హైపర్ టెన్షన్ మానవ శరీర ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావం చూపుతుంది. కాబట్టి హైపర్ టెన్షన్ ను ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. హార్ట్ స్ట్రోక్ మరియు హార్ట్ అటాక్ ను ప్రమాధాన్ని తగ్గించుకోవాలంటే, మనం తీసుకొనే రెగ్యులర్ డైట్ లో హైపర్ టెన్షన్ తగ్గించే ఆహారాలను చేర్చుకోవాలి. హైపర్ టెన్షన్ మరియు హైబ్లడ్ ప్రెజర్ కొన్ని తీవ్రమైన పరిస్థితుల కారణం వల్ల ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా ఊబకాయం, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యం సేవించడం, వ్యాయామం చేయకపోవడం, బర్త్ కంట్రోల్ పిల్స్, పెయిన్ కిల్లర్స్, కిడ్నీ సమస్యలు మరియు అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ మరియు హైబ్లడ్ ప్రెజర్ కు గురికావల్సి ఉంటుంది. ఇంకా హైపర్ టెన్షన్ వల్ల, కిడ్నీ, మెమరీ పవర్ మరియు సెక్స్ డ్రైవ్ మీద తీవ్రప్రభావం చూపుతుంది. ఆధునిక యుగంలో అధిక రక్తపోటు అనేది నిశ్శబ్ద కిల్లర్స్ లలో ఒకటిగా మారింది. కాబట్టి మీకు అధిక రక్తపోటు ఉంటే, దానికి చెక్ పెట్టటానికి యోగ ఆసనాలను ప్రయత్నించండి. పశ్చిమోత్తాసన: రక్తపోటుతో బాధ పడుతున్న వారిలో ధమనులు అణచివేయబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది క్రమంగా గుండెపోటు మరియు స్ట్రోక్ కు దారితీస్తుంది. ...