తలకు మించిన పనిభారంతో స్త్రీలు పురుషులు మహా ఒత్తిడికి గురవుతున్నారని తాజా సర్వేలు చెపుతున్నాయి. ఈ ఒత్తిడి తెచ్చే అనర్థాలు అనేకం ఉన్నాయి. మధుమేహం నుంచి గుండె జబ్బుల వరకూ అనేక వ్యాధులకు మూలకారణం మానసిక ఒత్తిడేనని పలు పరిశోధనల్లో తేలింది. వీటిని తరిమికొట్టి ఉల్లాసంగా గడపడానికి మంచి మార్గం ఒకటుందంటున్నారు వైద్యులు. అదే హాస్య యోగా.
హాస్య యోగా చేసేవారిలో ఒత్తిడి తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. మెదడుకు ప్రాణవాయువు సరఫరా మెరగవుతుంది. శరీరంలోపలి అవయవాల పనితీరు చురుకుగా మారుతుంది. కనుక రోజులో సాధ్యమైనంత ఎక్కుగా పగలబడి నవ్వమని హాస్య యోగా వైద్య నిపుణులు చెపుతున్నారు.
కానీ చాలా కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కనీసం 10 నుంచి 15 నిమిషాల సమయాన్ని కూడా నవ్వడానికి కేటాయించడం లేదు. నవ్వడానికి అవకాశం దొరికినా మూతి ముడిచి కూచుంటున్నట్లు తమ అధ్యయనంలో తేలిందంటున్నారు.
ఇదిలా ఉంటే నవ్వు ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న ఒకే ఒక్క కారణంతో కొందరు గదంతా బీటలు వారిపోయేటంతటి పెద్ద శబ్దం చేస్తూ హ హ్హ హ్హ్హ అని నవ్వడం.. ఇతరులకు ఇబ్బందిని కలుగజేస్తుంది. ఆ సమయంలో తోటి ఉద్యోగులు మిగిలిన వారితో "సిగ్గు.. ఎగ్గూ లేకుండా ఎంత పెద్దగా నవ్వుతున్నారో చూడు" అంటూ తిట్టుకోవడం కూడా కనిపిస్తుంది. కనుక అంత బిగ్గరగా శబ్దం చేస్తూ నవ్వాల్సి వచ్చినపుడు వారివారి గదుల్లోకి వెళ్లి హ్యాపీగా నవ్వుకోవచ్చు.
నవ్వుల్లో కూడా రకాలున్నాయి. వినసొంపైన నవ్వులను ప్రక్కనబెడితే... అందరికీ మహా చికాకు కలిగించే నవ్వుల్లో కీచు నవ్వు ఒకటి. ఈ నవ్వు కర్ణకఠోరంగా ఉండటమే గాక.. సదరు వ్యక్తితో హాస్యంగా మాట్లాడితే ఎక్కడ కీచు నవ్వును వినిపిస్తారోనని చాలామంది వారితో మాట్లాడటం ఆపేస్తారు.
అందువల్ల మనం నవ్వుతున్నప్పుడు అవతలి వ్యక్తి భావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. ఇదంతా ఎందుకొచ్చిన తిప్పలు.. నేరుగా లాఫింగ్ క్లబ్‌కు వెళితే మన ఇష్టం వచ్చిన నవ్వును నవ్వుకోవచ్చని చాలామంది అనుకుంటారు.
ఇలా వెళుతున్నవారి వల్లనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో లాఫింగ్ క్లబ్బులు వెలిశాయి. అక్కడ ఏ నవ్వు నవ్వినా ఎవరూ ఏమీ అనుకోరు. మన ఇష్టం వచ్చినంత సేపు "హ హ్హ హ్హ్హ, హా హ్హా హ్హ్హా, హి హ్హి హ్హ్హి, హీ హ్హీ హ్హ్హీ, హొ హ్హొ హ్హ్హొ" అని రకరకాల నవ్వులను నవ్వుకోవచ్చు.

Comments
Post a Comment