ప్రస్తుత సంక్లిష్ట జీవనవిధానంలో చాలామంది ఒత్తిడికి లోనవుతున్నారు. ఆదుర్దా, ఒత్తిడి అనేవి ప్రతి ఒక్కరిలోనూ వెలుగు చూస్తున్నాయి. అందువల్ల చాలామంది ఉద్యోగస్తులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా వీరిలో అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణమండల సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటువంటి సమస్యలతో బాధపడేవారికి యోగసనాలు చాలా ఉపకరిస్తాయంటున్నారు వైద్యులు. అందులో ముఖ్యమైనది ఉత్థాన పాదాసనం
ఒక చాపపై వెల్లకిలా పడుకోవాలి
పల్చటి తలగడపై తల ఆన్చాలి
కాళ్లను నిటారుగా నేలబారుగా చాచాలి
మొదట ఒక కాలిని ఎత్తి ఆ తర్వాత రెండో కాలినీ ఎత్తుతూ క్రమంగా రెండు కాళ్లనూ ఎత్తాలి.
ఇలా చేసినపుడు నడుము నేలకు తగులుతూ ఉండటంతోపాటు కాళ్లు నిటారుగా ఉండాలి
అరచేతులు నేలకు ఆనించాలి
ఈ స్థితిలో 10 సెకన్లపాటు మామూలు శ్వాసక్రియ జరపాలి.
నిశ్వాసక్రియ జరుపుతూ కాళ్లను నెమ్మదిగా నేలకు ఆన్చాలి.
యథాస్థితికి రావాలి.
అనుభవజ్ఞుల సలహాతో ఈ ప్రక్రియ 12సార్లు వరకూ చేయవచ్చు.
జీర్ణాశయంలోని ఆమ్లాధిక్యత తగ్గుతుంది.
పొత్తికడుపుకు సంబంధించిన రోగాలు నివారణ అవుతాయి.
మలబద్ధకం కూడా నివారించబడుతుంది.
ఉత్థాన పాదాసనం ఎలా వేయాలి:

ఉపయోగాలు:
జీర్ణాశయంలోని ఆమ్లాధిక్యత తగ్గుతుంది.
పొత్తికడుపుకు సంబంధించిన రోగాలు నివారణ అవుతాయి.
మలబద్ధకం కూడా నివారించబడుతుంది.
Comments
Post a Comment