వీరాసనం వేయడం వల్ల పొట్ట తగ్గుతుంది. పిక్కలు, తొడలు, పిరుదులు, మోకాళ్లు బలపడుతాయి. వెన్నెముకకు బలం చేకూరుతుంది. ఊపిరితిత్తులు విస్తరిస్తాయి. ఛాతీ సంబంధమైన వ్యాధులకు ఈ ఆసనం మంచి ఉపయోగకారి అని చెప్పుకోవచ్చు. అయితే, మోకాళ్ల నొప్పులు మరీ ఎక్కువగా ఉండేవారు మాత్రం ఈ ఆసనానికి దూరంగా ఉండటం మంచిది.
ఆయా తొడల కింద, ఆయా పాదాలను ఉంచి... ఆ తరువాత శరీరాన్ని నిట్ట నిలువుగా ఉంచి కూర్చోవటాన్ని వీరాసనం అని అంటారు.
రెండు కాళ్లు కలిపి ఉంచాలి. ముందుగా ఎడమకాలు ముందుకు తేవాలి. మెల్లగా ఎడమ కాలును మోకాళ్ల వద్ద ఉంచి నిటారుగా కుడికాలుని తిన్నగా, మెల్లగా వెనుకకు పూర్తిగా చాచి ఉంచాలి. ఇప్పుడు మెల్లగా రెండు చేతులను పైకి నిటారుగా లేపి ఛాతీని కూడా ముందుకు పోనిచ్చి, తల మెడ వెనకకు వంచాలి. చాపిన రెండు చేతులు నమస్కార ముద్రలో తలపైన ఉంచుకోవాలి.
వీరాసనం అంటే..?
ఆయా తొడల కింద, ఆయా పాదాలను ఉంచి... ఆ తరువాత శరీరాన్ని నిట్ట నిలువుగా ఉంచి కూర్చోవటాన్ని వీరాసనం అని అంటారు.
వీరాసనం ఎలా వేయాలంటే...?
రెండు కాళ్లు కలిపి ఉంచాలి. ముందుగా ఎడమకాలు ముందుకు తేవాలి. మెల్లగా ఎడమ కాలును మోకాళ్ల వద్ద ఉంచి నిటారుగా కుడికాలుని తిన్నగా, మెల్లగా వెనుకకు పూర్తిగా చాచి ఉంచాలి. ఇప్పుడు మెల్లగా రెండు చేతులను పైకి నిటారుగా లేపి ఛాతీని కూడా ముందుకు పోనిచ్చి, తల మెడ వెనకకు వంచాలి. చాపిన రెండు చేతులు నమస్కార ముద్రలో తలపైన ఉంచుకోవాలి.
Comments
Post a Comment