పశ్చిమోత్తాసనం...
1. ఒక చాపపై కూర్చోవాలి2. కాళ్లు నిటారుగా చాపాలి
3. తల, నడుము, మెడ ఒకే సరళరేఖలో వుండాలి
4. ఉచ్ఛ్వాసక్రియ జరుపుతూ రెండు చేతులను పైకి ఎత్తాలి.
5. నెమ్మదిగా, నిశ్వాసక్రియ జరుపుతూ రెండు చేతులను కిందకి దించాలి
6. రెండు కాళ్ల బొటనవేళ్లు, రెండు చేతులతో పట్టుకోవాలి
7. మోకాళ్లమీద నుదురు ఆన్చాలి
8. ఈ ప్రక్రియ జరపడం మొదట్లో చాలా కష్టంతో కూడుకున్నది. కనుక ఎంతవరకు చేతులు చాపి పట్టుకోగలమో అంతవరకు జరిపి అక్కడ కాళ్లను పట్టుకోవాలి. అతిగా శ్రమపడకూడదు
9. ఇలా 10 సెకన్లు ఉండాలి
10. గాలి పీల్చుకుంటూ చేతులు నెమ్మదిగా పైకెత్తుతూ రిలాక్స్ అవ్వాలి
ఉపయోగాలు :
1. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.2. కఫ, వాతం కంట్రోల్ అవుతాయి
3. రక్తనాళాలన్నీ పటిష్టపడతాయి.
Comments
Post a Comment