Skip to main content

"పైల్స్"ను దూరం చేసే "పవన ముక్తాసనం"

మారుతున్న ఆహారపు అలవాట్లు, విపరీతమైన పని ఒత్తిడి, తీవ్రమైన మానసిక భావోద్వేగాల కారణంగా... ఆధునిక కాలంలో చాలామంది పైల్స్ (మొలలు) రుగ్మతతో బాధపడుతున్నారు. గతంలో ఈ రుగ్మత మనదేశంలో చాలా తక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం ఈ రుగ్మత బారిన పడుతున్నవారిలో మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు.

పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడిన వారిలో ఈ సమస్య అధికంగా వేధిస్తోందని కూడా వైద్యుల అభిప్రాయం. కాగా, అనేక రకాల వ్యాధులను నయం చేయడంలో యోగాసనాలు కూడా ప్రస్తుతం చాలా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పైల్స్ వ్యాధి నివారణలోనూ, జ్ఞాపక శక్తిని పెంచుకోవడంలోనూ ఉపయోగపడే "పవన ముక్తాసనం" గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.

ఈ ఆసనం ఎలా వేయాలంటే... వెల్లకిలా పడుకుని, రెండు కాళ్లను ఒకదానితో ఒకటి దగ్గరగా కలిపి కిందికి చాచి ఉంచాలి. రెండు చేతులు నేలకు ఆన్చి నడుముకి దగ్గరగా ఉంచుకోవాలి. ఇప్పుడు మెల్లగా కుడి మోకాలును ఛాతి దాకా మడిచి రెండు చేతులతో మోకాలును పట్టుకోవాల్సి ఉంటుంది.

ఆ తరువాత శ్వాసను వదులుతూ, తల భాగాన్ని పైకి లేపి గవదను తాకించాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ పూర్వస్థితిలోకి రావాలి. మరలా శ్వాసను వదులుతూ ఇలాగే ఎడమకాలితో కూడా చేయాలి. ఇలా రెండు కాళ్లతో చేసిన తరువాత మోకాళ్లను ఒకేసారి మడవాలి. గవదను మోకాళ్లతో తాకించాలి. ఇలా ఒకటి నుంచి పదిసార్లు చేయవచ్చు. ఆ తరువాత శవాసనంలోకి మారి విశ్రాంతి తీసుకోవాలి.

ఈ పవన ముక్తాసనం వేయడం వల్ల పైల్స్ బాధ నుండి విముక్తి పొందటమేగాకుండా, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. జ్ఞాపకశక్తిని పొంపొందిస్తుంది. గ్యాస్ ట్రబుల్ రాకుండా కాపాడుతుంది. నీళ్లు తాగిన తరువాత, కాలకృత్యాలు తీర్చుకోవటానికి ముందుగానే ఈ ఆసనం వేస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది.

Comments

Popular posts from this blog

కాయకల్ప యోగ భంగిమ దశలు మరియు ఉపయోగాలు

కాయకల్ప యోగ విధానం అనేది యోగ ప్రక్రియలో అత్యంత ప్రశంసనీయమైనది, జీవన శక్తిని మెరుగుపర్చడానికి ఈ యోగ విధానంను అభ్యసించడం జరుగుతుంది. కాయకల్ప యోగ భంగిమల ప్రాథమిక లక్ష్యం- శరీర విధానాన్ని గాడిలో పెట్టడం, సహజంగానే వృద్దాప్య ప్రక్రియను మందగింపచేసి, జీవిత కాలాన్ని పెంచుతుంది. యోగ అనేది భౌతిక జీవితం మరియు స్మారక స్థితితో కూడుకొని ఉంటుంది. కాయకల్ప యోగ విధానంను సాధన చేయడం ద్వారా లైంగిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిలోకి రూపాంతరం చెందించవచ్చు. కాయకల్ప యోగ విధానం యొక్క నియమావళి కాయకల్ప యోగ, నరాలు సరైన విధంగా పని చేయడానికి మరియు శరీర కేంద్ర నాడీ వ్యవస్థని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. యోగ పద్దతిలో "క్రౌన్ చర్కా" అనే ఆసనం వుంటుంది, దీనిని నుదుటి మధ్య భాగంలో ఉంచుతారు అది శక్తి ప్రవాహంపై ప్రభావం చూపుతుంది. ఈ సాధనను ఆచరించడం వలన మనం ఆరోగ్యకరమైన శరీరంతో పాటు ప్రశాంతమైన మనస్సు కలిగి ఉండేలా ప్రోత్సహిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, కాయకల్ప నియమావళి వలన సాధకుడు శరీర దారుడ్యం మరియు ఆధ్యాత్మికంగా కూడా సంతృప్తి పొందేలా చేస్తుంది. కాయకల్ప యోగ భంగిమల అనుసరణ     కాయకల్ప యోగ శ్వాససంబంధిత వ్యాయామాలత...

సూర్యనమస్కారాలతో ఆ సమస్య తగ్గుతుంది...

రకరకాల ఒత్తిళ్లతో బిజీగా ఉండే మహిళలకు ఆరోగ్యవంతమైన జీవితం చాలా ముఖ్యం. మరి అదేలా సాధ్యం... రోజూ తీసుకునే ఆహారాలలో పోషక విలువలు అధికంగా ఉండాలి. అలానే రోజుకో ఆపిల్ పండు తీసుకోవాలి. కొన్ని రకాల వ్యాయామాలతో మహిళలు ఆరోగ్యపరమైన జీవితాన్ని పొందవచ్చును. మరి ఆ వ్యాయామాలేంటో.. ఎలా చేయాలో చూద్దాం... అధిక బరువు గలవారు బరువు తగ్గాలనుకుంటే.. స్క్వాట్స్ వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామం చేయడం వలన ఊపిరితిత్తులు, హృదయానికి ఎంతో మేలు చేస్తుంది. తద్వారా బరువు తగ్గుతారు. తరచుగా సూర్యనమస్కారాలు చేయడం వలన నడుము భాగం గట్టి పడుతుంది. అలానే మోకాళ్లపై భాగం దృఢంగా మారుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.  ప్లాంక్స్ వ్యాయామం చేస్తే.. కండారాలకు చాలా మంచిది. ముఖ్యంగా ఛాతీ, కటి వలయ భాగం దృఢంగా మారుతుంది. ఈ వ్యాయామంతో రక్తంలోని చక్కెర స్థాయిలు మెరుగుపడుతాయి. తద్వారా శ్వాస తీసుకోవడంలో అడ్డంకులు ఉండవు. అలానే నెలసరి సమస్యలు అదుపులో ఉంటాయి. వ్యాయామం చేయడం వలన ముడతల చర్మం కాస్త తాజాగా మారుతుంది.

శలభాసనంతో మధుమేహం నియంత్రణ

శలభాసనం తామర స్థితి తెలుపుతుంది. ఇది పశ్చమోత్తనాసనానికి, హలాసనానికి వ్యతిరేక స్థితిలో ఉంటుంది. దీనివలన శరీరానికి ప్రయోజనాలు చేకూరుతాయి. అర్ధ శలభాసనం వేయడానికి మొదట నేలపై పడుకోవాలి. ఉదరం, ఛాతీ,చుబకం నేలను తాకుతూ ఉండాలి. భుజాలు చదునుగా పరచాలి. వేళ్ళను నేలపై ఉంచాలి. పిడికిలి బిగించి పైకి తీసుకు రావాలి. మెల్లగా గాలి పీల్చకుని 10 సెకనులు బిగపట్టాలి. పూర్తిగా గాలి పీల్చకుంటే కాళ్ళు ఎత్తడానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి పూర్తిగా గాలి పీల్చుకోరాదు. ఊపిరి వదలడం మొదలు పెట్టాలి. గాలి పీల్చుతూనే ఆసనాన్ని పూర్తిచేయాలి. నిశ్చ్వాసమనేది కాళ్ళు నేలను చేరేటప్పటికి పూర్తి కావాలి. శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి చేతులు లేదా అరచేయి లేదా పిడికిలి వినియోగించాలి. పిడికిలిని కేవలం అనుభవజ్ఞులు మాత్రమే వినియోగించాలి. మెల్లగా కాళ్ళ వీలైనంత ఎత్తుకు తీసుకురావాలి. నాభి వరకు ఉన్న శరీరభాగం నేలను తాకి ఉండాలి. అది కదలకూడదు. మొండెం చక్కగా ఉండాలి. కాళ్ళు లేపడానికి కేవలం నాభి కింది భాగంలో ఉన్న ప్రాంతాన్ని మాత్రమే వినియోగించాలి. ఉదరం, ఛాతీ, చేతులు, చుబుకం ఖచ్చితంగా ఆసనంలో ఉన్నంతసేపు నేలను తాకే ఉండాలి. కాళ్ళు ఎత్తిన స్థానంల...