ప్రస్తుతం చాలామంది కంప్యూటర్ ముందు కూర్చుని దాదాపు ఎనిమిది నుంచి పది గంటలవరకు పని చేస్తున్నారు. ఇది నిత్యకృత్యం అయిపోతోంది. దీంతో మానసికమైన ఒత్తిడి, శారీరకమైన ఒత్తిడి రెండూ పెరిగి పోతున్నాయి. వెంటనే రాత్రి అయ్యేటప్పటికి అలసటకు గురౌతుంటారు.
కంప్యూటర్ ముందు కూర్చుని తదేకంగా చూస్తూ ఉండటం మూలాన కళ్ళకు శ్రమ ఎక్కువ కలుగుతోంది. అలాగే కొన్ని కానరాని సమస్యలకు లోనయ్యే ప్రమాదం ఉంది.
కంప్యూటర్‌తో ఎక్కువ సేపు పనిచేసేవారిలో జ్ఞాపకశక్తి లోపించడం, దూరదృష్టి లోపం, చిరాకు పడటం, వెన్నునొప్పి, అనవసరమైన అలసట మొదలైనవి ఏర్పడతాయి. కంప్యూటర్‌తో పని చేయడం అధికంగా ఉంటే మస్తిష్కంతోబాటు కళ్ళు కూడా బాగా అలసిపోతాయి. దీంతో నిద్రతో ఉపశమనం కలుగుతుందనుకుంటే పొరబాటే.
అత్యధిక సమయం కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసేవారిలో దృష్టి లోపం ఏర్పడినట్లు వైద్యులు చెబుతున్నారు. అలాంటివారు కళ్ళజోడును ఎక్కువగా ధరిస్తున్నారని వైద్యులు తెలిపారు. ఇదికాకుండా జ్ఞాపకశక్తి కూడా కోల్పోతున్నట్లు వారి పరిశోధనల్లో తేలినట్లు పరిశోధకులు తెలిపారు.
పని ఒత్తిడి కారణంగా వారిలో చిరాకు పాళ్ళు అధికంగా ఏర్పుడుతుంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారు కార్యాలయంలోని కొపాన్నంతటిని ఇంట్లోని వారిపై చూపుతుంటారని వారు పేర్కొన్నారు. సహజంగా కంప్యూటర్‌తో ఎక్కువ సమయం గడిపేవారిలో ఇలాంటి బాధలు ఉత్పన్నమౌతాయని వారంటున్నారు.
ముందుగా మీ కంప్యూటర్‌ను మీ కళ్ళకు సమాంతరంగా ఉంచుకోండి. దీంతో మీ కళ్ళకు శ్రమ తగ్గించినవారవుతారు. ముఖ్యంగా మీ కంప్యూటర్‌ను మీరు కూర్చునే స్థానం నుంచి కనీసం రెండు అడుగుల నుండి మూడు అడుగుల దూరంలో ఉంచండి. మరో విషయం ఏంటంటే కంప్యూటర్‌తో నిరంతరం పని చేస్తుంటే మధ్య మధ్యలో కనీసం 5 నుంచి 10 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో దృష్టిని మరల్చండి. దీంతో దూర దృష్టి లోపం రాదంటున్నారు వైద్యులు.

నష్టాలు:

జాగ్రత్తలు పాటించండిలా...!

Comments
Post a Comment