ఆసనం వేయు విధానం :-
1.ముందుగా వజ్రాసన స్థితిలో కూర్చోవాలి.
2.కుడి మరియు ఎడమ మోచేతులను శరీరానికి ఇరువైపులా సమానంగా ఉండేలా నెమ్మదిగా వెనుకవైపు నేలమీద ఉంచాలి.
3.మోచేతి భాగం నుంచి చేతి వ్రేళ్ల వరకు నిటారుగా ఉంచి నెమ్మదిగా శరీరాన్ని వెనుకకు వంచాలి.
4.ఇప్పుడు భుజాలు నేలను తాకుతూ ఉండాలి. ప్రాధమిక దశలో ఉన్నవారైతే రెండు చేతులను తొడలపై ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఆ చేతులను మోకాలివరకు సమానంగా తీసుకురావాలి.
5.ఈ స్థితికి బాగా అలవాటు పడిన తర్వాత రెండు చేతులను కత్తెర ఆకారంలో ఉండేలా భుజాల కింద ఉంచాలి. కుడి చేయి ఎడమ భుజం కింద... అలాగే ఎడమచేయి కుడి భుజం కింద ఉంచాలి. రెండింటి మధ్య తలభాగం ఉండేలా చూసుకోవాలి.
6.తిరిగి వాస్తవిక స్థితికి వచ్చే సమయంలో, మొదటగా రెండు చేతులను శరీరానికి ఇరువైపులా ఉంచాలి.
7.తర్వాత మోచేతుల సాయంతో తొలుత ఉన్న స్థానానికి నిదానంగా వచ్చేయాలి.
గుర్తుంచుకోవలసినవి :-
1.మీ శరీరాన్ని వెనుకకు వంచే సమయంలో శరీర బరువును నియంత్రిస్తూ ఎలాంటి కుదుపులు లేకుండా నెమ్మదిగా చేయాలి. లేనిచో కండరాల నెప్పి వంటి సమస్యలు తలెత్తును.
2.ఈ ఆసనాలు వేసేప్పుడు ఏదైనా కష్టంగా అనిపించినట్లు.. లేదా సమస్యగా అనిపించినట్లు ఉంటే.. యోగసాధకులు ఈ ఆసనాన్ని వెయ్యకపోవడమే మంచిది.
3.ప్రాధమిక దశలో ఉన్న యోగసాధకులు... ఈ ఆసనంలో మోకాళ్లను దగ్గరగా ఉంచుకోవటం కష్టమనిపిస్తే కాస్త దూరదూరంగానైనా ఉంచుకోవచ్చు.
ప్రయోజనాలు, పరిమితులు :-
1.ఉదరసంబంధిత కండరాలను చైతన్య పరుచును.
2.తుంటి నొప్పి, అధికరక్తపోటు వంటి సమస్యలు ఉన్న వారికి ఈ ఆసనం సాయపడును.
3.మలబద్ధకము వంటి సమస్యలకు ఈ ఆసనం ఉత్తమం.
జాగ్రత్తలు :-
తొడ యొక్క పైభాగములో నొప్పి మరియు గ్యాస్ట్రిక్ ఇబ్బందులు గలవారు ఈ ఆసనాన్ని చేయరాదు.
Comments
Post a Comment