యోగా అనేది ప్రపంచమంతా కూడా ఏ దేశంవారైనప్పటికి చేయటానికి ఇష్టపడతారు.
యోగాసనాలను కూడా ఒక వ్యాయామంగానే చేయవచ్చు. సాధారణ వ్యక్తులేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు యోగా ఆచరించేందుకు ఇష్టపడతారు. మీ శరీరాన్ని, మైండ్ మరియు ఆత్మను రిలాక్స్ చేయాలంటే ఇది ఒక మంచి సాధనం. బరువు తగ్గాలనుకుంటూ, మరింత ఆహ్లాదంగా భావించాలనుకునేవారు పవర్ యోగా కూడా చేయవచ్చు. పవర్ యోగా కు సాంప్రదాయ యోగా కు కొద్ది వ్యత్యాసం ఉంటుంది. దీనిలో మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. మీరు చేయవలసిందల్లా ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ప్రయత్నాలు పెడితే చాలు చక్కని ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. మరి పవర్ యోగా ఆరోగ్య ప్రయోజనాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం.
బరువు తగ్గటం -
పవర్ యోగాలో కేలరీలు బాగా ఖర్చవుతాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఎంతో తేలికైనది మరియు సమర్ధవంతమైనది. మీ శరీరంలోని అధిక బరువు కరిగిపోవాలంటే, పవర్ యోగా ఆచరించండి. దీనిని మీరు ఇంటి వద్దే చేయవచ్చు. లేదా యోగా తరగతులలో చేరి కూడా ఆచరించవచ్చు.
పవర్ యోగాతో ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీకు చేకూరుతాయి. రోజూ చేస్తే, మరింత ఫిట్ గా చురుకుగా ఉంటారు. నిద్ర సరిగా పట్టని వారికి యోగాతో చక్కటి నిద్ర పట్టి మరుసటి రోజు హాయిగా ఉంటుంది. కనుక పవర్ యోగా తప్పక ఆచరించండి.
యోగాసనాలను కూడా ఒక వ్యాయామంగానే చేయవచ్చు. సాధారణ వ్యక్తులేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు యోగా ఆచరించేందుకు ఇష్టపడతారు. మీ శరీరాన్ని, మైండ్ మరియు ఆత్మను రిలాక్స్ చేయాలంటే ఇది ఒక మంచి సాధనం. బరువు తగ్గాలనుకుంటూ, మరింత ఆహ్లాదంగా భావించాలనుకునేవారు పవర్ యోగా కూడా చేయవచ్చు. పవర్ యోగా కు సాంప్రదాయ యోగా కు కొద్ది వ్యత్యాసం ఉంటుంది. దీనిలో మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. మీరు చేయవలసిందల్లా ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ప్రయత్నాలు పెడితే చాలు చక్కని ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. మరి పవర్ యోగా ఆరోగ్య ప్రయోజనాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం.
బరువు తగ్గటం -
పవర్ యోగాలో కేలరీలు బాగా ఖర్చవుతాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది ఎంతో తేలికైనది మరియు సమర్ధవంతమైనది. మీ శరీరంలోని అధిక బరువు కరిగిపోవాలంటే, పవర్ యోగా ఆచరించండి. దీనిని మీరు ఇంటి వద్దే చేయవచ్చు. లేదా యోగా తరగతులలో చేరి కూడా ఆచరించవచ్చు.
శరీరం తేలికైపోతుంది -
పవర్ యోగా లో మీ శరీరంలోని అన్ని భాగాలు కదలిక చేయబడతాయి. మీ శరీరం దీనిలో చేసే ఆసనాలు అంటే, సాగతీయటం, వంగటం వంటి వాటితో ఎంతో తేలికవుతుంది. శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కరిగిపోతుంది.శరీర జీవక్రియ పెరుగుతుంది -
యోగా చేస్తే, శరీర మెటబాలిజం ఎంతో బాగుంటుంది. దీనికి కారణం పవర్ యోగా లో మన మైండ్ బాగా విశ్రాంతి పొంది మంచి ఆహ్లాదకరమైన భావనలు కలుగుతాయి. ఆ విధంగా మీరు శారీరకంగా, మానసికంగా ఎంతో చురుకుగా ఉంటారు.బ్లడ్ సర్కులేషన్ -
పవర్ యోగా లో మీకు బ్లడ్ సర్కులేషన్ బాగా పెరుగుతుంది. శరీర రక్తప్రసరణ పెరిగి వ్యాధులు దరికి చేరవు.రోగ నిరోధకత పెరుగుతుంది -
పవర్ యోగా రెగ్యులర్ గా సాధన చేస్తే, మీ శరీర రోగ నిరోధక వ్యవస్ధ మెరుగవుతుంది. అధిక ఆక్సిజన్ మీ శరీరంలోకి ప్రవేసిస్తుంది. ఇది మీ శరీరం తన జీర్ణ క్రియను మెరుగుపరచుకోటానికి, మలినాలను బయటకు వదిలేయటానికి పనికి వస్తుంది. దానితో జీర్ణక్రియ పెరిగి, మీ చర్మంలో మెరుపు కూడా ఏర్పడుతుంది.వ్యాధులు కూడా నయం చేసుకోవచ్చు-
మీకు కనుక కేన్సర్, ఆస్తమా, బ్రాంకైటిస్, సైనస్ లేదా నిద్రలేమి వంటివి ఇప్పటికే ఉంటే, పవర్ యోగాతో వీటిని సహజంగా నివారించుకోవచ్చు. రోగులైనప్పటికి మితంగా దీనిని ఆచరిస్తూ, తమ శరీరాన్ని మంచి ఆరోగ్యంలో ఉంచుకోవచ్చు.ఒత్తిడి, డిప్రెషన్ -
యోగాతో మీకు రోజులో వచ్చే ఒత్తిడి, మానసిక వేదన వంటివి తగ్గించుకోవచ్చు. పని ఒత్తిడి మీకు కోపం తెప్పిస్తూంటుంది. అటువంటపుడు ఇది బాగా పనిచేస్తుంది. జంటలమధ్య వివాదాలు రాకుండా వారు మనోవేదనకు గురికాకుండా ఉంటారు. అటువంటి మానసిక సమస్యలకు మీరు తప్పక యోగా ప్రయత్నించండి. సమస్యలు తగ్గటమే కాక, మానసిక, శారీరక విశ్రాంతి దొరుకుతుంది.పవర్ యోగాతో ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీకు చేకూరుతాయి. రోజూ చేస్తే, మరింత ఫిట్ గా చురుకుగా ఉంటారు. నిద్ర సరిగా పట్టని వారికి యోగాతో చక్కటి నిద్ర పట్టి మరుసటి రోజు హాయిగా ఉంటుంది. కనుక పవర్ యోగా తప్పక ఆచరించండి.
Comments
Post a Comment