హలాసనం వేయడం వల్ల... వెన్ను కండరాలు, వెన్నుపూసలు, క్రింది నడుము నరాలు సాగి శక్తివంతం అవుతాయి. అలాగే.. అజీర్ణం, మలబద్ధకం, కడుపుమంట లాంటివి తగ్గుతాయి. ఇక ఛాతీకి, మెడకు, మెదడుకు రక్తప్రసారం బాగా జరుగుతుంది. పొట్టలోని ప్రేగులు కండరాలు శక్తివంతం అవుతాయి.
హలాసనం ఎలా వేయాలంటే...?
ముందుగా... వెల్లికిలా పడుకోవాలి. ఆ తరువాత రెండు కాళ్లు కలిపి ఉంచాలి. అరచేతులు నడుము కింద ఉంచి మో చేతులు ఆధారంగా నడుముతో సహా భుజాలదాకా శరీరాన్ని నిటారుగా లేపి, మెల్లిగా తలవెనకకు వంచుతూ, పాదాలు నేలమీద ఆన్చాలి.
చేతులు రెండు వెనకకు చాచి పాదాలను పట్టుకోవాలి. అలాగే కొద్ది సెకన్లు నిలిపి, మెల్లిగా నుడుం కింద మోచేతులు ఆన్చి శరీరాన్ని నిటారు స్థితికి తేవాలి. ఆ తర్వాత నెమ్మదిగా క్రిందకి దింపి వెల్లకిలా యధాస్థితికి రావాలి.

Comments
Post a Comment