వయస్సు మళ్లడం సహజం పరిణామం. కొన్ని యోగాసనాల ద్వారా వయస్సు మళ్లడాన్ని పూర్తిగా ఆపకున్నా, యవ్వనంగా కనిపించే అవకాశం ఉంది. అది కూడా చాలా సులభంగా. మూలాసాన, ఉత్కటాసన, పుర్వోత్తనాసన, చతురంగాసన... ఈ నాలుగు ఆసనాలతో యవ్వనంగా కనిపించవచ్చు. ఇవి చేయడం చాలా సులభమే.. యోగా మ్యాట్ పైన నిటారుగా నిలబడండి. మెల్లిగా పాదాలు వెడంగా చేస్తూ సుమారుగా రెండు కాళ్ళ మధ్య కనీసం మూడు అడుగులు ఖాళీ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు రెండు చేతులను దగ్గరికి తీసుకొస్తూ దండం పెడుతున్న పోజిషన్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కాళ్ళను దగ్గరకు వంచి మీ కోర్ భాగాన్ని కిందకు దించాలి. స్లోగా వీలైనంత కిందకు దించాలి. ఇలా మూడు నాలుగు సెకండ్లు ఉంచి తిరిగి సాధారణ స్థితిలోకి తీసుకోవాలి. ఇలా ఐదారు సార్లు చేయాలి. అలాగే ఉత్కటాసన.. ఇది శరీరంలోని వివిధ సాగులను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ముఖ్యంగా పిరుదల భాగంలో ఏజ్‌తో పాటు సంభవించే సాగుడను నివారిస్తుంది. యోగ మ్యాట్ పైన నిటారుగా నిలబడాలి. రెండు కాళ్ళను దగ్గరగా ఉంచుతూ నిటారుగా నిలబడాలి. రెండు చేతులు దండం పెడుతున్న పోజ్ లోకి తీసుకురావాలి. చేతులను తలపైకి అలాగే లేపాలి. ఇప్పుడు మెల్లగా మోకాళ్ళ దగ్గర వంచి ...