చక్కగా నిలబడి సమస్థితిలో ఉంటూ శ్వాస పీలుస్తూ, ఎగురుతూ తమ కాళ్ళు పక్కన, చేతులు ప్రక్కకు- భూమికి సమాంతరంగా, అరచేతులు నేలవైపుకు చూపించాలి. ఎడమ పాదం ఎడమవైపుకు, కుడి పంజాను ఎడమవైపుకు తిప్పుతూ తమ దృష్టిని ఎడమచేతివైపు మోకాళ్ళను బిగించాలి.
గాలి వదులుతూ ఎడమవైపుకు వంగి, ఎడమ అరచేతిని ఎడమ పాదానికి వెనుకగా నేలపై ఉంచాలి. ఈ స్థితిలో ఎడమచేయి, తమ ఛాతీ, కుడి చేయి ఒకే రేఖలో భూమికి సమాంతరంగా ఉంచాలి. నెమ్మదిగా మీ దృష్టిని కుడిచేతివైపు ప్రస్తుతమున్న స్థితిలోనే అరనిమిషంనుండి ఒక నిమిషంవరకు దీర్ఘశ్వాసక్రియతో ఉండాలి. తర్వాత యధాస్థితికి చేరుకోవాలి. ఇదే రకంగా సమస్థితిలోకి వచ్చి కుడివైపు కూడా చేయాలి.
లాభం... త్రికోణాసనం వలన కాలికండరాలకు మంచి బలం చేకూరుతుంది. ఇందులోనున్న వికృతులు దూరమవుతాయి. రెండుకాళ్ళు సమాంతరంగా వికసిస్తాయంటున్నారు యోగా నిపుణులు. దీంతో చీలమండలలో శక్తి పుంజుకుంటుంది. వెన్నునొప్పి దూరమై, మెడ సునాయాసంగా తిరుగుతుందంటున్నారు యోగా గురువులు.
Comments
Post a Comment