ఆసనాల ద్వారా జుట్టు రాలటం తగ్గటం ఏంటి అని ఆలోచిస్తున్నారా! ఇక్కడ తెలిపిన ఆసనాల ద్వారా జుట్టు రాలే ప్రక్రియ తగ్గుతుంది అని ప్రయోగ పుర్వకంగా నిరూపించబడింది. జుట్టు దువ్వె సమయంలో, కేశాలు ఎక్కువ రాలినట్లయితే, నిరాశకు లేదా చిరాకులకు గురవుతుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు జుట్టును దువ్వెనతో దూసిన ప్రతి సారి, జుట్టు రాలటం లేదా తెగిపోవటం వలన చాలా నిరాశకు గురవుతుంటారు. ఒత్తిడి, హార్మోన్'ల అసమతుల్యతలు, అనారోగ్యకర ఆహార స్వీకరణ, వ్యాధులు, జుట్టు రంగువేయటం, మందులు, జన్యుపర లోపాలు, పొగత్రాగటం, ఇలాంటి కారణాల వలన జుట్టు రాలుతుంటుంది. అంతేకాకుండా, జుట్టుకు వాడే కండిషనర్ మీ పూర్తి ఆరోగ్యాన్ని ప్రభావిత పరుస్తుంది. యోగాసనాలను చేయటం వలన మీ జుట్టు ఆరోగ్యం మెరుగుపడటమే, కాకుండా జుట్టు రాలటం కూడా తగ్గుతుంది. యోగాలను రోజు చేయటం వలన మానసికంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. యోగా వలన సులభంగా జుట్టు సమస్యలనుండి ఉపశమనం పొందవచ్చు. జుట్టు రాఉతను తగ్గించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే యోగా ఆసనాల గురించి కింద తెలుపబడింది. బాలయమా యోగా (గోళ్ళను రాయటం) బాలయమా యోగాను చేయటం వలన జుట్టు రాలటం తగ్గటమే కాకుండా చుండ్రూ, జుట్టు నె...