Skip to main content

Posts

Showing posts from May, 2018

పద్మాసనం చేయండిలా..!

మనసును ఏకాగ్రతతో ఉంచాలనుకుంటే పద్మాసనం చాలా ఉత్తమమైనది. పద్మ అంటే కమలం, కాబట్టి ఈ ఆసనానికి కమలాసనం అనికూడా అంటారు.  చేసే విధానం:   పద్మాసనాన్ని కూర్చొని చేస్తారు. ముందుగా సావధానంగా కూర్చొవాలి. ఎడమ చేతితో కుడి కాలి బొటన వేలును పట్టుకుని ఎడమ తొడపై పెట్టుకోవాలి. అలాగే ఎడమ కాలిని కుడి తొడపై పెట్టుకోవాలి. రెండు చేతుల బొటన వ్రేళ్ళను కలిపి నిటారుగా కూర్చోండి. మెడను చక్కగా వుంచండి. మీ మనసును కేంద్రీకృతం చేయండి. ఇది అన్ని రకాల రుగ్మతలకు వినాశకారిగా పనిచేస్తుందని యోగా గురువులు తెలిపారు. దీనివలన లాభాలు:-  "ఇదం పద్మాసన ప్రోక్తంసర్వవ్యాధి వినాశనం" అంటే పద్మాసనం వలన సమస్త రోగాలు నాశనం అవుతాయి. సమస్త రోగాలు అంటే దైవికంగా, దైహికంగా, భౌతిక పరమైన వ్యాధులు అని అర్థం.  పద్మాసనంలో ప్రాణాయామం చేస్తే సాధకుడు లేక రోగి ఆత్మ ప్రశాంతంగావుంటుందని యోగా నిపుణులు తెలిపారు. ధ్యానం చేసేవారికి ఈ ఆసనం ఎంతో శ్రేష్టమైందని వారు పేర్కొన్నారు. జాగ్రత్తలు:  ఈ ఆసనం చేసేటప్పుడు కాళ్ళల్లో నొప్పులు అధికమైనప్పుడు ఆసనాన్ని నిలిపివేయడం ఉత్తమం అంటున్నారు యోగా గురువులు.

దృఢమైన శరీరం కోసం విపరీత నౌకాసనం

నౌకాసనం వేసే వారు చదునైన నేలపై సాధన చేయాలి. ఈ ఆసనంలో శరీరం నౌక ఆకారంలో తయారవుతుంది. అందుకే దీనిని నౌకాసనం అంటారు. దీనినే విపరీత నౌకాసనం అని కూడా అంటారు.  ఆసనం వేయు పద్దతి  ఉదరం, ఛాతీ భాగం నేలను తాకే విధంగా భూమిపై పడుకోవాలి. నుదటి భాగం నేలను తాకేటట్టు ఉండాలి. భుజాలు, పాదాలు వాటి వాటి స్థానాల్లో ఉండేలా చూచుకోవాలి. భుజాలను ముందుకు చాచాలి. భుజాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. అరచేతులు కిందకు పెట్టాలి.  చేతి వేళ్ళ మధ్య యడము ఉండరాదు. ఒకదానికొకటి దగ్గరగా చేర్చాలి.  నేలపై ఆనించిన నుదటి భాగాన్ని రెండు భుజాలకు మధ్యన ఉండేలా చూసుకోవాలి. గాలి పీల్చుకుంటూ కాళ్ళు, మెడ, భుజాలు, తల భాగాలను మెల్లగా లేపాలి. మోచేతులు, మోకాళ్ళు ఎటువంటి పరిస్థితులలో వంచరాదు.  ఆసన సమయంలో జర్కులు ఉండరాదు. పై భుజాలు ఖచ్చితంగా చెవులను తాకుతూ ఉండాలి.  పాదాలు ఒకదానికొకటి తాకుతూ ఉండాలి.  తలను వీలైనంతగా పైకి లేపాలి. లేపిన పైభుజాల మధ్య తల ఉండేలా చూసుకోవాలి.  వీలైనంత బాగా వెనక్కు వంగాలి.  శరీరం వంచిన విల్లు తరహాలో ఉండాలి. వంపు అనేది కాలి బ్రొటన వేలు...

"మకరాసనం"తో మెడనొప్పులు మటుమాయం.!

మెడనొప్పులతో బాధపడేవారు మకరాసనం వేయడంవల్ల ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా టైప్ ఇనిస్టిట్యూట్‌లలో పనిచేసేవారు, ప్రెస్ కంపోజింగ్ పనిలో ఉండేవారు, కంప్యూటర్ ఆపరేటర్లు, లెక్కలు రాసేవారు, పుస్తకాలు చదివేవారు ఎక్కువగా మెడనొప్పికి గురవుతుంటారు. ఇలాంటివారు రాత్రి భోజనానికి ముందుగా ఈ ఆసనం వేయడం మంచిది. మకరాసనం అంటే... ముందుగా మకరం అంటే మొసలి అని అర్థం కదా.. ఈ ఆసనం కూడా మొసలి రూపంలో ఉంటుంది కాబట్టి దీనికి ఆపేరు వచ్చింది. దీనికే "నిరాలంబాసనం" అనే మరో పేరు కూడా ఉంది. ఈ ఆసనం ఎలా వేయాలంటే... ముందుగా బోర్లా పడుకుని భుజంగాసనంలాగా వేయాలి. రెండు చేతులను చుబుకం కింద ఆనించి, బుగ్గలను ఒత్తుతూ ఉండాలి. అలాగే, రెండు మోచేతులను జోడించి నేలపైన ఉంచి... శ్వాసను సామాన్యంగా పీలుస్తూ, కళ్లు మూసుకుని, మెడమీద మనసు నిలపాలి. అలా రెండు నిమిషాల తరువాత తలను కిందికి దించి, మోకాళ్లను చాపి ఉంచాలి, మడవవద్దు. తరువాత శరీరం బరువునంతటినీ భూమిమీద పడేసి కళ్లు మూసుకోవాలి. అన్ని ఇంద్రియాలను మరచిపోయి, కాసేపు అలాగే పడుకోవాలి. ఇలా చేయడం వల్ల మనస్సు శాంతపడుతుంది, శరీరమంతా శీతలీకరణం చెందుతుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన వి...

చిన్న పిల్లలకు "వ్యాయామం" మంచిదేనా..?!

సాధారణంగా పిల్లలు స్కూలునుంచి రాగానే, ఏదైనా కాస్త టిఫిన్ తినిపించి వెంటనే ట్యూషన్లకు తరిమేస్తుంటారు తల్లిదండ్రులు. స్కూలు, స్కూలు నుంచీ రాగానే ట్యూషన్, ట్యూషన్ నుంచి రాగానే హోంవర్క్, ఆపైన నిద్ర, మళ్లీ పెందలాడే లేవటం, స్కూలుకు పరుగులెత్తటం.. పిల్లల జీవితం ప్రతిరోజూ ఇలాగే గడుస్తుంటుంది. అయితే స్కూలునుంచి ఇంటికి వచ్చిన పిల్లలతో కాసేపు వ్యాయామం చేయించటం మంచిదని వైద్యులు, పిల్లల నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు పాఠశాలల నుంచి ఇంటికి రాగానే, ప్రెషప్ అయిన తరువాత తల్లిదండ్రులు వారితో కాసేపు వ్యాయామం చేయించటం మంచిదని నిపుణుల సలహా. ఆ తరువాతే వారికి ఎక్కువగా పోషక విలువలు ఉండే ఆహారాన్ని తినిపించి ట్యూషన్లకు పంపించాలని అంటున్నారు. ఇలా చేయటంవల్ల పిల్లలు చదువుల్లో ముందుండటమేగాకుండా.. చురుకుగా ఉంటారని చెబుతున్నారు. వ్యాయామం చేయించటం కుదరనివారు పిల్లలచేత యోగా, మెడిటేషన్ లాంటివి చేయించినా మంచి ఫలితం ఉంటుందంటున్నారు. పిల్లలతో వ్యాయామం చేయించటంవల్ల అనేక లాభాలున్నాయి. ముఖ్యంగా సాయంత్రంవేళల్లో వ్యాయామం చేయిస్తే.. పిల్లలు శారీరకంగా బలంగా తయారవుతారు. పాఠశాలల్లో ఎక్కువ సమయం కూర్చొనేందుకు సరిపడా శక్తిని, ...

పవనముక్తాసనంతో ఉదరకోశవ్యాధుల నుంచి విముక్తి

పవనముక్తాసనం అనే సంస్కృత పదం. వాస్తవానికి మూడు పదాల మిశ్రం. ఇందులో పవన అంటే వాయు లేదా గాలి. ముక్త అంటే విడుదల లేదా విసర్జన. ఆసనం అంటే యోగాలో శరీర స్థితి. ఈ మూడు పదాల కలయికనే పవనముక్తాసనం అంటారు.  ఈ ఆసనం ద్వారా ఉదరము, పేగులలోని అదనపు గాలి బయటకు వస్తుంది. గ్యాస్ట్రిక్‌ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సమస్యతో బాధపడుతున్నవారికి ఈ చాలా ఉపయుక్తంగా ఉంటుంది.  ఆసనం వేయు పద్దతి:  నేలపై వెల్లకిలా పడుకోవాలి.  మీ భుజాలు నేలపై విస్తారం పరచండి.  అరచేతులు నేల వైపు ఉండాలి.  కాళ్ళను మెల్లగా వెనక్కు మడవాలి.  పాదాలు నేలను తాకేటట్టు ఉండాలి. తరువాత  మెల్లగా ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకోండి.  ఈ స్థితి నుంచి ఆసనం కింది చర్యలు చేయండి.  కాళ్ళను పాదాలకు వ్యతిరేక దిశలో మడవాలి.  మోకాళ్ళను ఛాతీభాగం వైపు తీసుకురండి.  అరచేతులను నేలపై ఒత్తి పట్టాలి.  భుజాలు, తల భాగాన్ని నేలకు వ్యతిరేకంగా పైకి తీసుకురండి.  మళ్ళీ ఒక్క మారు అరచేతులను నేలపై ఒత్తి పట్టాలి.  తుంటి, పిరుదలను మెల్లగా పైకి లేవనెత్తండి.  మోకాళ్ళను ఛాతీకి మరింత...

లింగ ముద్ర

లింగ ముద్ర లేదా బొటనవేలి ముద్ర పురుషత్వానికి ప్రతీక. కాబట్టి దీనిని లింగ ముద్ర అనికూడా అంటారు.  చేయు విధానం :  రెండు చేతుల వేళ్ళను కలిపి గ్రిప్‌గా ఉంచుకోండి. ఒక బొటన వేలుతో మరొక బొటన వేలిని కలిపి స్థిరంగా ఉంచుకోండి. దీంతో శరీరంలో ఉష్ణం పెరుగుతుంది.  లాభాలు :  లింగ ముద్రను చేయడం వలన గుండెల్లో మంట, కఫం ఉంటేకూడా తొలగిపోతుంది. ఈ ముద్రను చేయడంతో ఊపిరితిత్తులలో పేరుకుపొయిన గల్ల(కఫం)ను తొలగించి ఊపిరితిత్తులకు బలం చేకూరుస్తుంది. దీంతో వ్యక్తిలో స్ఫూర్తి, ఉత్సాహం పెల్లుబుకుతుంది. శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన క్యాలరీలను తొలగించి ఊబకాయాన్ని తగ్గిస్తుందని యోగా గురువులు తెలిపారు. జాగ్రత్తలు :  ఈ లింగ ముద్రగురించి యోగా గురువులను సంప్రదించి వివరంగా తెలుసుకోవాలి. ఈ ముద్రగురించి మీకు అవసరమైనప్పుడు మాత్రమే తెలుసుకుని చేయడానికి ప్రయత్నించండి. లింగముద్రను చేసిన తర్వాత నీరు త్రాగాల్సివుంటుంది

యోగాసనాలు వేసే ముందు పాటించాల్సిన జాగ్రత్తలు

ఆసనాలు వేసే ముందు మొట్ట మొదటగా మీరు పాటించాల్సిన అంశాలు కొన్ని వున్నాయి. అవి ఆసనాలకు మీరు కేటాయించే సమయం. తర్వాత ప్రాణాయామం, ధ్యానంకు నిర్దేశించుకున్న సమయం. ఇందుకు సంబంధించి ప్రతి రోజు యోగకు గంట సమయం కేటాయించండి. దానిలో అరగంట ఆసనాలకు, పది నిమిషాలు ప్రాణాయామం, ఇరవై నిమిషాలు ధ్యానంకు కేటాయించుకుంటే మంచి ఫలితం వస్తుంది.  ఆసనాలు వేస్తున్నామని ఇప్పటికే మీరు వాడుతున్న మందులు, వైద్యులను సంప్రదించటాన్ని మాత్రం మానకండి. తర్వాత ఆసనాలు వేసే విషయంలో మీకు ఏ ఇబ్బంది వచ్చినా దగ్గరిలోని యోగ మాష్టారును సంప్రదించి ఆసనాలను మీరు సరిగా వేస్తున్నారో లేదో నిర్ధారించుకోండి. ఆసనాలు వేసే ముందు మనం కొన్ని అంశాలను పాటించాల్సివుంది. * ఎనిమిది నుంచి 60 సంవత్సరాల వాళ్లు మాత్రమే యోగ చేయాలి. * తెల్లవారు జామునే లేచి కాలకృత్యాలు తీర్చుకోండి * ఆసనాలు వేసే ముందుగా గోరు వెచ్చటి నీటితో స్నానం చేయండి. * తెల్లవారు జామునే ఆసనాలు వేయండి. ఆ సమయంలో గాలిలో ప్రాణ శక్తి ఎక్కువగా వుంటుంది. గాలి బాగా వచ్చే ప్రదేశం చూసుకుని వేయండి. * శబ్దాలు, గోలలు లేకుండా వుండే ప్రదేశాన్ని ఎన్నుకోండి.

యోగాసనాలు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి

ఆరోగ్యానికి మించింది మరేది లేదు. ఈ ప్రపంచంలో ఆరోగ్యంగావుంటే దేన్నైనా సాధించొచ్చు. శారీరక, మానసిక ఆరోగ్యంగా వుండాలంటే యోగా ఉత్తమం అంటున్నారు యోగా గురువులు. సర్వాంగాసనం సర్వాంగాసనం వేసేటప్పుడు గాలి లోపలికి పీల్చి కాళ్లను నిట్టనిలువుగా ఎత్తాలి, నడుముకు రెండు చేతులు ఆనించి శరీరానికి భుజాలను ఆధారం చేసుకోండి. గాలి పీల్చి వదులుతూ కాసేపయ్యాక గాలి వదులుతూ మీ కాళ్ళను కిందికి దించండి. ఈ ఆసనం వేయడంవలన శరీరంలోని జీవక్రియలు మెరుగు పడతాయి. దీంతో థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పని చేస్తుంది.  గుర్తుంచుకోవాల్సిన విషయం..గుండెజబ్బులుగలవారు, మెడ భాహంలో స్పాండిలోసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు ఈ ఆసనం వేయకూడదంటున్నారు యోగామాస్టర్లు.

యోగా సాధన నియమ నిష్టలు.. ముందు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

సంపూర్ణ ఆరోగ్యదాయని యోగా. నిత్యం యోగా సాధన చేయడం వలన శారీరక, మానశిక పరమైన సమస్యలు దరిచేరవు. అయితే యోగా చేయడానికి ఒక విధానం ఉంది. దాని ప్రకారం చేస్తేనే మనం చేసే యోగా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. అయితే యోగాను అలక్ష్యదోరణిలో చేస్తే పలు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంది. ముఖ్యంగా యోగా పరకడుపున చేయాలి. తేలికపాటి ఆహారం తీసుకుని ఉన్నా పర్వాలేదు. దుప్పటిపైన గానీ, చాప మీద కానీ యోగా సాధన చేయాలి. మహిళలు గర్భిణిలుగా ఉన్నప్పుడు, లేదా ఆరోగ్యం బాగోలేనప్పుడు యోగా చేయకూడదు. యోగా చేసే వారు సౌకర్యంగా ఉండే తేలికపాటి దుస్తులను ధరించి యోగా సాధనను చేయాలి.  బాగా అలసటగా ఉన్నప్పుడు, ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న సందర్భంలో ప్రశాంతమైన వాతావరణంలో బాడీ, మైండ్ విశ్రాంతిగా ఉన్న స్థితిలో యోగా మొదలుపెట్టాలి. ప్రార్ధనతో సాధన ప్రారంభించాలి. ప్రార్ధన వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. శ్వాస తీసుకోవడం కానీ, వదలడం కానీ నాసిక ద్వారా మాత్రమే చేయాలి. యోగా సాధన ముగిశాక 20 - 30 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. ఆహారం కూడా యోగా చేసిన తర్వాత 20 -30 నిమిషాలకు చేయాలి.

వ్యాయామానికి ముందు-తర్వాత వీటిని పాటిస్తున్నారా?

యాంత్రిక జీవనంలో అనేక మంది వివిధ రకాల వ్యాయామాలను చేస్తుంటారు. ఇవి ప్రతిరోజూ చేయడం వల్ల ఎముకలు, కండరాల నిర్మాణం, నాడీమండలం, రక్తప్రసరణ వ్యవస్థ ఇలా ప్రతి భాగం ఉత్తేజమవుతూ ఉంటుంది. ఎముకలు, కండరాల బలహీనతలు ఏర్పడడం, అనేక దీర్ఘకాల వ్యాధుల నుంచి రక్షణనిస్తుంది. అయితే, ఈ వ్యాయామం చేయడానికి తప్పకుండా క్రమ పద్దతిని పాటించాలి. ఏరోబిక్స్ వంటి వ్యాయామం చేయడానికి ముందుగా కనీసం ఐదు నిమిషాల సేపు దేహాన్ని వార్మప్, తర్వాత కూల్ డౌన్ చేసుకోవాలి.  వార్మప్ చేయడం వల్ల కండరాలు మృదువుగా కదులుతాయి. కీళ్ల కదలికలు సులువుగా మారుతాయి. చిన్నపాటి కదలికలతో దేహంలో ఉష్ణోగ్రత, గుండె కొట్టుకునే వేగం, రక్తప్రసరణ వేగం పెరుగుతాయి. కండరాలకు సరిపడినంత రక్తం అందడం, దాని వల్ల చిన్నపాటి గాయాలు వాతంటత అవే తగ్గిపోవడం వంటి ప్రయోజనాలుంటాయి.  ముఖ్యంగా శరీరంలో అన్ని అవయవాల పనితీరులో సమన్వయం పెరుగుతుంది. దేహాన్ని స్ట్రెచ్ చేసేటపుడు ఒక్కసారిగా వంచేయకూడదు. నిదానంగా రిలాక్స్ అవుతూ చేయాలి. వార్మప్‌లో భాగంగా దేహాన్ని స్ట్రెచ్ చేసేటపుడు ఒక్కొక్క దశలో పదిహేను సెకన్లు ఉండేటట్లు చూసుకుంటే మంచిది.  అలాగే, స్ట్రెచ్ చేసేటపుడు ...

యోగా సాధనకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

నేటి జీవనశైలికి యోగా సాధన తప్పనిసరిగా మారిపోయింది. ఒత్తిడిని నివారించాలంటే తప్పనిసరిగా కొద్దిసమయమైనా వ్యాయామం చేయాలి. అయితే, ఒత్తిడిని తగ్గించడంలో యోగా తర్వాతే ఏదైనా. అయితే, యోగాసనాలు వేసే ముందు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించి తీరాల్సిన పరిస్థితి ఉంది.  ముందుగా ఆసనాలు, తర్వాత ప్రాణాయామం, ఆ తర్వాత ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడం మాత్రమే కాదు అనారోగ్యాలు అంత త్వరగా దగ్గర చేరకుండా కూడా కాపాడుకోవచ్చు. ఒక గంట పాటు మీరు యోగసాధనకు కేటాయించాలనుకుంటే ముందుగా అరగంట పాటు ఆసనాలు, తర్వాత పదినమిషాల పాటు ప్రాణాయామం, ఆ తర్వాత ఇరవైనిమిషాల పాటు ధ్యానం చేయాలి. ఇలా సమయాన్ని కేటాయించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. * యోగసానాలు 8 నుంచి 60 యేళ్ల మధ్య వయస్సున్న వారు మాత్రమే చేయాలి.  * తెల్లవారు జామున నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మాత్రమే యోగసాధన మొదలుపెట్టాలి. ఎందుకంటే ఆసమయంలో గాలిలో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది.  యోగసాధనకు గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే ప్రదేశాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.  * వీలైనంత వరకు నిశ్శబ్ధంగా ఉండేలా చూడాలి.  * పలుచని వస్త్రా...

సూర్య నమస్కారాల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం

సూర్య నమస్కారాలను చేయడం వెనుక ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలు దాగి ఉన్నాయి. సూర్యనమస్కారాలను చేయడం వల్ల శరీరంలోని 638 కండరాలకు శక్తి వస్తుంది. ఈ సూర్య నమస్కారాలను 12 భంగిమల్లో చేస్తారు. వీటిని 12 పేర్లతో ఉచ్ఛరించే మంత్రాలు కూడా ఉన్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం.. 1. ఓం మిత్రాయనమః 2. ఓం రదయేనమః 3. ఓం సూర్యాయనమః 4. ఓం భానవేనమః 5. ఓం ఖగాయనమః 6. ఓం పూష్ణేనమః 7. ఓం హిరణ్య గర్భాయనమః 8. ఓం మరీచేనమః 9. ఓం ఆదిత్యాయనమః 10. ఓం సవిత్రీ నమః 11. ఓం అర్కాయనమః 12. భాస్కరాయనమః అంటూ ఈ 12 నామాలకు 12 రకాలుగా శరీరాన్ని ముందుకు వెనక్కి వంచుతూ సూర్యనమస్కారాలు చేస్తారు.

ఆహారం మీద కోరికలను యోగాతో నియంత్రించండి

ఆహారం విషయంలోప్రతి ఒక్కరు వారివారికి నచ్చింది, ఇష్టమైనది తింటూ ఆనందంలో మునిగిపోతారు, అయితే, వారి తినేటటువంటి అలవాట్ల మీద ద్రుష్టిపెట్టకపోతే, ఫలితం తీవ్రమైన తినేటటువంటి రుగ్మత ఏర్పడుతుంది. మరియు అది ఆహారపు అలవాట్లను ఇష్టాఇష్టాలను వ్యక్తిగతంగా నియంత్రించుకోవడం మరియు క్రమశిక్షణతో ఉండటం ఎల్లప్పుడు సులభం కాదు. ముఖ్యంగా ఆహారం మీద కోరికలు నియంత్రించుకోలేరు, కానీ, యోగా ద్వారా ఈ ఫుడ్ కర్వింగ్స్(ఆహారం మీద కోరికలను)నియంత్రించుకోవచ్చని యోగా ద్వారా నిరూపించబడినది.  రెగ్యులర్ గా యోగా చేసే వారు ఆకలి ఎలా కంట్రోల్ ఉంటుందనే విషయాన్ని యోగా ద్వారా గమనించారు. ఆకలి కోరికలను అరికట్టడానికి యోగ సహాయపడుతుందని అంటారు . ఆసక్తికరంగా ఉంది కదూ, రెగ్యులర్ గా యోగా చేసే వారు శరీరాన్ని ఫిట్ గా ఉంచడం , వారి మనస్సును విశ్రాంతి పరచడం , వారి శరీరాలు సంతృప్తికరంగా మార్చుకోవడం మాత్రమే కాదు, యోగా ద్వారా స్వీయ క్రమశిక్షణ ఉంచుతుంది మరియు యోగా వల్ల యోగా సాధకులల్లో తరచూ ఆకలి అరికట్టేందుకు అత్యంత ఎఫెక్టివ్ గా సహాయపడుతుందని అంగీరించారు. కలి నిరోధించే యోగ సులభమైన భంగిమ యోగ సెషన్స్ లో సాధారణంగా వివిధ శ్వాస వ్య...