ఊబకాయం అన్నది నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తోంది. మారిన జీవనశైలి, మారిన ఆహర అలవాట్లు అనేవి కొందరిలో ఈ ఊబకాయాన్ని కల్గిస్తున్నాయి. అలాగే మరికొందరిలో కొన్ని రకాల హార్మోన్ల ప్రభావం వల్ల, కొన్ని రకాల వ్యాధుల ప్రభావం వల్ల కూడా ఊబకాయం సమస్య వచ్చే అవకాశముంది.
అయితే దేహంలో కొవ్వు ఎక్కువగా నిల్వ ఉండడం వల్ల వచ్చే ఊబకాయం మాత్రం బాగా కంగారు కలిగించేదే. ఎందుకంటే ఈ సమస్య ఉన్నవారు ఆహార విషయంలో ఎంతగా జాగ్రత్తలు పాటించినా ఊబకాయాన్ని కంట్రోల్ చేయడం కష్టంగా మారుతుంది. అలాంటివారు ఈ ఊబకాయం సమస్య నుంచి బయటపడడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.
జిమ్‌లకు వెళ్లడం, వైబ్రేషన్ బెల్ట్‌లు వాడండం లాంటివి చేస్తుంటారు. అయితే ఇలాంటివి చేయడం కాస్త కష్టమైనది, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో ఈ రకమైన ఊబకాయం సమస్య ఉన్నవారు దాని నుంచి బయటపడలేక తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు.
అయితే శరీరంలో కొవ్వు పేరుకు పోవడం వల్ల ఊబకాయంతో బాధపడేవారికి యోగా చక్కగా ఉపయోగపడుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు. యోగా ద్వారా ఊబకాయం సమస్యను సులభంగా దూరం చేసుకోవచ్చని వారు సలహా ఇస్తున్నారు. యోగాలో వేసే ఆసనాల వల్ల ఊబకాయం నుంచి అతి త్వరగా బయటపడొచ్చని వారు పేర్కొంటున్నారు.
యోగా నేర్చుకుని రోజూ ఓ నాలుగైదు రకాల ఆసనాలు వేయండం ద్వారా ఊబకాయాన్ని చాలా సమర్థంగా తగ్గించుకోవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు. యోగా ద్వారా కేవలం ఊబకాయం సమస్య మాత్రమే కాక హైబీపీ, మధుమేహం లాంటి రుగ్మతలను సైతం అదుపులో పెట్టవచ్చని యోగా నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Post a Comment