Skip to main content

Posts

Showing posts from February, 2018

హార్మోన్ల బ్యాలెన్సింగ్ కొరకు యోగా భంగిమలు

మీరు సంతులన హార్మోన్ల కొరకు యోగాలో ఏ భంగిమలు ఉపయోగించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా! యోగాలో హార్మోన్ల సమతుల్యత కొరకు చాలా భంగిమలు ఉన్నాయి. స్త్రీలు మరియు పురుషులు ఇద్దరూ కూడా ఈ హార్మోన్ల సమతుల్యత భంగిమలు చేసి లాభం పొందవొచ్చు. ఏదేమైనా, కొత్తగా అయిన తల్లులు, పోస్ట్ కాన్పు మాంద్యం లక్షణాల నుండి ఉపశమనానికి ముఖ్యంగా ఉపయోగించే ఈ భంగిమలను తెలుసుకోండి. ఎండోక్రైన్ వ్యవస్థ మానవ శరీరంను క్రమబద్దీకరిస్తుంది. ఈ సంక్లిష్టమైన నెట్వర్క్, ఒక శక్తివంతమైన వ్యక్తి అనుభూతి చెందే పెరుగుదల మరియు అభివృద్ధిని శరీరం లోపల నియంత్రించే ఇతర వ్యవస్థలు "చర్చలు" జరుపుతుంది. హార్మోన్లు ప్రత్యేక రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి, నిల్వ చేస్తాయి మరియు శరీరం అవయవాల లోపల మరియు గ్రంధులచే పంపిణీ చేయబడతాయి. ఎండోక్రైన్ వ్యవస్థ ఈ విధానాన్ని నియంత్రిస్తుంది. యోగా భంగిమలు చేయటం వలన కొన్ని గ్రంథులు మరియు అవయవాలను ప్రేరేపించడానికి మరియు యాక్టివేట్ అవటానికి సహాయపడతాయని కొంతమంది ప్రజలు నమ్ముతారు మరియు ఈ సాధన హార్మోన్ల సమతుల్యత మరియు స్థిరమైన ఉత్పత్తి మరియు పంపిణీకి సహాయపడుతుంది. బ్యాలెన్సింగ్ హార్మోన్లకు ఉత్తమ యోగా భంగి...

యోగ చేయడానికి కండిషన్స్... ఏంటవి?, తమాషా కాదు...

యోగసనాలు ఎవరుబడితే వారు వేయకూడదు. యోగసనాలు వేసేవారు పాటించాల్సిన అంశాలు కొన్ని వున్నాయి. అవి ఆసనాలకు కేటాయించే సమయం. తర్వాత ప్రాణాయామం, ధ్యానంకు నిర్దేశించుకున్న సమయం. ఇందుకు సంబంధించి ప్రతి రోజు యోగకు గంట సమయం కేటాయించాలి. దానిలో అరగంట ఆసనాలకు, పది నిమిషాలు ప్రాణాయామం, ఇరవై నిమిషాలు ధ్యానంకు కేటాయించుకుంటే మంచి ఫలితం వస్తుంది.    ఆసనాలు వేస్తున్నామని ఇప్పటికే వాడుతున్న మందులు, వైద్యులను సంప్రదించటాన్ని మాత్రం మానకూడదు. తర్వాత ఆసనాలు వేసే విషయంలో ఏ ఇబ్బంది వచ్చినా దగ్గరిలోని యోగ మాష్టారును సంప్రదించి ఆసనాలను సరిగా వేస్తున్నారో లేదో నిర్ధారించుకోవాలి. ఆసనాలు వేసే ముందు కొన్ని అంశాలను పాటించాల్సివుంది. * ఎనిమిది నుంచి 60 సంవత్సరాల వాళ్లు మాత్రమే యోగ చేయాలి. * తెల్లవారు జామునే లేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి. * ఆసనాలు వేసే ముందుగా గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. * తెల్లవారు జామునే ఆసనాలు వేయాలి. ఆ సమయంలో గాలిలో ప్రాణశక్తి ఎక్కువగా వుంటుంది. గాలి బాగా వచ్చే ప్రదేశం చూసుకుని వేయాలి. * శబ్దాలు, గోలలు లేకుండా వుండే ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. * పలుచటి బట్ట నేలపై పరిచి పద్మ...

తలనొప్పి తగ్గించుకోవడానికి యోగ!

సహజంగా తలనొప్పి వచ్చినా...కడుపునొప్పి వచ్చినా...ఆస్పత్రుల చుట్టూ తిరిగి వేలు,లక్షలు వదిలించుకుంటున్న మన అజ్ఞానానికి మనమే సిగ్గుపడాలి. యోగశాస్త్రంలో ఏ ఆసనం వేస్తే ఏ రోగం తగ్గించుకోవచ్చో కూడా వివరంగా ఉంది. మన జీవిత కాలంలో ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరూ తలనొప్పిని ఎదుర్కొని ఉంటారు. తలనొప్పి తగ్గించుకోవడానికి వివిధ రకాల హోం రెమెడీస్, వివిధరకాల పిల్స్ ను ప్రయత్నించి ఉంటారు.  ఇవన్నీ కేవలం తాత్కాలిక ఉపశమనాలు కలిగించేవే. ఎప్పుడైతే తలనొప్పిని తగ్గించుకోవడంలో విఫలం అవుతారో అప్పుడు 90శాతం తలనొప్పి తిరిగి బాధిస్తుంది. కాబట్టి తలనొప్పికి అసలు కారణం ఏంటో తెలుసుకుని, దాని ప్రకారం తలనొప్పిని తగ్గించుకోవాలి. తలనొప్పి తగ్గించుకోవడానికి యోగ కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. ఆమెకు 67 ఏళ్ళు, ఇప్పటి వరకూ..తన జీవిత కాలంలో ఆమె ఒక్క రోజు కూడా తలనొప్పితో బాధపడింది లేదు. ఆమె ఎవరంటే? Dr. విజయలక్ష్మీ బాలేకుండ్రి, ఈమె బెంగళూర్ లో పీడ్రియాటిక్ కార్డియాలజిస్ట్. ఆమె ఆరోగ్యంగా ఉండటానికి సీక్రెట్ యోగానే అంటుంది. ఆమె తన చిన్న నాటి నుండి యోగాను ప్రాక్టీస్ చేస్తున్నట్లు వెల్లడించింది. అదే తన జీవితంలో తలనొప్పి అనే మాట లేక...

నిద్రలేచిన వెంటనే చేయాల్సిన 5 యోగాసనాలు

ఈ ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యం మీద అవగాహన, బాధ్యత కలిగి ఉండాలి. ఆరోగ్యంగా ఉండటానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. అందుకు యోగా బాగా సహాయపడుతుంది. యోగా చేయాలంటే బద్దకిస్తున్నారా? అయితే మీకు సహాయం చేయడానికి మేమున్నాం.  ప్రతి రోజూ ఉదయం యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని, చాలా మందికి తెలుసు, అయితే ఎంత మంది ఈ పద్దతిని అనుసరిస్తున్నారు? ఖచ్చితంగా ఏ కొద్ది మాత్రమే రోజూ యోగను సాధన చేస్తుంటారు.  మరికొద్దిమంది, యోగ మొదలు పెడతారు ఒక నెలలో, రెండు నెలలో ప్రాక్టీస్ చేసి, ఆపేస్తుంటారు. ఆ తర్వాత ఐదు, ఆరు నెలలు బ్రేక్ తీసుకుని, తిరిగి ప్రారంభిస్తుంటారు. రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే పరగడపుతో యోగాను ప్రాక్టీస్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. రోజూ యోగ సాధన చేయడం వల్ల శరరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. యోగ అనేది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు, దీని వల్ల ఆస్త్మా, వెన్నునొప్పి, ఇతర శ్వాస సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు. నిద్రలేచిన వెంటనే చేయాల్సిన కొన్ని యోగాసనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 1.లార్డ్ ఆఫ్ డ్యాన్స్ ఫోజ్ (నటరాజ ఆసనం):  నటరాజాసన (నట-డ్యాన్స్, రాజ-కింగ్, ఆసన-భంగిమ)...

మెడ భుజాలకు వ్యాయామం.. ఆకర్ణ ధనురాసనం

సాధారణంగా ఆఫీసుల్లో పని చేసేవారు కొన్ని గంటలపాటు ఒకే స్థితిలో కూర్చుని పని చేస్తుంటారు. ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసేవారికి మెడ భుజాల్లో కండరాలు పట్టేయటం, నొప్పులు లాంటి సమస్యలు ఉంటాయి. మెడ భుజాలకు సంబంధించిన బాధలు తరచుగా వస్తుంటాయి. ఈ భాగాలు విపరీతమైన ఒత్తిడికి గురవుతాయి. క్రమంతప్పకుండా వీటికి ఉపశాంతినిచ్చే ఆసనాలు, వ్యాయామం సాధన చేస్తుంటే దీర్ఘకాలిక సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు. అలాంటిదే ఈ ఆకర్ణ ధనురాసనం. రెండుకాళ్లూ దగ్గరగా ఉంచి నిటారుగా నిలబడాలి. చేతులను భుజాల నుండి పక్కలకు చాపాలి. కుడికాలిని ఒక అడుగు ముందుకు వేయాలి. ఇప్పుడు చేతులను ముందుకు తీసుకువచ్చి కళ్లకు సమాంతరంగా ఉంచాలి. చేతుల పిడికిళ్లు బిగించి ఉంచాలి. తలని కుడికాలి వైపు తిప్పి ఉంచాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ… బాణాన్ని లాగుతూ చేతిని వెనక్కు తీసుకుని వెళ్లినట్టుగా… ఎడమచేతిని వెనక్కు తీసుకుని వెళ్లి పిడికిలి చెవి దగ్గరకు వచ్చేలా ఉంచాలి. తలను కాస్త వెనక్కు వంచి కుడిచేతిని చూస్తున్నట్టుగా ఉంచాలి. ఇప్పుడు శ్వాసని వదులుతూ సాధారణ స్థితికి రావాలి. ఇలాగే చేతులను మార్చి చేయాలి. ఈ ఆసనాన్ని తరచూ వేయడం వల్ల మెడ భుజాలకు వ్యాయామం కలుగుత...

టెన్షన్, మెడనొప్పి, భుజాలనొప్పితగ్గించే మత్స్యాసనం

మత్స్యాసనం. మత్స్య అంటే చేప మరియు ఆసన అంటే భంగిమ. దీన్నే మత్స్యాసనం అంటారు. ఈ పదాన్ని శాన్ స్రిట్ నుండి గ్రహించబడినది .  మత్స్యాసనమని ఎందుకు పిలిచారంటే , నీటిలో చేప ఎలా ఉంటుందో , ఆ భంగిమలో యోగాసనం చేయడం వల్ల మత్స్యాసనం అని పిలుస్తారు. నీటిలో చేపలు వలే శరీరం తేలియాడుటకు సహాయపడుతుంది. ఈ మత్స్యాసనం శరీరం ఫ్లెక్సిబుల్ గా మరియు అంతర్గత బాగాలు స్పందించే విదంగా ...కండరాలు మరియు రిబ్స్ మద్య ఎక్కువ ప్రభావం చూపించే భంగిమ. మత్స్యాసనం టెన్షన్ మరియు స్ట్రెస్, స్ట్రెచెస్ మరియు గొంతు, భుజాలు మరియు మెడనొప్పిని నివారిస్తుంది. ప్రస్తుత రోజుల్లో , మోడ్రన్ లైఫ్ స్టైల్ వల్ల జీవన శైలిలో అనేక మార్పులు వల్ల మోనిటర్స్ గా, యంత్రాలుగా మారిపోయారు. నిత్యజీవితంలో బిజీగా యంత్రాలు పనిచేసినట్లు పనిచేస్తున్నారు. ఎక్కువ పనిగంటలు , ఆహారలోపం, కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల మెడనొప్పి మరియు భుజాల నొప్పితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ కొన్ని వందల సంఖ్యలో పెరిగిపోతున్నది. ఈ సమస్యను నివారించుకోవడానికి మత్స్యకోణాసనం వంటి భంగిమలు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మెడ, భుజాల నొప్పి నుండి ఉపశమనం కలిగిస్...

2 వారాల్లో కింద శరీరపు కొవ్వును తగ్గించుకునే 8 విధానాలు

మనందరికీ అందంగా కన్పించే వంపులు తిరిగిన శరీరం కావాలని, దానికి ప్రశంసలు వచ్చి మనం మరింత ఆత్మవిశ్వాసంతో ఉండాలని అన్పిస్తుంది. కానీ శరీరంలో అవసరంలేని చోట కొవ్వు చేరటం వలన మనకి నచ్చని రూపాన్ని ఎదుర్కోవాలసి వస్తుంది.  కింది భాగపు శరీరంలో కొవ్వును తగ్గించుకోవటం చాలామంది స్త్రీలకు చాలా కష్టమైన విషయం. కింద శరీరంలో కొవ్వును వదిలించుకునే పద్ధతిని పాటించడానికి చాలా కష్టంగా ఉండి, పట్టుదల, ఓర్పు అవసరం. వ్యాయామం, డైట్ సరిగ్గా కలిపి చేయటం మరియు ఇతర జీవన విధాన కారణాలను చెక్ చేసుకుంటూ ఉండటం వలన కొవ్వు వేగంగా కరగటంలో సాయపడటానికి, దీర్ఘకాలికంగా ఉపయోగపడతాయి. 1.కార్డియో  అనవసర కొవ్వును వదిలించుకోటానికి కార్డియో వ్యాయామం చాలా ప్రభావవంతమైనది. ప్రతిరోజూ చేసే వ్యాయామ రొటీన్ ఈ కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. కార్డియో వ్యాయామం తొడలు మరియు పిరుదుల నుంచే కాక, శరీరం మొత్తంలో కొవ్వును కరిగించటంలో సాయపడుతుంది. 2.గుంజీలు మరియు లంజెస్   కింద శరీరపు కొవ్వును కరిగించటానికి గొంతుకు కూర్చునే స్క్వాట్లు మరియు లంజెస్ చాలా ఉపయోగకరం. స్క్వాట్లు కాళ్ళ కండరాలపై పనిచేస్తాయి.లంజెస్ మరియు ...

సహజంగా రక్తపోటును తగ్గించడానికి 7 యోగ ఆసనాలు

హైపర్ టెన్షన్ మానవ శరీర ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావం చూపుతుంది. కాబట్టి హైపర్ టెన్షన్ ను ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. హార్ట్ స్ట్రోక్ మరియు హార్ట్ అటాక్ ను ప్రమాధాన్ని తగ్గించుకోవాలంటే, మనం తీసుకొనే రెగ్యులర్ డైట్ లో హైపర్ టెన్షన్ తగ్గించే ఆహారాలను చేర్చుకోవాలి. హైపర్ టెన్షన్ మరియు హైబ్లడ్ ప్రెజర్ కొన్ని తీవ్రమైన పరిస్థితుల కారణం వల్ల ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా ఊబకాయం, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యం సేవించడం, వ్యాయామం చేయకపోవడం, బర్త్ కంట్రోల్ పిల్స్, పెయిన్ కిల్లర్స్, కిడ్నీ సమస్యలు మరియు అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ మరియు హైబ్లడ్ ప్రెజర్ కు గురికావల్సి ఉంటుంది. ఇంకా హైపర్ టెన్షన్ వల్ల, కిడ్నీ, మెమరీ పవర్ మరియు సెక్స్ డ్రైవ్ మీద తీవ్రప్రభావం చూపుతుంది. ఆధునిక యుగంలో అధిక రక్తపోటు అనేది నిశ్శబ్ద కిల్లర్స్ లలో ఒకటిగా మారింది. కాబట్టి మీకు అధిక రక్తపోటు ఉంటే, దానికి చెక్ పెట్టటానికి యోగ ఆసనాలను ప్రయత్నించండి. పశ్చిమోత్తాసన:   రక్తపోటుతో బాధ పడుతున్న వారిలో ధమనులు అణచివేయబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది క్రమంగా గుండెపోటు మరియు స్ట్రోక్ కు దారితీస్తుంది....

శలభాసనంతో మధుమేహం నియంత్రణ

శలభాసనం తామర స్థితి తెలుపుతుంది. ఇది పశ్చమోత్తనాసనానికి, హలాసనానికి వ్యతిరేక స్థితిలో ఉంటుంది. దీనివలన శరీరానికి ప్రయోజనాలు చేకూరుతాయి. అర్ధ శలభాసనం వేయడానికి మొదట నేలపై పడుకోవాలి. ఉదరం, ఛాతీ,చుబకం నేలను తాకుతూ ఉండాలి. భుజాలు చదునుగా పరచాలి. వేళ్ళను నేలపై ఉంచాలి. పిడికిలి బిగించి పైకి తీసుకు రావాలి. మెల్లగా గాలి పీల్చకుని 10 సెకనులు బిగపట్టాలి. పూర్తిగా గాలి పీల్చకుంటే కాళ్ళు ఎత్తడానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి పూర్తిగా గాలి పీల్చుకోరాదు. ఊపిరి వదలడం మొదలు పెట్టాలి. గాలి పీల్చుతూనే ఆసనాన్ని పూర్తిచేయాలి. నిశ్చ్వాసమనేది కాళ్ళు నేలను చేరేటప్పటికి పూర్తి కావాలి. శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి చేతులు లేదా అరచేయి లేదా పిడికిలి వినియోగించాలి. పిడికిలిని కేవలం అనుభవజ్ఞులు మాత్రమే వినియోగించాలి. మెల్లగా కాళ్ళ వీలైనంత ఎత్తుకు తీసుకురావాలి. నాభి వరకు ఉన్న శరీరభాగం నేలను తాకి ఉండాలి. అది కదలకూడదు. మొండెం చక్కగా ఉండాలి. కాళ్ళు లేపడానికి కేవలం నాభి కింది భాగంలో ఉన్న ప్రాంతాన్ని మాత్రమే వినియోగించాలి. ఉదరం, ఛాతీ, చేతులు, చుబుకం ఖచ్చితంగా ఆసనంలో ఉన్నంతసేపు నేలను తాకే ఉండాలి. కాళ్ళు ఎత్తిన స్థానంల...

కొవ్వును కరిగించి కండరాల దృఢత్వాన్ని పెంచాలనుకుంటే... ఈ పాయింట్లు...

 కొవ్వుని కరిగించి కండరాల దృఢత్వాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా... అయితే ఇలా వ్యాయామం చేసి చూడండి. 1. శరీరానికి కావలసినంత నీరు అందకపోతే కణాలు ముడుచుకుపోతాయి. దానితో కండరాలు బిగుతుగా మారి మీరు త్వరగా అలసిపోతారు. కాబట్టి శరీరానికి సరిపడా నీరు తీసుకోవాలి. అప్పుడే మీ కండరాలు దృఢంగా ఉంటాయి. 2. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ వ్యాయామాలు చేయడానికి ప్రయత్నించండి. ఇలా రెండు వేరువేరు వ్యాయామాలు ఒకేసారి చేయడం వల్ల కండరాలు బలపడతాయి. ఉదాహరణకు జంపింగ్, పుల్ అప్స్ కలిపి చేయండి. హృదయ కండరాలకు బలం చేకూరుతుంది. 3. ఈత, సైక్లింగ్, పరుగు లాంటివి క్రమంతప్పకుండా చేయడం వల్ల కొవ్వు కరిగి కండరాలు దృఢంగా తయారవుతాయి. అయితే వీటిని క్రమంగా పెంచుతూ సమయాన్ని కూడా పొడిగించుకుంటూ వెళితే మీ ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడంతో పాటు గుండె కండరాలు బలపడతాయి. 4. అదే పనిగా వ్యాయామాలు చేయడం వల్ల శరీరం అలిసిపోతుంది. అది కోలుకుని తిరిగి శక్తి పుంజుకోవాలంటే శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం. కాబట్టి ప్రతిరోజు దాదాపు ఎనిమిది గంటలు హాయిగా నిద్రపోవాలి. వారంలో ఒకసారి వ్యాయామాలకు స్వస్తి చెప్పాలి. ఇలా చేయడం వల్ల మరుసటి వారం అంతా మీరు నూతన...

దృష్టి లోపం కలిగినవారు యోగా చేయండి

భారతదేశంలో దాదాపు 6 కోట్ల మంది దృష్టిలోపంతో బాధపడుతున్నారు. ఇది అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకుకూడా చాలెంజ్‌గా మారింది. దృష్టి లోపంతో భాధపడేవారు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. అలాగే వారు శారీరకంగాకూడా పరిశుభ్రతను పాటించాలి. ఇలాంటి వారు ఆటపాటలలో, పరుగుపందేలలో పాల్గొనలేక పోతుంటారు. కాబట్టి ఇలాంటివారు యోగాసనాలు చేస్తే ఆరోగ్యంగానే కాకుండా మానసికంగాకూడా దృఢంగానే ఉంటారని యోగా నిపుణులు అంటున్నారు. దృష్టిలోపంతో బాధపడేవారికి యోగాసనాలు చేయడం ఏమంత కఠినం కాదు. యోగాసనాలు చేస్తే వారికి చాలా లాభాలుంటాయి. దాదాపుగా దృష్టిలోపంతో బాధపడేవారు తమ పనులను చాలావరకు మనోయోగంతో చేస్తుంటారు. దీంతో యోగాసనాలు ప్రారంభించిన రెండు-మూడు రోజులలోనే వారిలో నూతనోత్తేజం పుట్టుకొస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రాణాయామం, ధ్యానం వారికి సహజసిద్ధంగానే అలవడుతాయంటున్నారు. దృష్టిలోపంతో బాధపడేవారికి ఎలాంటి ఆసనాన్నైనా చేసి చూపాల్సిన అవసరంలేదు. దీనికి బ్రెయిలీ లిపిలో చిత్రాలతోబాటు అక్షర రూపంకూడా ఇచ్చి ఉన్నారు. ఇది వారికి ఎంతో ఉపయోగపడుతుంది. దృష్టిలోపంతో బాధపడేవారు ఈత కొట్టడం, పరుగులు పెట్టడం, నడవడంలాంటి వ్యాయామాలు చేయలేరు...

నీరసం, అలసట రాకుండా ఉండాలా? ఈ యోగాసనాలు ట్రై చేయండి...

మీరు కొద్దిపాటి దూరం నడిస్తేనే ఆయాసపడుతున్నారా? లేదా ఆఫిసులో ఒక గంట రెండు గంటల పని చేసిన తర్వాత బాగా అలసిపోయినట్టు అనిపిస్తొందా? అందుకు కారణం మీ శరీరంలొ సత్తువ లేకపోవడం కావచ్చు.  మీకు ముందు చెప్పినట్టు ఏమైనా అనిపిస్తుంటే అందుకు చక్కగా పనిచేసే పరిష్కారం గురించి చదవండి. శ్వాస మరియు మైగ్రైన్ వంటి సమస్యలకు చికిత్సగా యోగాసనాలు బాగా పని చెస్తాయని మీరు విని మరియు చదివే ఉంటారు. అంతే కాకుండ మన శరీరంలొ సత్తువ పెరిగి తద్వారా త్వరగా అలసిపోకుండ ఉండడానికి కొన్ని ప్రత్యెకమైన యోగాసనాలు ఉన్నాయి.  ఈ రోజు మనం బడలిక మరియు అలసట రాకుండా ఎలాంటి యోగాసనాలు చేయాలొ చూద్దాం. అసలు ఎవరైనా ఎందుకు అలసిపోతారు? మన శరీరంలో అక్సిజన్ తగ్గిపోయినప్పుడు, మన అవయవాలు మరియు శరీర భాగాలు సరిగా పని చేయలేవు. ఇలా సరిగా పని చెయనప్పుడే మనకు అలసటగా, బడలికగా అనిపిస్తుంది. ప్రాచీన కాలం నుండి ఇలాంటి శరీర పరిస్థితులను నయం చేయడానికి యోగాసనాలను చికిత్సగా వాడుతున్నారు. అలాంటి అలసట, బడలిక ని నయం చేసే కొన్ని యోగాసనాల జాబితా మీకోసం చదవండి. 1. శేతుభంధాసనం ( బ్రిడ్జ్ పోజ్ )   క్రమ పద్ధతిలో శేతుభంధాసనం చేసే విధానం: ...