స్త్రీలలో చాలా తరచుగా వచ్చే తలనొప్పి మైగ్రేయిన్ లేదా మైగ్రేన్ తలనొప్పి. దీంట్లో తలనొప్పి సాధారణంగా తలలో ఒకవైపున మాత్రమే ఉంటుంది. తరచుగా వస్తూంటుంది. కళ్లు బైర్లు కమ్మినట్లుగా ఉండటం, వాంతి వచ్చేటట్లు ఉండటం లేదా వాంతులు ఉండటం, దీంతో ముఖ్య లక్షణాలు. తలకు సంబంధించిన రక్తనాళాలు వ్యాకోచించడం వల్ల ఇది వస్తుంది.
ఇవి కుటుంబపరమైనవి. ఎవరైనా మైగ్రేయిన్ తలనొప్పితో బాధపడుతూ ఉంటే కనీసం వాళ్లకు సంబంధించిన కుటుంబసభ్యులు లేదా బంధువులలో తలనొప్పి సాధారణంగా 12-14 సంవత్సరాల వయస్సులో మొదలై మధ్యవయసు వరకు వస్తుంది.
ఈ తలనొప్పి వచ్చే ముందుగా వచ్చే లక్షణాలు ఏవంటే... కళ్లు బైర్లు కమ్మడంతో మొదలై విపరీతమైన నీరసం తర్వాత తీవ్రమైన తలనొప్పి, వాంతులు, వెలుగును ఏ మాత్రం చూడలేకపోవడం, చెమటలు పట్టడం, శరీరం పట్టు తప్పిపోవడం ఉంటాయి. చీకటిగా ఉన్న గదిలో కాస్త ఉపశమనంగా ఉంటుంది. ఈ ఎటాక్ కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు ఉండొచ్చు.
తలనొప్పితో ఉద్రిక్తత
ఇది తలకు, మెడకు, కండరాలకు సంబంధించిన తలనొప్పి, తల బరువుగా దేనితోనైనా గట్టిగా కట్టేసినట్లుగా ఉండడం దీని ముఖ్య లక్షణం. దీంట్లో తల, మెడ కాకుండా అప్పుడప్పుడు దవడ కండరాలు వీపుపై భాగం కూడా నొప్పిగా ఉండొచ్చు. ఇవి కదిలేటప్పుడు కూడా నొప్పి పెరుగుతుంది. ఇవి సాధారణంగా ఉద్రేకాలతో వచ్చే తలనొప్పులే. ఈ మైగ్రేన్, టెన్షన్ తలనొప్పులు ఒకే వ్యక్తిలో కూడా రావచ్చు.
ఆధునిక వైద్యశాస్త్రానికి పై తలనొప్పులు నిజంగా తలనొప్పే. అయితే యోగశాస్త్రం ద్వారా చక్కటి రీతిలో వాటిని తగ్గించడానికి వీలుంది. వాటిలో కొన్నిటిని చూద్దాం.
యోగక్రియలలో ముఖ్యంగా జలనేతి ఈ మైగ్రేన్ తలనొప్పికి బాగా పనిచేస్తుంది.
ఆసనాలలో పవన ముక్తాసనం, శశాంకాసనం, శవాసనం, సూర్య నమస్కారాలు
ప్రాణాయామంలో నాడీ శోధన, భ్రామరి, భ్రసిక్త ప్రాణాయామం
ధ్యానంలో యోగనిద్ర అనేవి మైగ్రేన్ తలనొప్పి నివారణకు చక్కగా ఉపయోగపడతాయి.
Comments
Post a Comment