దైనందిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల మధ్య మానసిక ఒత్తిడితో ఇబ్బందిపడేవారికి యోగా ప్రశాంతతను చేకూరుస్తుంది. యోగా ఆసనాలలో ఎన్నెన్నో రకాలున్నాయి. వాటిలో ప్రస్తుతం మనం విరాసనము గూర్చి తెలుసుకుందాము.
కుడి మోకాలిని లేవనెత్తి కుడి పాదాన్ని నేలకు తాకించి, ఎడమ మోకాలి పక్కన ఉంచవలెను. కుడి మోచేతిని కుడి మోకాలు మీద పెట్టి కుడి అరచేతితో చూబుకాన్ని పట్టుకోవాలయును. కళ్ళు మూసుకుని రిలాక్స్‌గా ఉండవలెను. వెన్నెముక తల నిటారుగా ఉంచి దేహము చలన శరీరం కదలకుండా ఉంచవలెను. అదే విధముగా ఎడమ పాదం కుడి మోకాలి పక్కన ఉంచి ఇదే ప్రకారముగా తిరిగి చేయవలెను. ఈ ఆసనము కుడి ఎడమలు మార్చుతూ సుమారు రెండు నిముషముల సేపు చేయవలెను.
ఈ ఆసనం చేయడం వలన మనసులో సమతుల్యత ఏర్పడి ఏకాగ్రత చోటుచేసుకోగలదు. మానశిక ప్రశాంతత ఏర్పడడంతో పరిస్థితులపై అవగాహన పెరిగి భౌతిక, మానసిక సమతుల్యత ఏర్పడగలదు. సరైన రీతిలో ఆలోచించగలము. ఎప్పడూ ఆలోచిస్తూ ఉండేవారికి ఈ ఆసనము చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా మూత్ర పిండాలకు, కాలేయం, ఉధర భాగమునకు ప్రత్యుత్పత్తి అవయవములకు సంబంధించిన లోపాలను తొలగించి మంచిని చేకూర్చుతుంది.

Comments
Post a Comment