మనసును ఏకాగ్రతతో ఉంచాలనుకుంటే పద్మాసనం చాలా ఉత్తమమైనది. పద్మ అంటే కమలం, కాబట్టి ఈ ఆసనానికి కమలాసనం అనికూడా అంటారు.
చేసే విధానం:
పద్మాసనాన్ని కూర్చొని చేస్తారు. ముందుగా సావధానంగా కూర్చొవాలి. ఎడమ చేతితో కుడి కాలి బొటన వేలును పట్టుకుని ఎడమ తొడపై పెట్టుకోవాలి. అలాగే ఎడమ కాలిని కుడి తొడపై పెట్టుకోవాలి. రెండు చేతుల బొటన వ్రేళ్ళను కలిపి నిటారుగా కూర్చోండి. మెడను చక్కగా వుంచండి. మీ మనసును కేంద్రీకృతం చేయండి. ఇది అన్ని రకాల రుగ్మతలకు వినాశకారిగా పనిచేస్తుందని యోగా గురువులు తెలిపారు.
దీనివలన లాభాలు:-
"ఇదం పద్మాసన ప్రోక్తంసర్వవ్యాధి వినాశనం" అంటే పద్మాసనం వలన సమస్త రోగాలు నాశనం అవుతాయి. సమస్త రోగాలు అంటే దైవికంగా, దైహికంగా, భౌతిక పరమైన వ్యాధులు అని అర్థం.
పద్మాసనంలో ప్రాణాయామం చేస్తే సాధకుడు లేక రోగి ఆత్మ ప్రశాంతంగావుంటుందని యోగా నిపుణులు తెలిపారు. ధ్యానం చేసేవారికి ఈ ఆసనం ఎంతో శ్రేష్టమైందని వారు పేర్కొన్నారు.
జాగ్రత్తలు:
ఈ ఆసనం చేసేటప్పుడు కాళ్ళల్లో నొప్పులు అధికమైనప్పుడు ఆసనాన్ని నిలిపివేయడం ఉత్తమం అంటున్నారు యోగా గురువులు.

Comments
Post a Comment