ఆసనాలు వేసే ముందు మొట్ట మొదటగా మీరు పాటించాల్సిన అంశాలు కొన్ని వున్నాయి. అవి ఆసనాలకు మీరు కేటాయించే సమయం. తర్వాత ప్రాణాయామం, ధ్యానంకు నిర్దేశించుకున్న సమయం. ఇందుకు సంబంధించి ప్రతి రోజు యోగకు గంట సమయం కేటాయించండి. దానిలో అరగంట ఆసనాలకు, పది నిమిషాలు ప్రాణాయామం, ఇరవై నిమిషాలు ధ్యానంకు కేటాయించుకుంటే మంచి ఫలితం వస్తుంది.
ఆసనాలు వేస్తున్నామని ఇప్పటికే మీరు వాడుతున్న మందులు, వైద్యులను సంప్రదించటాన్ని మాత్రం మానకండి. తర్వాత ఆసనాలు వేసే విషయంలో మీకు ఏ ఇబ్బంది వచ్చినా దగ్గరిలోని యోగ మాష్టారును సంప్రదించి ఆసనాలను మీరు సరిగా వేస్తున్నారో లేదో నిర్ధారించుకోండి. ఆసనాలు వేసే ముందు మనం కొన్ని అంశాలను పాటించాల్సివుంది.
* ఎనిమిది నుంచి 60 సంవత్సరాల వాళ్లు మాత్రమే యోగ చేయాలి.
* తెల్లవారు జామునే లేచి కాలకృత్యాలు తీర్చుకోండి
* ఆసనాలు వేసే ముందుగా గోరు వెచ్చటి నీటితో స్నానం చేయండి.
* తెల్లవారు జామునే ఆసనాలు వేయండి. ఆ సమయంలో గాలిలో ప్రాణ శక్తి ఎక్కువగా వుంటుంది. గాలి బాగా వచ్చే ప్రదేశం చూసుకుని వేయండి.
* శబ్దాలు, గోలలు లేకుండా వుండే ప్రదేశాన్ని ఎన్నుకోండి.

Comments
Post a Comment