Skip to main content

హైపర్ థైరాయిడిజాన్ని తగ్గించే యోగాసనాలు

థైరాయిడ్ అనేది ఒక గ్రంథి, దీని నుండి స్రవింపచేసే హార్మోన్ శరీరం యొక్క జీవక్రియ స్థాయిని నియంత్రిస్తుంది. హైపర్ థైరాయిడిజంలో, హార్మోన్ ఉత్పత్తి పెరిగిన కొలది శరీర జీవక్రియ స్థాయిని కూడా వేగతరస్థితికి చేరుస్తుంది.
యోగ సాధనతో, హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలైన కండరాల బలహీనత, గుండె వేగం పెరుగుదల, బరువును కోల్పోవడం, కళ్ళు పొడవడం, చిరాకు వంటి అన్నింటిని నియంత్రణలోకి తీసుకురావచ్చు.  హైపర్ థైరాయిడిజం కొరకు యోగ చికిత్స వ్యాధికి సంపూర్ణ మార్గాన్ని అందిస్తుంది మరియు ఈ వ్యాధి నివారణకి గల ప్రయోజనాలు దూరంగా వ్యాపించి వున్నాయి.

వంతెన (బ్రిడ్జ్) భంగిమ


ఈ భంగిమ చేయడం వలన హైపర్ థైరాయిడిజంపైనే కాకుండా, మిగితా అనేక అంశాలపై కూడా ప్రభావం చూపుతుంది. వంతెన భంగిమ పిరుదులు, ఉదరం, వెన్ను మరియు కాలి కండరాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ యోగ భంగిమ అనుసరణ గురించి కింద పేర్కొనబడింది.

    మీ శరీర వెనుక భాగాన్ని నేలపై ఆనించి, మీ పాదాలను నేలకి చదునుగా పెట్టి నడుము వరకి తీసుకురావాలి.
    తప్పకుండా మీ పాదాలు మరియు మోకాళ్ళు సమాంతరంగా ఉండేట్లు చూసుకోవాలి.
    పాదాలను నేలకు వ్యతిరేకంగా ఒత్తిడి చేస్తూ మీ నడుము భాగాన్ని పైకి లేపాలి.
    అరచేతులను ఒకదానితో మరొకటి ఇరికించుకొని మరియు భుజాలను ఒక దానితో ఒకటి మడవాలి.
    ఇపుడు, ఇదే భంగిమలో వుండి 7 నుంచి 10 సార్లు శ్వాస తీసుకోవాలి.
    నెమ్మదిగా మీ నడుమును తిరిగి నేలపైకి తీసుకురండి మరియు మీ మోకాళ్లను వెనుక నుండి పక్కకి కదిపి విశ్రాంతిని కల్పించవచ్చు.


నిర్భంధిత భంగిమ


    పాదాలను ఒకదానితో ఒకేసారిగా కిందికి ఉంచి మరియు మీ మోకాళ్లను భయటకు విడుదల చేయడం ద్వారా వంతెన భంగిమ నుండి నిర్భంధిత భంగిమలోకి మారాలి.
    మీకు అసౌకర్యంగా అనిపిస్తే, మోకాళ్లను భయటకు తీసి ఆసరా పొందవచ్చు.
    విశ్రాంతిగా చేతులని పక్కకి వుంచి మరియు కండరాలను బిగుతు పట్టే విధంగా శ్వాస తీసుకోవాలి.
    ఈ భంగిమలో ఒక నిమిషం పాటు వుండాలి. ఆ తర్వాత ఈ భంగిమ నుండి విడుదల కావడానికి మీ మోకాళ్ళని యధా స్థానానికి తీసుకురావాలి.

నది శోధన ( ముక్కులోకి శ్వాస తీసుకునెందుకు ప్రత్యామ్నయంగా)


నది శోధన అనేది శ్వాస సంబంధిత వ్యాయామం. దీని వలన మీ మెదడును ప్రశాంత పర్చవచ్చు మరియు "హైపోథలామస్" మరియు పిట్యుటరీ గ్రంథి యొక్క విధులు నియంత్రించడానికి సహాయపడుతుంది. ఈ విధానానికి సంబంధించిన దశలు క్రింద వివరించడం జరిగింది.

    నేరుగా కానీ లేదా సుఖాసనలో కానీ కూర్చొని, అనగా కళ్ళను అడ్డంగా మడవడం లేదా ఎత్తుపీటపై కానీ కూర్చొని, మీ వెనుక వీపు భాగాన్ని నిఠారుగా వుంచాలి.
    మీ కుడి చేతి మధ్య మరియు చూపుడు వేళ్ళను కిందికి మడవాలి.
    కుడి బ్రొటన వేలును ఉపయోగించి ముక్కు కుడి రంధ్రాన్ని ముసివేయాలి.
    ఎడమ రంధ్రంతో లోతైన శ్వాస తీసుకోవాలి.
    ఉంగరపు వేలితో మీ ఎడమ రంధ్రాన్ని ముసివేయాలి.
    ఇపుడు, బ్రొటన వేలుని తీసివేసి కుడి రంధ్రం నుండి శ్వాసని భయటకి వదలాలి.
    కుడి రంధ్రం నుండి శ్వాసను లోనికి తీసుకొని వెంటనే కుడి బ్రొటన వేలుతో మూసివేయాలి.
    ఉంగరపు వేలిని తీసివేసి ఎడమ రంధ్రం నుండి శ్వాసని భయటకు వదలాలి. 
    ఈ విధమైన దశలను 10 సార్లు పునరావృతం చేయాలి.


ఈ యోగ ఆసనాలు హైపర్ థైరాయిడిజంను నియంత్రిస్తుంది అని తెలిసినదే మరియు ఇది శ్వాసకోశ స్థితిని కూడా మెరుగుపరుస్తుంది.

Comments

Popular posts from this blog

సూర్యనమస్కారాలతో ఆ సమస్య తగ్గుతుంది...

రకరకాల ఒత్తిళ్లతో బిజీగా ఉండే మహిళలకు ఆరోగ్యవంతమైన జీవితం చాలా ముఖ్యం. మరి అదేలా సాధ్యం... రోజూ తీసుకునే ఆహారాలలో పోషక విలువలు అధికంగా ఉండాలి. అలానే రోజుకో ఆపిల్ పండు తీసుకోవాలి. కొన్ని రకాల వ్యాయామాలతో మహిళలు ఆరోగ్యపరమైన జీవితాన్ని పొందవచ్చును. మరి ఆ వ్యాయామాలేంటో.. ఎలా చేయాలో చూద్దాం... అధిక బరువు గలవారు బరువు తగ్గాలనుకుంటే.. స్క్వాట్స్ వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామం చేయడం వలన ఊపిరితిత్తులు, హృదయానికి ఎంతో మేలు చేస్తుంది. తద్వారా బరువు తగ్గుతారు. తరచుగా సూర్యనమస్కారాలు చేయడం వలన నడుము భాగం గట్టి పడుతుంది. అలానే మోకాళ్లపై భాగం దృఢంగా మారుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.  ప్లాంక్స్ వ్యాయామం చేస్తే.. కండారాలకు చాలా మంచిది. ముఖ్యంగా ఛాతీ, కటి వలయ భాగం దృఢంగా మారుతుంది. ఈ వ్యాయామంతో రక్తంలోని చక్కెర స్థాయిలు మెరుగుపడుతాయి. తద్వారా శ్వాస తీసుకోవడంలో అడ్డంకులు ఉండవు. అలానే నెలసరి సమస్యలు అదుపులో ఉంటాయి. వ్యాయామం చేయడం వలన ముడతల చర్మం కాస్త తాజాగా మారుతుంది.

కాయకల్ప యోగ భంగిమ దశలు మరియు ఉపయోగాలు

కాయకల్ప యోగ విధానం అనేది యోగ ప్రక్రియలో అత్యంత ప్రశంసనీయమైనది, జీవన శక్తిని మెరుగుపర్చడానికి ఈ యోగ విధానంను అభ్యసించడం జరుగుతుంది. కాయకల్ప యోగ భంగిమల ప్రాథమిక లక్ష్యం- శరీర విధానాన్ని గాడిలో పెట్టడం, సహజంగానే వృద్దాప్య ప్రక్రియను మందగింపచేసి, జీవిత కాలాన్ని పెంచుతుంది. యోగ అనేది భౌతిక జీవితం మరియు స్మారక స్థితితో కూడుకొని ఉంటుంది. కాయకల్ప యోగ విధానంను సాధన చేయడం ద్వారా లైంగిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిలోకి రూపాంతరం చెందించవచ్చు. కాయకల్ప యోగ విధానం యొక్క నియమావళి కాయకల్ప యోగ, నరాలు సరైన విధంగా పని చేయడానికి మరియు శరీర కేంద్ర నాడీ వ్యవస్థని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. యోగ పద్దతిలో "క్రౌన్ చర్కా" అనే ఆసనం వుంటుంది, దీనిని నుదుటి మధ్య భాగంలో ఉంచుతారు అది శక్తి ప్రవాహంపై ప్రభావం చూపుతుంది. ఈ సాధనను ఆచరించడం వలన మనం ఆరోగ్యకరమైన శరీరంతో పాటు ప్రశాంతమైన మనస్సు కలిగి ఉండేలా ప్రోత్సహిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, కాయకల్ప నియమావళి వలన సాధకుడు శరీర దారుడ్యం మరియు ఆధ్యాత్మికంగా కూడా సంతృప్తి పొందేలా చేస్తుంది. కాయకల్ప యోగ భంగిమల అనుసరణ     కాయకల్ప యోగ శ్వాససంబంధిత వ్యాయామాలత...

12 ఆసనాలతో సూర్య నమస్కారం... ఎలా వేయాలి? ఫలితాలు ఏమిటి...?

సూర్యనమస్కారం పలు యోగాసనాల మేలు కలయిక. ఈ ఆసనాన్ని ఏ వయస్సులోని వారైనా వేయవచ్చు. దీని వలన శారీరకంగానూ, మానసికంగానూ ఉపయోగంగా ఉంటుంది. సూర్యనమస్కారం 12 ఆసనాలతో కలసి ఉంటుంది.  ఆసనం వేయు పద్ధతి... నిలబడిన స్థితిలో కాళ్ళను పరస్పరం దగ్గరకు తీసుకు రావాలి. భుజాలను చక్కగా పైకి తీసుకు రావాలి. తలకుపైకి తీసుకు వచ్చిన అరచేతులను కలపాలి. ఆలాగే ముఖం ఎదుటకు తీసుకువచ్చి నమస్కారం చేసే స్థితికి రావాలి. కలిపిన చేతులు ఛాతీ వద్ద ఉండేలా చూసుకోవాలి. గాలిపీల్చుకుంటూ భుజాలను పైకి తీసుకురావాలి. చెవులను తాకుతూ ఉండాలి. మెల్లగా చేతులను వెనకవైపుకు తీసుకురావాలి. వీలైనంతగా తలను వెనక్కు వంచాలి. మెల్లగా గాలి వదులుతూ ముందుకు వంగాలి. చేతులను సమాంతరంగా ఉంచుతూ నేలను తాకాలి. ఈ సమయంలో తల మోకాలిని తాకుతూ ఉండేంతవరకూ తీసుకురావాలి. ఈ స్థితిలో కొన్నిసెకనులు అలాగే ఉండాలి. దీనినే పాద పశ్చిమోత్తాసనం అంటారు. గాలి పీల్చుతూ కుడికాలును వెనక్కు తీసుకురావాలి. వీలైనంత వెనక్కు ఉండేలా చూడాలి. ఈ స్థితిలో తలపైకెత్తాలి. కొన్ని సెకనలు ఈ స్థితిలో ఉండాలి. మెల్లగా గాలి వదులుతూ అదే విధంగా ఎడమ కాలిని వెనక్కు తీసుకురావాలి. పాదాలు రెండూ పక్కపక్క...