ఆరోగ్యానికి సూర్యనమస్కారం ఎంతో మేలు చేస్తుంది. ఇది పలుయోగాసనాల మేలు కలయిక. ఈ ఆసనాన్ని ఏ వయస్సులోని వారైనా వేయవచ్చు. దీని వలన శారీరకంగానూ, మానసికంగానూ ఉపయోగంగా ఉంటుంది. సూర్యనమస్కారం 12 ఆసనాలతో కలసి ఉంటుంది.
గాలిపీల్చుకుంటూ భుజాలను పైకి తీసుకురావాలి. చెవులను తాకుతూ ఉండాలి. మెల్లగా చేతులను వెనకవైపుకు తీసుకురావాలి. వీలైనంతగా తలను వెనక్కు వంచాలి.
మెల్లగా గాలి వదులుతూ ముందుకు వంగాలి. చేతులను సమాంతరంగా ఉంచుతూ నేలను తాకాలి. ఈ సమయంలో తల మోకాలిని తాకుతూ ఉండేంతవరకూ తీసుకురావాలి. ఈ స్థితిలో కొన్నిసెకనులు అలాగే ఉండాలి. దీనినే పాద పశ్చిమోత్తాసనం అంటారు.
గాలి పీల్చుతూ కుడికాలును వెనక్కు తీసుకురావాలి. వీలైనంత వెనక్కు ఉండేలా చూడాలి. ఈ స్థితిలో తలపైకెత్తాలి. కొన్ని సెకనలు ఈ స్థితిలో ఉండాలి.
మెల్లగా గాలి వదులుతూ అదే విధంగా ఎడమ కాలిని వెనక్కు తీసుకురావాలి. పాదాలు రెండూ పక్కపక్కన ఉండేలా చూడాలి. భజాలు చక్కగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు శరీరం బాణం విల్లు ఆకారంలో ఉంటుంది.
ఆసనం వేయు పద్ధతి...
నిలబడిన స్థితిలో కాళ్ళను పరస్పరం దగ్గరకు తీసుకు రావాలి. భుజాలను చక్కగా పైకి తీసుకు రావాలి. తలకుపైకి తీసుకు వచ్చిన అరచేతులను కలపాలి. ఆలాగే ముఖం ఎదుటకు తీసుకువచ్చి నమస్కారం చేసే స్థితికి రావాలి. కలిపిన చేతులు ఛాతీ వద్ద ఉండేలా చూసుకోవాలి.గాలిపీల్చుకుంటూ భుజాలను పైకి తీసుకురావాలి. చెవులను తాకుతూ ఉండాలి. మెల్లగా చేతులను వెనకవైపుకు తీసుకురావాలి. వీలైనంతగా తలను వెనక్కు వంచాలి.
మెల్లగా గాలి వదులుతూ ముందుకు వంగాలి. చేతులను సమాంతరంగా ఉంచుతూ నేలను తాకాలి. ఈ సమయంలో తల మోకాలిని తాకుతూ ఉండేంతవరకూ తీసుకురావాలి. ఈ స్థితిలో కొన్నిసెకనులు అలాగే ఉండాలి. దీనినే పాద పశ్చిమోత్తాసనం అంటారు.
గాలి పీల్చుతూ కుడికాలును వెనక్కు తీసుకురావాలి. వీలైనంత వెనక్కు ఉండేలా చూడాలి. ఈ స్థితిలో తలపైకెత్తాలి. కొన్ని సెకనలు ఈ స్థితిలో ఉండాలి.
మెల్లగా గాలి వదులుతూ అదే విధంగా ఎడమ కాలిని వెనక్కు తీసుకురావాలి. పాదాలు రెండూ పక్కపక్కన ఉండేలా చూడాలి. భజాలు చక్కగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు శరీరం బాణం విల్లు ఆకారంలో ఉంటుంది.
Comments
Post a Comment