Skip to main content

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు.
ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు.

అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్


ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి.

సైడ్ ప్లాంక్


సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ఎడమ ఎగువ వైపుకు కుడి కాలిని ఉంచండి; ఈ విధంగా చేస్తున్నపుడు శ్వాసను బయటకు వదిలేయాలి. ఇప్పుడు శరీరంను పొత్తికడుపు కండరాలకు సమాన వరుసలో ఉంచి బిగువుపర్చి, మొండెంను క్రింది వైపుకు త్రోయాలి. వేళ్లు పై కప్పు ఎదుర్కొనే విధంగా కుడి చేతిని పైకెత్తాలి. మీరు ఈ భంగిమలో ఉండగా, దృష్టిని ముందుకు లేదా పైకి కేంద్రీకరించాలి. చివరగా శ్వాసని లోనికి పీల్చుకుంటూ మరియు యదాస్థానంకు తిరిగి వచ్చేయాలి. ఇదే విధంగా మరొక వైపు పునరావృతం చేయాలి.

ప్లాంక్


ప్లాంక్ భంగిమలో మీ నడుము క్రింది వైపుకు దించి ఉండాలి మరియు ఈ విధంగా చేస్తున్నపుడు, శ్వాసను లోనికి పీల్చుకోవాలి. మణికట్టు వైపుకు నేరుగా భుజాలతో మీ మొండెంను ముందుకు తీసుకెళ్ళాలి. మోచేతులని ఏమాత్రం కూడా వంచకూడదు. పొత్తికడుపు కండరాలను సంకోచింప చేస్తూ మరియు చేతులు నిఠారుగా ఉంచాలి. మీ యొక్క శరీరం తల నుండి బొటనవేలు వరకు ఒకే పంక్తిలో ఉందని నిర్ధారించుకోవాలి.

అప్ వర్డ్ డాగ్


అప్ వర్డ్ డాగ్ భంగిమను చేసే సమయంలో మీ తుంటి భాగం నేల వైపు దించి ఉండాలి, శ్వాసను బయటకు వదలాలి. ఇప్పుడు, కాలి బ్రొటనవేళ్ళను లోనికి మడవకుండా, మీ అరచేతులను నేల వైపుకు త్రోయాలి, చేతులను నిఠారుగా ఉంచి ఛాతిని పైకి ఎత్తాలి మరియు పొత్తికడుపు కండరాలను కూడా ఇందులో నిమగ్నించాలి. చెవుల నుండి దూరంగా మరియు భుజాల అంచులు ఒకదానితో ఒకటి ఆలింగనం చేసుకోవాలి. చివరగా, నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను వదులాలి మరియు తిరిగి డౌన్ వర్డ్ డాగ్ భంగిమలోకి వచ్చేయాలి.

చతురంగ


చతురంగ భంగిమలో శరీరం చాప వైపు ముఖం చేసి ఉండాలి మరియు శరీరం ఒక సరళ రేఖలో సమలేఖనమై ఉంచి శ్వాసను వదులాలి. శరీరంను నేలకు దగ్గరిగా చేస్తూ మోచేతులను 90 డిగ్రీల వరకు వంచాలి. పొత్తికడుపు కండరాలను సంకోచింప చేయాలి మరియు మీ భుజాలు ముందు వైపుకు చుట్టుముట్టకుండా ఉండడాన్ని నివారించాలని నిర్ధారించుకోండి.


Comments

Popular posts from this blog

సూర్యనమస్కారాలతో ఆ సమస్య తగ్గుతుంది...

రకరకాల ఒత్తిళ్లతో బిజీగా ఉండే మహిళలకు ఆరోగ్యవంతమైన జీవితం చాలా ముఖ్యం. మరి అదేలా సాధ్యం... రోజూ తీసుకునే ఆహారాలలో పోషక విలువలు అధికంగా ఉండాలి. అలానే రోజుకో ఆపిల్ పండు తీసుకోవాలి. కొన్ని రకాల వ్యాయామాలతో మహిళలు ఆరోగ్యపరమైన జీవితాన్ని పొందవచ్చును. మరి ఆ వ్యాయామాలేంటో.. ఎలా చేయాలో చూద్దాం... అధిక బరువు గలవారు బరువు తగ్గాలనుకుంటే.. స్క్వాట్స్ వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామం చేయడం వలన ఊపిరితిత్తులు, హృదయానికి ఎంతో మేలు చేస్తుంది. తద్వారా బరువు తగ్గుతారు. తరచుగా సూర్యనమస్కారాలు చేయడం వలన నడుము భాగం గట్టి పడుతుంది. అలానే మోకాళ్లపై భాగం దృఢంగా మారుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.  ప్లాంక్స్ వ్యాయామం చేస్తే.. కండారాలకు చాలా మంచిది. ముఖ్యంగా ఛాతీ, కటి వలయ భాగం దృఢంగా మారుతుంది. ఈ వ్యాయామంతో రక్తంలోని చక్కెర స్థాయిలు మెరుగుపడుతాయి. తద్వారా శ్వాస తీసుకోవడంలో అడ్డంకులు ఉండవు. అలానే నెలసరి సమస్యలు అదుపులో ఉంటాయి. వ్యాయామం చేయడం వలన ముడతల చర్మం కాస్త తాజాగా మారుతుంది.

కాయకల్ప యోగ భంగిమ దశలు మరియు ఉపయోగాలు

కాయకల్ప యోగ విధానం అనేది యోగ ప్రక్రియలో అత్యంత ప్రశంసనీయమైనది, జీవన శక్తిని మెరుగుపర్చడానికి ఈ యోగ విధానంను అభ్యసించడం జరుగుతుంది. కాయకల్ప యోగ భంగిమల ప్రాథమిక లక్ష్యం- శరీర విధానాన్ని గాడిలో పెట్టడం, సహజంగానే వృద్దాప్య ప్రక్రియను మందగింపచేసి, జీవిత కాలాన్ని పెంచుతుంది. యోగ అనేది భౌతిక జీవితం మరియు స్మారక స్థితితో కూడుకొని ఉంటుంది. కాయకల్ప యోగ విధానంను సాధన చేయడం ద్వారా లైంగిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిలోకి రూపాంతరం చెందించవచ్చు. కాయకల్ప యోగ విధానం యొక్క నియమావళి కాయకల్ప యోగ, నరాలు సరైన విధంగా పని చేయడానికి మరియు శరీర కేంద్ర నాడీ వ్యవస్థని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. యోగ పద్దతిలో "క్రౌన్ చర్కా" అనే ఆసనం వుంటుంది, దీనిని నుదుటి మధ్య భాగంలో ఉంచుతారు అది శక్తి ప్రవాహంపై ప్రభావం చూపుతుంది. ఈ సాధనను ఆచరించడం వలన మనం ఆరోగ్యకరమైన శరీరంతో పాటు ప్రశాంతమైన మనస్సు కలిగి ఉండేలా ప్రోత్సహిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, కాయకల్ప నియమావళి వలన సాధకుడు శరీర దారుడ్యం మరియు ఆధ్యాత్మికంగా కూడా సంతృప్తి పొందేలా చేస్తుంది. కాయకల్ప యోగ భంగిమల అనుసరణ     కాయకల్ప యోగ శ్వాససంబంధిత వ్యాయామాలత...

నిద్రలేచిన వెంటనే చేయాల్సిన 5 యోగాసనాలు

ఈ ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యం మీద అవగాహన, బాధ్యత కలిగి ఉండాలి. ఆరోగ్యంగా ఉండటానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. అందుకు యోగా బాగా సహాయపడుతుంది. యోగా చేయాలంటే బద్దకిస్తున్నారా? అయితే మీకు సహాయం చేయడానికి మేమున్నాం.  ప్రతి రోజూ ఉదయం యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని, చాలా మందికి తెలుసు, అయితే ఎంత మంది ఈ పద్దతిని అనుసరిస్తున్నారు? ఖచ్చితంగా ఏ కొద్ది మాత్రమే రోజూ యోగను సాధన చేస్తుంటారు.  మరికొద్దిమంది, యోగ మొదలు పెడతారు ఒక నెలలో, రెండు నెలలో ప్రాక్టీస్ చేసి, ఆపేస్తుంటారు. ఆ తర్వాత ఐదు, ఆరు నెలలు బ్రేక్ తీసుకుని, తిరిగి ప్రారంభిస్తుంటారు. రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే పరగడపుతో యోగాను ప్రాక్టీస్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. రోజూ యోగ సాధన చేయడం వల్ల శరరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. యోగ అనేది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు, దీని వల్ల ఆస్త్మా, వెన్నునొప్పి, ఇతర శ్వాస సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు. నిద్రలేచిన వెంటనే చేయాల్సిన కొన్ని యోగాసనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 1.లార్డ్ ఆఫ్ డ్యాన్స్ ఫోజ్ (నటరాజ ఆసనం):  నటరాజాసన (నట-డ్యాన్స్, రాజ-కింగ్, ఆసన-భంగిమ)...