ఉద్యోగాలు చేసేవారు ఎక్కువ వత్తిడికి గురవ్వడం వల్ల తరచుగా ఏకాగ్రతను కోల్పోతుంటారు. కేవలం ఉద్యోగస్తులు మాత్రమే కాదు అనేక మంది విద్యార్ధులు కూడా వారి చదువులో లేదా ఆటలలో ఏకాగ్రతను కోల్పోతున్నారు.
మందులు వేసుకుంటే కొద్ది సమయం మాత్రమే ఏకాగ్రతను పెంపొందించుకోవచ్చు. కానీ, మీ ఏకాగ్రతను పెంపొందించుకోవడానికి శాశ్వతమైన పరిష్కారం కోసం యోగా మంచి ఎంపిక.
అన్నిట్లోకి, నటరాజాసన (దేవుడి నృత్య భంగిమ) ఇది ఏకాగ్రతను మెరుగుపరుచుకోవడానికి సహాయపడే ఒక యోగా ఆసనం. నటరాజాసన అనే పదం సంస్కృతంలో "నట్" అంటే నృత్యం, "రాజ" అంటే రాజు, "ఆసన" అంటే భంగిమ అని అర్ధం. ఇది శివుడికి ఇష్టమైన ఆసనం, దీనివల్లే శివుడిని నృత్యానికే దేవుడు అంటారు.
ఈ ఆసనం మనకు సహాయపడటమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్సగా కూడా పనిచేస్తుంది, అంతేకాకుండా ఇది భారతీయ శాస్త్రీయ కళాఖండాలలో ఒకటి కూడా. ఇది ఏకాగ్రతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, కానీ నటరాజ ఆసనం వల్ల అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కుడా ఉన్నాయి.
మొదటగా ఈ ఆసనం వేసేవారికి ఇది చాలా కష్టంగా ఉంటుంది, అందుకని ప్రారంభంలో గోడను ఆధారం చేసుకుని చేయడం అవసరం. అయితే, దీనిని ప్రతిరోజూ చేస్తే, ఇది చాలా తేలిక. ఈ ఆసన పద్ధతులు, వీటి ప్రయోజనాలపై ఒకసారి దృష్టి సారించండి.
1.మోచేతులను పక్కగా పెట్టి, నిఠారుగా నిలబడండి.
2. ఒకే ప్రదేశంపై దృష్టి పెట్టి, మీ ఎడమ పాదాన్ని నిదానంగా నిలబెట్టండి, ఎడమ కాలుపై బరువును పెట్టండి.
3. మీ కుడి కాలును వెనకకు వంచి కుడి చేతిని కుడి మడిమను పట్టి ఉంచి గాలి పీల్చండి.
4. మీ కుడి కాలును పైకి లేపండి.
5. మీ ఎడమ మోచేతిని కదిలించి నిఠారుగా ముందుకు పెట్టండి.
6. సాధారణ శ్వాస తీసుకోండి, ఈ భంగిమలో కనీసం 20 సెకండ్లు ఉండండి.
7. నిదానంగా సాధారణ స్థితికి రండి.
8. ఇదే విధంగా మరో కాలుతో ఇలాగే 3-4 సార్లు చేయండి.
బరువు తగ్గిస్తుంది.
కాళ్ళు, పిర్రలు, కాలి మడాలను బలోపేతం చేస్తుంది.
ఒత్తిడి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
తొడలు, పొట్ట వంపడానికి సహాయపడుతుంది.
భంగిమ, సమతౌల్యం మెరుగుపరుస్తుంది.
జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
రక్తపోటు తక్కువగా ఉన్నవారు ఈ ఆసనాన్ని అభ్యసి౦చరాదు. మొదటగా ఈ ఆసనాన్ని వేసేవారు ప్రారంభంలో గోడను ఆధారంగా చేసుకుని బాలెన్స్ చేసుకోవాలి. నిపుణుల ఆధ్వర్యంలో ఈ ఆసనం అభ్యసించడం మంచిది.

దశలవారీగా నటరాజ ఆసనం వేసే విధానం:

నటరాజ ఆసనం వల్ల ఇతర ప్రయోజనాలు:
బరువు తగ్గిస్తుంది.
కాళ్ళు, పిర్రలు, కాలి మడాలను బలోపేతం చేస్తుంది.
ఒత్తిడి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
తొడలు, పొట్ట వంపడానికి సహాయపడుతుంది.
భంగిమ, సమతౌల్యం మెరుగుపరుస్తుంది.
జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
జాగ్రత్తలు:
రక్తపోటు తక్కువగా ఉన్నవారు ఈ ఆసనాన్ని అభ్యసి౦చరాదు. మొదటగా ఈ ఆసనాన్ని వేసేవారు ప్రారంభంలో గోడను ఆధారంగా చేసుకుని బాలెన్స్ చేసుకోవాలి. నిపుణుల ఆధ్వర్యంలో ఈ ఆసనం అభ్యసించడం మంచిది.
Comments
Post a Comment