంచి చేతి వ్రేళ్ల వరకు నిటారుగా ఉంచి నెమ్మదిగా శరీరాన్ని వెనుకకు వంచాలి. 4.ఇప్పుడు భుజాలు నేలను తాకుతూ ఉండాలి. ప్రాధమిక దశలో ఉన్నవారైతే రెండు చేతులను తొడలపై ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఆ చేతులను మోకాలివరకు సమానంగా తీసుకురావాలి. 5.ఈ స్థితికి బాగా అలవాటు పడిన తర్వాత రెండు చేతులను కత్తెర ఆకారంలో ఉండేలా భుజాల కింద ఉంచాలి. కుడి చేయి ఎడమ భుజం కింద... అలాగే ఎడమచేయి కుడి భుజం కింద ఉంచాలి. రెండింటి మధ్య తలభాగం ఉండేలా చూసుకోవాలి. 6.తిరిగి వాస్తవిక స్థితికి వచ్చే సమయంలో, మొదటగా రెండు చేతులను శరీరానికి ఇరువైపులా ఉంచాలి. 7.తర్వాత మోచేతుల సాయంతో తొలుత ఉన్న స్థానానికి నిదానంగా వచ్చేయాలి. గుర్తుంచుకోవలసినవి :- 1.మీ శరీరాన్ని వెనుకకు వంచే సమయంలో శరీర బరువును నియంత్రిస్తూ ఎలాంటి కుదుపులు లేకుండా నెమ్మదిగా చేయాలి. లేనిచో కండరాల నెప్పి వంటి సమస్యలు తలెత్తును. 2.ఈ ఆసనాలు వేసేప్పుడు ఏదైనా కష్టంగా అనిపించినట్లు.. లేదా సమస్యగా అనిపించినట్ల...