మత్స్యాసనమని ఎందుకు పిలిచారంటే , నీటిలో చేప ఎలా ఉంటుందో , ఆ భంగిమలో యోగాసనం చేయడం వల్ల మత్స్యాసనం అని పిలుస్తారు. నీటిలో చేపలు వలే శరీరం తేలియాడుటకు సహాయపడుతుంది.
ఈ మత్స్యాసనం శరీరం ఫ్లెక్సిబుల్ గా మరియు అంతర్గత బాగాలు స్పందించే విదంగా ...కండరాలు మరియు రిబ్స్ మద్య ఎక్కువ ప్రభావం చూపించే భంగిమ. మత్స్యాసనం టెన్షన్ మరియు స్ట్రెస్, స్ట్రెచెస్ మరియు గొంతు, భుజాలు మరియు మెడనొప్పిని నివారిస్తుంది.
ప్రస్తుత రోజుల్లో , మోడ్రన్ లైఫ్ స్టైల్ వల్ల జీవన శైలిలో అనేక మార్పులు వల్ల మోనిటర్స్ గా, యంత్రాలుగా మారిపోయారు. నిత్యజీవితంలో బిజీగా యంత్రాలు పనిచేసినట్లు పనిచేస్తున్నారు. ఎక్కువ పనిగంటలు , ఆహారలోపం, కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల మెడనొప్పి మరియు భుజాల నొప్పితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ కొన్ని వందల సంఖ్యలో పెరిగిపోతున్నది.
ఈ సమస్యను నివారించుకోవడానికి మత్స్యకోణాసనం వంటి భంగిమలు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మెడ, భుజాల నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది., . అంతే కాదు శరీరలో ఇతర కండరాల నొప్పులను కూడా నయం చేస్తుంది .
మత్స్యాసనం ఏవిధంగా ఏయాలి. ఆ ఆసనం వల్ల ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...
మత్స్యాసనం వేసే పద్దతి:
1. ఫ్లోర్ మ్యాట్ మీద లేదా యోగా మ్యాట్ మీద వెల్లకిలా పడుకోవాలి. పాదాలను రెండూ జతగా చేర్చి శరీరం మరియు చేతులు రిలాక్స్ గా ఉంచాలి.
2. ఇప్పుడు రెండు చెయ్యిలను మెల్లిగా ముందుకు తీసుకుని, హిప్స్ క్రింది బాగం అరచేతితో పట్టుకోవాలి. మోచేతులను దగ్గరగా చేర్చాలి.రెండు చేతులను చాలా దగ్గర చేర్చాలి . తర్వాత మెల్లగా తొడలను మరియు కాళ్ళను ముందుకు మడవాలి. ఫ్లోర్ పొజీషన్ లో కూర్చున్నట్లు చేయాలి.
4. సాధ్యమైనంత వరకూతలను వెనుకకు స్ట్రెచ్ చేయాలి. దాంతో క్రోన్ పొజీషన్ ఫ్లోర్ టచ్ చేస్తుంది. ఛాతీభాగం పైకి లేపవచ్చు.
5. అలాగే చేతులు వెనకవైపుకు ఎంత సాధ్యమైతే అంత మూవ్ చేస్తూ, మెడను స్ట్రెచ్ చేయాలి. మోచేతులు పూర్తిగా ఫ్లోర్ మీద ఉండాలి . దాంతో శరీరం బ్యాలెన్స్ తప్పదు, అలాగే శరీరం యొక్క మాస్ వెయిట్ మోచేతుల మీద పడుతుంది, తల బరువు తేలికవుతుంది, పొట్టఉదరం క్రింది పెట్టి, చాతీ పైకి లేపాలి . తొడల వరకూ కాళ్లను ఫోల్డ్ చేయాలి.
6. ఈ మత్య్యకోణాసనంను సాధ్యమైనన్ని సార్లు చేస్తుండాలి. చేసేటప్పుడు శ్వాసలోతుగా పీల్చి వదలాలి . మెడను మరీ ఎక్కువగా స్ట్రెచ్ చేయకూడదు. నార్మల్ పొజీషన్ లో రిలాక్స్ చేయాలి.
7. తర్వాత సహజంగానే నెమ్మదిగా నార్మల్ పొజీషన్ కు రావాలి. . చాతీ క్రిందికి దింపాలి, నిధానంగా పడుకోవాలి. చేతులు, కాళ్ళు నార్మల్ పొజీషన్ కు తీసుకొచ్చి రిలాక్స్ అవ్వాలి.
మత్స్యకోణాసనం వల్ల ప్రయోజనాలు:
మెడ మరియు భుజాలు స్ట్రెచ్ చేయడానికి సహాయపడుతుంది మెడ మరియు భుజాల మీద ఒత్తిడి, టెన్షన్ తగ్గిస్తుంది.
శ్వాససంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
లోతుగా శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది.
సూచన:
హై లేదా లోబ్లడ్ ప్రెజర్ ఉన్నవారు ఈ భంగిమ వేయకూడదు .
ఇంకా మైగ్రేక్ తో బాధపడే వారు కూడా ఈ ఆసనంకు దూరంగా ఉండాలి.
లోయర్ బ్యాక్ పెయిన్ లేదా రీసెంట్ గా ఏదానా సర్జరీలు జరిగిన వారు కూడా ఆ ఆసనం వేయకూడదు . సర్జీలు చేసుకున్నవారు ఈ ఆసనంకు పూర్తిగా దూరంగా ఉండాలి
Comments
Post a Comment