Skip to main content

Posts

Showing posts from December, 2017

లాఫర్(నవ్వు) యోగ యొక్క 5 ప్రయోజనాలు

మీరు ఒత్తిడి,విచారం మరియు నిరుత్సాహపడుతున్నరా? మీరు మీ జీవితంలో మరింత నవ్వు మరియు ఆనందం తీసుకురావాలని అనుకుంటున్నారా? ఇక్కడ లాఫర్ యోగ మీ ఆరోగ్యం కొరకు ప్రయోజనాలను అందిస్తుంది. 1. మంచి మూడ్ మరియు మరింత నవ్వు  మీ వ్యక్తిగత జీవితం,వ్యాపార జీవితం లేదా సామాజిక జీవితం అనే ప్రతిదీ మీ మూడ్ మీద ఆధారపడి ఉంటుంది.మీ మూడ్ మంచిగా ఉంటే,మీరు అన్ని విషయాలు చాలా బాగా చేయవచ్చు.నవ్వు యోగ వలన మీ మెదడు కణాలు నుండి ఎండార్ఫిన్లు అనే నిర్దిష్ట రసాయనాలు విడుదల అయ్యి నిమిషాల్లో మూడ్ మార్చడానికి సహాయపడుతుంది.మీరు సంతోషంగా మరియు రోజంతా మంచి మూడ్ లో ఉంటారు. అలాగే మీలో సాధారణంగా కంటే ఎక్కువ నవ్వు కనిపిస్తుంది.  2. ఆరోగ్యకరమైన వ్యాయామం ఒత్తిడిని ఓడిస్తుంది  నవ్వు యోగ ఆరోగ్యకరమైన మరియు శక్తివంతమైన అనుభూతిని ఎక్కువగా కలిగిస్తుంది. ఇది శరీరం మరియు మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ అందించే ఒక ఏరోబిక్ వ్యాయామం(గుండె వ్యాయామం)వంటిది. నవ్వు యోగ ఒకేసారి భౌతిక,మానసిక మరియు భావోద్వేగ ఒత్తిడి తగ్గించే ఒక వ్యాయామం అని చెప్పవచ్చు.  3. ఆరోగ్య ప్రయోజనాలు  మీరు జబ్బుపడి ఉంటే మీ జీవితం ఆనందంగా ఉండదు...

జ్ఞాపక శక్తిని కాపాడే 10 నిమిషాలు పాటూ చేసే సులభ యోగాభ్యాసనాలు

మతి భ్రమనాన్ని మరియు మతిమరుపు లాంటి లక్షణాలను దూరంగా ఉంచడానికి మనుషులు బహుశా ఇప్పటికే అన్ని విధాల ప్రయత్నిస్తూ, మరిన్ని కొత్త పద్దతులను అనుసరిస్తుంటారు. అంటే తమ మెదడును కాపాడుకోవటానికి మంచి నిద్ర మరియు వ్యాయామం లాంటి వాటిని చేస్తుంటారు. ఇప్పుడు పరిశోధనల వలన తేలిందేమిటంటే యోగ కూడా మీ మెదడును కాపాడుకోవటానికి ఒక మంచి సాధనమని. యోగ ఎలా మెదడును మేల్కొల్పుతుంది? యోగాభ్యాసం చేసేటప్పుడు మీరు శరీరాన్ని మాత్రమే కదపరు. అలా చేస్తున్నప్పుడు మీరు శ్వాశను పీల్చుకోవటం మరియు వదలటం మాత్రమే కాకుండా, అంగ విన్యాసం గురించి కూడా గుర్తుంచుకుంటారు. ఇతర వ్యాయామాలను అనగా పరుగెత్తడం లాంటివి చేస్తున్నప్పుడు మీ ధ్యాసకు చుట్టుపక్కల జరిగే వాటి వలన భంగం కలుగుతుంది. మీరు త్రికోనాసన భంగిమలో ఉన్నప్పుడు పరధ్యానంగా ఉన్నట్లయితే మీ ముఖం నేలకద్దుకుంటుంది. మానసిక ఒత్తిడి మీకు త్వరగా ముసలితనం రావటానికి కారణమే కాకుండా, మీ నిద్రను భంగం చేస్తుంది. హానికరమైన గడ్డలను ఎక్కువ చేస్తుంది. మీ జన్యు వనరులకు హాని చేస్తుంది. అంతేకాకుండా, శరీరం ముడతలు పడటానికి కారణం అవుతుంది. పురాతన పరిశోధనల వలన తెలిసిందేమిటంటే, మానసిక ఒత్తిడి మరియు ఆత...

"పైల్స్"ను దూరం చేసే "పవన ముక్తాసనం"

మారుతున్న ఆహారపు అలవాట్లు, విపరీతమైన పని ఒత్తిడి, తీవ్రమైన మానసిక భావోద్వేగాల కారణంగా... ఆధునిక కాలంలో చాలామంది పైల్స్ (మొలలు) రుగ్మతతో బాధపడుతున్నారు. గతంలో ఈ రుగ్మత మనదేశంలో చాలా తక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం ఈ రుగ్మత బారిన పడుతున్నవారిలో మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడిన వారిలో ఈ సమస్య అధికంగా వేధిస్తోందని కూడా వైద్యుల అభిప్రాయం. కాగా, అనేక రకాల వ్యాధులను నయం చేయడంలో యోగాసనాలు కూడా ప్రస్తుతం చాలా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పైల్స్ వ్యాధి నివారణలోనూ, జ్ఞాపక శక్తిని పెంచుకోవడంలోనూ ఉపయోగపడే "పవన ముక్తాసనం" గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఆసనం ఎలా వేయాలంటే... వెల్లకిలా పడుకుని, రెండు కాళ్లను ఒకదానితో ఒకటి దగ్గరగా కలిపి కిందికి చాచి ఉంచాలి. రెండు చేతులు నేలకు ఆన్చి నడుముకి దగ్గరగా ఉంచుకోవాలి. ఇప్పుడు మెల్లగా కుడి మోకాలును ఛాతి దాకా మడిచి రెండు చేతులతో మోకాలును పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత శ్వాసను వదులుతూ, తల భాగాన్ని పైకి లేపి గవదను తాకించాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ పూర్వస్థితిలోకి రావాలి. మరలా శ్వాసను వదులుతూ...

ఎసిడిటి తగ్గించే ఉత్థాన పాదాసనం

ప్రస్తుతం సంక్లిష్ట జీవన విధానంలో చాలామంది ఒత్తిడికి లోనవుతున్నారు. ఆదుర్దా, ఒత్తిడి అనేవి ప్రతి ఒక్కొరికి తప్పనిసరి అవుతున్నాయి. అందువల్ల ఉద్యోగస్తుల అనారోగ్యానికి గురవుతున్నారు. అనేక ఇతర రంగాలలో వుండేవారు, స్త్రీలు. చదువులలో మునిగిన పిల్లలు కూడా నాడీమండలోద్రేకం, ఎమోషనల్ సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. అందువల్ల అనేక శారీరక సమస్యలతో పాటు అజీర్ణం, గ్యాస్, ఎసిడిటి, మలబద్దకం వంటి జీర్ణమండల సమస్యలు తలెత్తున్నాయి. ఈ సమస్యలన్నిటితో పాటు ఆమ్లాధిక్యతను తగ్గించేందుకు యోగాసనాలు చాలా ఉపకరిస్తాయి. ఎసిడిటి తగ్గించేందుకు యోగాసనాలలో ఇది ఒకటి ఉత్థానపాదాసనం : 1. ఒక చాపపై వెల్లికిలా పరుండాలి. 2. పల్చటి తలగడపై తల ఆన్చాలి. 3. కాళ్లను నిటారుగా నేలబారుగా సాచాలి. 4. మొదట ఒక అడుగు ఎత్తు రెండు కాళ్లు ఎత్తాలి. 5. నడుము నేలకు తగులుతూ వుండాలి. 6. కాళ్లు నిటారుగా వుండాలి. 7. అరిచేతులు నేలకు ఆన్చి వుండాలి. 8. ఈ స్థితిలో 15 సెకన్లపాటు మామూలు శ్వాసక్రియ జరపాలి. 9. నిశ్వాసక్రియ జరుపుతూ కాళ్ళను నెమ్మదిగా నేలకు ఆన్చాలి. 10. యథా స్థితికి రావాలి. 11. అనుభవజ్ఞుల సలహాతో ఈ ప్రక్రియ 12 సార్లు వరకు చెయ్యవచ్చును. ...

వ్యాయమంతోనే వెన్నునొప్పి నివారణ

ఈ కాలం చాలా మందికి వెన్ను నొప్పి సర్వసాధారణమయ్యింది. ఆధునిక జీవనంలో శారీరక శ్రమ లేకపోవడం, ఉద్యోగరీత్యా అధిక సమయం కూర్చునే ఉండడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా వెన్నునొప్పి, మెడనొప్పి వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన దేశంలో ప్రతి పది మందిలో ఒకరు వెన్నునొప్పి వేధిస్తోంది. ఇది చాలా మందికి చికాకు కల్గిస్తోంది. దీనికి మార్గమేమిటాని ఆలోచిస్తున్నారు. చాలా మంది మందులు, మాకులు తిని నడుం నొప్పి పోగొట్టుకోవడాని ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే దీనిని చిన్నచిన్న వ్యాయామాలతో ఈ సమస్యను అధిగమించవచ్చు. వెన్ను వ్యాయామాలు చేసేటప్పుడు రెండు ఎక్సర్‌సైజుల మధ్య కొంత విశ్రాంతి తీసుకోవాలి. మెడ వ్యాయామాలకు ఈ అవసరం లేదు. ప్రతిరోజూ అల్పాహారానికి ముందు, రాత్రి భోజనానికి ముందు రెండుస్లారు ఈ వ్యాయామాలు చేస్తే వెన్ను, మెడనొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. చదునైన నేలపై ముందుగా వెల్లకిలా పడుకోవాలి. కాళ్లు రెండూ పైకి ఎత్తి మోకాలి దగ్గర లంబకోణంలో వంచాలి. నిదానంగా నడుము భాగాన్ని పైకి ఎత్తుతూ దించుతూ ఉండాలి. ఇలా ఆరుసార్లు చేయాలి. రోజూ ఈ వ్యాయామం చేస్తే నడుము ఎముకలు పటిష్టం అవుతాయి. అదే విధంగా కాళ్ళను వంచి...

మదుమేహానికి విరుగుడు మయూరాసనం

రెండు అరచేతులను భూమిపై పెట్టి మోచేతులపై పైకి లేచి శరీరాన్ని భూమికి సమాంతరంగా ఓ బద్దలా ఉండేటట్లు చేయటాన్ని మయూరాసనం అంటారు. సంస్కృతంలో మయూరమంటే నెమలి అని అర్థం. ఎవరైతే మోచేతులపై తమ బరువునంతా మోస్తూ భూమికి సమాంతరంగా ఓ బద్దలా ఉండగలుగటాన్ని మయూరాసనంగా చెపుతారు. ఈ ఆసనం చిత్రంలో చూపినట్లు మయూరాన్ని పోలి ఉంటుంది. ఆసనం వేసే పద్ధతి చేతులను కింద ఆనిస్తూ మోకాళ్లను కాస్త భూమికి తాకేవిధంగా ముందుకు వంగి కూర్చోండి. మీ చేతివెళ్లను భూమికి తాకిస్తూ రెండు అరచేతులను భూమిపై ఉంచండి. అయితే ఈ దశలో మీ చేతివేళ్లు వెనుకకు తిరిగి ఉండేటట్లు అరచేతులను ఉంచండి. మోచేతుల వద్ద మడిచి బలంగా ఉంచండి మెల్లగా రెండు కాళ్లను సమానంగా కాస్తంత దూరంగా జరిపి జాగ్రత్తగా ముందుకు జరిగి మెల్లగా వీపు భాగాన్ని పైకి లేపండి వీపు భాగాన్ని పైకి లేపిన తర్వాత, మీ కాళ్లను దగ్గరకు జరిపి నిటారుగా ఓ బద్దలా ( భూమికి సమాంతరంగా) ఉంచుతూనే మీ వక్షస్థలం, మెడ, తల భాగాలను కూడా భూమికి సమాంతరంగా ఉంటేట్లు చేయండి. అలానే కొంతసమయం చేసి తిరిగి మొదటి స్థానానికి వచ్చేయండి. మెల్లగా కాళ్లను మడిచి మోకాళ్లను భూమిపై పెట్టండి. ఇప్పుడు చేతులను భూమిపై నుంచి తీసివేసి మమ...

పవనముక్తాసనంతో ఉదరకోశవ్యాధుల నుంచి విముక్తి

పవనముక్తాసనం అనే సంస్కృత పదం. వాస్తవానికి మూడు పదాల మిశ్రం. ఇందులో పవన అంటే వాయు లేదా గాలి. ముక్త అంటే విడుదల లేదా విసర్జన. ఆసనం అంటే యోగాలో శరీర స్థితి. ఈ మూడు పదాల కలయికనే పవనముక్తాసనం అంటారు. ఈ ఆసనం ద్వారా ఉదరము, పేగులలోని అదనపు గాలి బయటకు వస్తుంది. గ్యాస్ట్రిక్‌ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సమస్యతో బాధపడుతున్నవారికి ఈ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఆసనం వేయు పద్దతి: నేలపై వెల్లకిలా పడుకోవాలి. మీ భుజాలు నేలపై విస్తారం పరచండి. అరచేతులు నేల వైపు ఉండాలి. కాళ్ళను మెల్లగా వెనక్కు మడవాలి. పాదాలు నేలను తాకేటట్టు ఉండాలి. తరువాత మెల్లగా ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకోండి. ఈ స్థితి నుంచి ఆసనం కింది చర్యలు చేయండి. కాళ్ళను పాదాలకు వ్యతిరేక దిశలో మడవాలి. మోకాళ్ళను ఛాతీభాగం వైపు తీసుకురండి. అరచేతులను నేలపై ఒత్తి పట్టాలి. భుజాలు, తల భాగాన్ని నేలకు వ్యతిరేకంగా పైకి తీసుకురండి. మళ్ళీ ఒక్క మారు అరచేతులను నేలపై ఒత్తి పట్టాలి. తుంటి, పిరుదలను మెల్లగా పైకి లేవనెత్తండి. మోకాళ్ళను ఛాతీకి మరింత దగ్గరగా తీసుకురండి. మోకాళ్ళు, పాదాలు సమేతంగా ఉండాలి. అయితే తల కిందకు దించరాదు. మడిచి ఉన్న మోకాళ్ళు, భుజాలను ఆలి...

మోకాళ్ళనొప్పులు , కీళ్ళనొప్పులకు చెక్ పెట్టే యోగసనాలు!

కొన్ని గంటల పాటు కూర్చున్న చోట నుంచి లేవకుండా పనిచేయడం, అదేపనిగా నిల్చుని పనిచేయడం.. వీటివల్ల నడుం కింద భాగంలో కొవ్వు పేరుకుపోవడం, మోకాళ్ళనొప్పులు, కీళ్ళనొప్పులూ వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటివి అదుపులో ఉంచాలంటే నటరాజాసనం, వాయు ముద్ర, సమతులాసనం ట్రై చేయండి.  1. నటరాజాసనం:   నిలబడి చేత్తో గోడను ఆసరాగా తీసుకుని కుడి మోకాలిని వెనక్కి మడిచి సాధ్యమైనంతవరకు పైకి లేపాలి. అరనిమిషం నుంచి నిమిషం వరకూ ఉండాలి. ఇలానే ఎడమకాలితో కూడా చేయాలి. ఈ ఆసనం చేయడం వల్ల కీళ్లనొప్పుల సమస్య ఉన్నవారికి తక్షణ ఉపశమనం దొరుకుతుంది.   2. వాయుముద్ర :  సుఖాసనంలో కూర్చుని చూపుడు వేలిని మడిచి దానిపైన బొటనవేలిని ఉంచాలి. తక్కిన వేళ్లను నిటారుగా ఉంచాలి. ఇదే వాయుముద్ర వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లుమూసుకొని శ్వాస తీసుకోవాలి. గాలిని వదిలేస్తున్నప్పుడు నొప్పులను బయటకు వదులుతున్నట్టుదా భావించాలి.   ఈ ముద్రలో పావుగంట పాటు ఉండొచ్చు. కీళ్ళనొప్పులు ఉన్నవారు రోజుకు మూడు నుంచి నాలుగుసార్లు ఐదునిమిషాల పాటు ఈ ముద్రవేయాలి. నొప్పులు తగ్గిన తర్వాత ఈ ముద్ర వేయడం మానేయాలి.   3. సమతులాసనం : ...

స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారా?ఐతే ఈ స్మార్ట్ యోగలు మీకోసమే..

మొబైల్ ఫోన్ వాడటం వలన మీకు మెడనొప్పివస్తోందా? లేక తలనొప్పి? లేదా భుజాలనొప్పి?  ఈనాటి అత్యాధునిక టెక్నాలజీ యుగంలో మొబైల్ ఫోన్ అనేది ప్రపంచమంతటా అత్యధికంగా వాడబడుతున్న తనటంలో అతిశయోక్తి లేదు. చదువునుండి ఆరోగ్యందాకా, మానవ సంబంధాలనుండి వ్యాపారందాకా, మొబైల్ ఫోన్లు ప్రపంచాన్ని సమూలంగా మార్చివేస్తున్నాయి. అయితే అతిగా మొబైల్ ఫోన్లను వాడటం వల్ల జీవనశైలిలో వచ్చే ఇబ్బందులూ పెరిగాయి.  ఉదాహరణకు మీరు ఈ వ్యాసాన్ని మీ మొబైల్ లో చదువుతున్నారనుకోండి, మీ మోచేతులు శరీరానికి రెండుపక్కలా వంగి ఉన్నాయి, వెన్ను వంగి ఉంది, మెడ కొంచెం ముందుకు వంగి, తలను నిలబెడుతోంది, అవునా? ఈ భంగిమలో ఉండటం, మీరు గమనించినా, లేకున్నా సరే మీకు బహుశా నొప్పిని కలిగిస్తూ ఉండవచ్చు. ఇది వైద్య పరిభాషలో ‘టెక్స్ట్ నెక్' అని పేర్కొనే ఆరోగ్య విపరిణామానికి దారితీయవచ్చు. టెక్స్ట్ నెక్ అనేది ఒక జీవనశైలి సమస్య. ఎక్కుసేపు ముందుకు వంగిన భంగిమలో గడిపేవారికి మెడ, వెన్నులో వచ్చే నెప్పి ఇది. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, -బుక్ రీడర్లు అతిగా వాడటంవలన ఇది రావచ్చు. మీ తల సాధారణంగా స్థిరంగా ఉన్నపుడు - అంటే మీ చెవులు మీ భుజాలకు పైగా ఉ...

అష్టాంగ యోగ సాధనతో ఒత్తిళ్లకు వీడ్కోలు పలుకుదాం.....

అలసట, ఆందోళన, ఒత్తిడి, తీవ్ర ఒత్తిడి (హైపర్‌ టెన్షన్‌), ప్రతి దానికి ఒత్తిడికి గురవటం..... మాటలేమో ఎదుటివారితో, ఆలోచనేమో మరెక్కడో, ప్రతిదానికి విసుగు, కోపం.... వీటితో లెక్కకు మించిన అనారోగ్యాలు....... అలాంటి టెన్షన్‌‌సను తగ్గించుకుని శరీరాన్ని, మనసును ఓ దగ్గర ఉంచుకోలేకపోవటం, మనసు మీద పట్టులేకపోవటం. ఇలాంటి వాటిని అధిగమించడానికి పూర్వం మహర్షులు, సిద్ధులు, యోగులు భరత ఖండంలో చక్కటి దారి చూపించారు. మానసిక పరమైన వ్యాధులను తగ్గించేందుకు అష్టాంగ యోగ పద్దతులతో పాటు అంతకుముందు కొన్ని ప్రాచీన యోగ పద్దతులను కూడా పాటించేవారు. క్లుప్తంగా వీటి కేసి చూద్దాం. ప్రాచీన యోగ పద్ధతులు: జ్ఞాన యోగ :  జ్ఞానం ద్వారా గమ్యాన్ని చేరటం. విజ్ఞానంతో నిన్ను నీవు తెలుసుకోవటం. సృష్టి రహస్యం తెలుసుకుని దాని మూల కేంద్రాన్ని చేరుకోవటం. భక్తియోగ :   భక్తి ద్వారా గమ్యాన్ని చేరటం. తమని తాము అర్పించుకోవటం. కర్మయోగ :  ప్రతిఫలాన్ని ఆశించకుండా, తన విద్యుక్త ధర్మాన్ని తాను నిర్వర్తించటమే కర్మయోగ. మంత్రయోగ :  మీకిష్టమైన మంత్రాన్ని లేదా శబ్దం ద్వారా -- రామ కావచ్చు లేదా ఓం కావచ్చు -- చేరవలసిన...

అర్ధధనురాసనంతో శరీరానికి కొత్త బలం

సంస్కృతంలో ధనుస్ అంటే బాణం. యోగాసనాలలో శరీరాన్ని బిగుతుగా ఆ ఆకృతిలోకి వంచడాన్ని అర్ధధనురాసనం అంటారు. ఒక క్రమ పద్దతిలో వళ్ళు వెనక్కి విరిచి పాదాల పైభాగాన్నిచేతులతో పట్టకునే విన్యాసమిది. చదునైన నేలపై బోర్లా పడుకోవాలి. గడ్డం నేలపై ఆనించి ఉంచాలి. భుజాలను శరీరానికి ఆనుకుని ఉండేలా చూడాలి. పాదాలను కాస్త యడముగా ఉంచాలి. కండరాలు చాలా వదులుగా ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా గాలి పీల్చుకోవాలి. కాళ్ళను మెల్లగా వెనక్కి వంచాలి. చేతులతో చీలమండను గట్టిగా పట్టుకోవాలి. తల, మెడను మెల్లగా వెనక్కి వంచాలి. ధీర్ఘంగా గాలి పీల్చుకోవాలి. తరువాత 10 సెకనులలో గాలి పీల్చుకోవడం పూర్తికావాలి. కనీసం 3 సెకనులు ఆగి గాలి వదలడం ఆరంభించాలి. గాలి వదలడం 15 సెకన్లలో పూర్తి కావాలి. కాళ్ళు వెనక్కు లాగాలి. క్రమంగా మోకాళ్ళు, బొటన వేళ్ళు దగ్గరకు చేర్చాలి. వాటిని దగ్గరకు చేర్చకపోతే గరిష్టంగా వెనక్కు వంగే అవకాశం ఉండదు.  ఉపయోగాలు అర్ధధనురాసనం శరీరానికి శక్తి, బలాన్ని ఇస్తుంది. శరీర అంతర్భాగాలకు బలం చేకూరుతుంది. మూత్రపిండాలు, పునరుత్పత్తి వ్యవస్థ ఉత్తేజమవుతాయి. జాగ్రత్తలు హరేనియా, పెద్దప్రేవు, పొట్ట అల్సర్లు, గుండె జబ్బు, రక్...

అధిక రక్తపోటును నియంత్రించే 5 ముఖ్య యోగాసనాలు

యోగాసనాలను అనుసరించటం వలన అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. వీటి వలన వివిధ రకాల ఆరోగ్య సమస్యల వలన బహిర్గతమయ్యే లక్షణాలను లేదా వాటిని తగ్గించుటం, అధికరక్తపోటు లేదా అధిక రక్త పీడనం వంటి వాటిని నియంత్రణలో ఉంచుతుంది. యోగాను రోజు చేయటం వలన టెన్షన్ మరియు మానసిక, భౌతిక ఒత్తిడిల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా, వీటి వలన శరీర బరువు తగ్గటం మాత్రమె కాకుండా, ఆరోగ్యకర బరువును నిర్వహించేలా చేస్తుంది. వీటి ఫలితంగా, రక్త పీడనం కూడా తగ్గుతుంది. రక్త పీడనాన్ని తగ్గించే యోగాసనాల గురించి కింద తెలుపబడింది. వృక్ష భంగిమ ఈ భంగిమను రోజు అనుసరించటం వలన బలంతో పాటూ, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ భంగిమలో, లోతైన శ్వాసను తీసుకొని, ముక్కు ద్వారా వదలటం వలన, ఊపిరిత్తిత్తులు పని తీరు మెరుగుపడుతుంది. ఈ యోగాసనాన్ని అనుసరించుకు, రెండు కాళ్ళను తాకిస్తూ, నిటారుగా నిలబడండి. తరువాత, కుడి కాలును పైకి ఎత్తి, పాదాన్ని, నెమ్మదిగా ఎడమ కాలు యొక్క తోడ వద్ద ఉంచండి. ఇలా అనుసరించే సమయంలో మీ రెండు చేతులను పైకి ఎత్తి, నమస్కారం భంగిమలో ఉంచండి. ఇలా కొన్ని నిమిషాల పాటూ నిలబడి, లోతైన శ్వాసను తీసుకొని, వదలం...

పాదహస్తాసనంతో మరింత జీర్ణశక్తి

ఈ ఆసనంలో కాలిబొటన వేలి నుంచి, చీలమండ పాదాలను తాకుతాము. కాళ్ళు నిటారుగా ఉంచుతూ, ఉదరము పైభాగాన్ని వంచి చేతులతో పాదాలను తాకే ఈ స్థితి పాదహస్తాసన అని అంటారు. ఆసన వేయు పద్దతి మొదటగా చదునైన నెలపై నిటారుగా నిలబడాలి. ఈ స్థితిలో కాళ్ళు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉండాలి. మెల్లగా గాలి పీల్చుకుంటూ తేతులను పైకి ఎత్తాలి. భుజాలు చెవులను తాకుతూ ఉండేలా చూసుకోవాలి. గాలి వదులుతూ ముందుకు వంగాలి. ఈ ఆసనంలో సడుగుల నుంచి పాదాల వరకు నిటారుగా చక్కగా ఉండాలి. ఇదే సమయంలో చేతులు పాదాలను తాకుతూ ఉండాలి. తలను మోకాళ్ళుకు సాధ్యమైనంత దగ్గరగా తీసుకురావాలి. ఇదే స్థితిలో 30 నుంచి 40 సెకనులు ఆగాలి. ఇది సూర్య నమస్కారంలోని 3వ దశను తలపిస్తుంది. మెల్లగా గాలి పీల్చుతూ ఈ స్థితి నుంచి బయటకు రావాలి.  మెల్లగా చేతలు, తలభాగాన్ని తిరిగి వెనక్కు తీసుకురావాలి.  ఉపయోగాలు జీర్ణ సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. నాడీమండాలానికి మంచి బలం చేకూరుతుంది. ఉదరభాగంలోని కండరాలని క్రమంలో ఉంచుతుంది. అంతర అవయవాలను, ప్రత్యేకించి జీర్ణావయవాలను ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా అవి మరింత వేగంగా పని చేస్తాయి. నడుము నొప్పి నుంచి మంచి ఉపశమనాన్ని కల...

కాయకల్ప యోగ భంగిమ దశలు మరియు ఉపయోగాలు

కాయకల్ప యోగ విధానం అనేది యోగ ప్రక్రియలో అత్యంత ప్రశంసనీయమైనది, జీవన శక్తిని మెరుగుపర్చడానికి ఈ యోగ విధానంను అభ్యసించడం జరుగుతుంది. కాయకల్ప యోగ భంగిమల ప్రాథమిక లక్ష్యం- శరీర విధానాన్ని గాడిలో పెట్టడం, సహజంగానే వృద్దాప్య ప్రక్రియను మందగింపచేసి, జీవిత కాలాన్ని పెంచుతుంది. యోగ అనేది భౌతిక జీవితం మరియు స్మారక స్థితితో కూడుకొని ఉంటుంది. కాయకల్ప యోగ విధానంను సాధన చేయడం ద్వారా లైంగిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిలోకి రూపాంతరం చెందించవచ్చు. కాయకల్ప యోగ విధానం యొక్క నియమావళి కాయకల్ప యోగ, నరాలు సరైన విధంగా పని చేయడానికి మరియు శరీర కేంద్ర నాడీ వ్యవస్థని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. యోగ పద్దతిలో "క్రౌన్ చర్కా" అనే ఆసనం వుంటుంది, దీనిని నుదుటి మధ్య భాగంలో ఉంచుతారు అది శక్తి ప్రవాహంపై ప్రభావం చూపుతుంది. ఈ సాధనను ఆచరించడం వలన మనం ఆరోగ్యకరమైన శరీరంతో పాటు ప్రశాంతమైన మనస్సు కలిగి ఉండేలా ప్రోత్సహిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, కాయకల్ప నియమావళి వలన సాధకుడు శరీర దారుడ్యం మరియు ఆధ్యాత్మికంగా కూడా సంతృప్తి పొందేలా చేస్తుంది. కాయకల్ప యోగ భంగిమల అనుసరణ     కాయకల్ప యోగ శ్వాససంబంధిత వ్యాయామాలత...

కంప్యూటర్‌తో ఎంతసేపు పని చేస్తున్నారు...?

ప్రస్తుతం చాలామంది కంప్యూటర్ ముందు కూర్చుని దాదాపు ఎనిమిది నుంచి పది గంటలవరకు పని చేస్తున్నారు. ఇది నిత్యకృత్యం అయిపోతోంది. దీంతో మానసికమైన ఒత్తిడి, శారీరకమైన ఒత్తిడి రెండూ పెరిగి పోతున్నాయి. వెంటనే రాత్రి అయ్యేటప్పటికి అలసటకు గురౌతుంటారు. కంప్యూటర్ ముందు కూర్చుని తదేకంగా చూస్తూ ఉండటం మూలాన కళ్ళకు శ్రమ ఎక్కువ కలుగుతోంది. అలాగే కొన్ని కానరాని సమస్యలకు లోనయ్యే ప్రమాదం ఉంది. నష్టాలు:  కంప్యూటర్‌తో ఎక్కువ సేపు పనిచేసేవారిలో జ్ఞాపకశక్తి లోపించడం, దూరదృష్టి లోపం, చిరాకు పడటం, వెన్నునొప్పి, అనవసరమైన అలసట మొదలైనవి ఏర్పడతాయి. కంప్యూటర్‌తో పని చేయడం అధికంగా ఉంటే మస్తిష్కంతోబాటు కళ్ళు కూడా బాగా అలసిపోతాయి. దీంతో నిద్రతో ఉపశమనం కలుగుతుందనుకుంటే పొరబాటే. అత్యధిక సమయం కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసేవారిలో దృష్టి లోపం ఏర్పడినట్లు వైద్యులు చెబుతున్నారు. అలాంటివారు కళ్ళజోడును ఎక్కువగా ధరిస్తున్నారని వైద్యులు తెలిపారు. ఇదికాకుండా జ్ఞాపకశక్తి కూడా కోల్పోతున్నట్లు వారి పరిశోధనల్లో తేలినట్లు పరిశోధకులు తెలిపారు. పని ఒత్తిడి కారణంగా వారిలో చిరాకు పాళ్ళు అధికంగా ఏర్పుడుతుంటుందని వైద్యులు చెబుతున...

వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, బరువును తగ్గించే పృధ్వి ముద్ర!

వైట్ డిశ్చార్జ్.. కాలేజీ పిల్లల నుంచి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల వరకూ చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఈ ఇబ్బంది ఇన్ఫెక్షన్లుగా మారకుండా ఉండటానికి, అదుపులో ఉంచడానికి పృధ్విముద్ర ఆసనాన్ని ఆచరించండి.    పృధ్వి ముద్ర:  పద్మాసనంలో కూర్చుని, రెండు చేతుల ఉంగరం వేళ్లు మడిచి బొటనవేళ్లను వాటిపై ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకుని శ్వాసమీదే ధ్యాస నిలపాలి. ఐదు సెకన్ల పాటు గాలిని తీసుకుంటే పదిసెకన్ల పాటు గాలిని వదలాలి. అంటే వదిలేటప్పుడు రెండు రెట్ల గాలిని వదలాలి. వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.

యోగ సాధనతో వ్యాధులు దూరం !

పతంజలి మహర్షి యోగని ఎనిమిది భాగాలుగా విభజించారు. వీటిలో మొదటి అయిదు ధ్యానసాధనలో బాహ్యంగా సహాయపడితే, చివరి మూడు అంతర్గత శక్తులను వెలికి తీసేందుకు దోహదం చేసి, యోగ సాధన ఫలాలను యిస్తాయి. ఎనిమిది విధానాలు: యమ:  ఒక సైనికుడి ఆయుధాలను అప్పగించినప్పుడు ముందుగా క్రమశిక్షణ నేర్పుతారు. ఎప్పుడు వాటిని ప్రయోగించాలి అనే విషయంతో పాటు సమాజ పరిరక్షణకు, శాంతి స్థాపనకు ఎలా ఉపయోగపడాలనేది అవగతం చేసుకుంటారు. జీవిత విధానంపై, ప్రవర్తనపై నిర్దిష్టమైన క్రమశిక్షణ వుండాలి. ఆ అయిదు అంశాలు: 1. అహింస 2. సత్యం 3. బ్రహ్మచర్యం 4. దొంగతనానికి పాల్పడకపోవడం 5. కోరికలను అదుపులో ఉంచుకోవడం ఈ అయిదు అంశాలను పాటించినప్పుడే యోగ సాధకుడు ముందు అడుగు వేయగలడు. నియమాలు:  యోగ సాధన ఈ దేహంతోనే చేయవలసి వుంటుంది. అందువల్ల శరీరం రోగగ్రస్తం కాకూడదు. ఆరోగ్యంగా, ధృఢంగా వుండాలి. ప్రకృతిలోని ఎటువంటి మార్పులని అయినా తట్టుకునే శక్తి కలిగి వుండాలి. వాంఛలు అదుపులో వుండాలి. సాధకుడు తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించగలగాలి. ఆ అనంతశక్తిని తెలుసుకోవాలనే జ్ఞానతృష్ణ కలిగి వుండాలి. పతంజలి మహర్షి సూచించిన అయిదు నియమాలు ఇవి:- 1...