Skip to main content

నిటారుగా ఉండే వెన్నెముక కోసం చెయ్యవలసిన యోగ !

మీరు నిటారుగా ఉన్న వెన్నెముక వల్ల కలిగే ప్రయోజనాలను గూర్చి ఎప్పుడైనా గుర్తించారా? వంగి ఉన్న వెన్నెముక వల్ల వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి నష్టపరిచేదిగా మాత్రమే కాకుండా, అనేకమైన ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా వేగంగా పరుగులు తీసే నేటి జీవన గమనంలో, వంగి ఉన్న వెన్నెముక వల్ల కలిగే సమస్యలనేవి సాధారణ ప్రజలకు విసుగును తెప్పించేవిగా ఉన్నాయి. వక్రంగా ఉన్న వెన్నెముక అనేది, తరచుగా తప్పుడు స్థితిలో కూర్చోవడం వల్ల (లేదా) తలను వంచి నడవటం వల్ల కలిగే ఫలితమని చెప్పవచ్చు. 

గత కొన్ని దశాబ్దాల నుంచి, వెన్నెముక ఆరోగ్యం అనేది ప్రధానమైన ఆరోగ్య సమస్యల్లో ఒకటి ఉంది. మరియు ఇది ఆరోగ్యకరమైన శరీరాన్ని సూచించేందుకు వెన్నెముక ఆరోగ్యం చాల కీలకమైనదని సరిగ్గా చెప్పబడినది.

కాబట్టి, ఎవరైతే వెన్నెముక సమస్యలను ఎదుర్కొంటున్నారు అలాంటి వారికోసం ఏదైనా పరిష్కారం ఉందా ? అవును ఉంది ! యోగాను ప్రతినిత్యం సాధన చేయటం వల్ల వెన్నెముక సమస్యలతో బాధపడుతున్నా వారికి సత్వరమే నివారణ చర్యలను చేపట్టి త్వరగా ఉపశమనాన్ని కలిగిస్తుంది మరియు మీ వెన్నెముకను నిటారుగా ఉంచడానికి సహాయపడుతుంది. వెన్నెముక సమస్య అనేది ఒక వ్యక్తి జీవితాన్ని క్లిష్టతరం చేస్తుంది, అలానే కొన్ని సాధారణ యోగ భంగిమలను సాధన చేయటం వల్ల సహజసిద్ధమైన చికిత్సగా పని చేస్తూ, మళ్లీ మీరు సాధారణ స్థితిలో ఉన్న వెన్నెముకను పొందటానికి సహాయపడుతుంది.

 నిటారుగా ఉండే వెన్నుముకను పొందటం కోసం ఇక్కడ కొన్ని యోగ భంగిమలు ఉన్నాయి, అదేమిటో మీరే చూడండి.

1. భుజంగాసనము : 


భుజంగాసానమును, కోబ్రా భంగిమగా కూడా పిలుస్తారు, ఈ భంగిమ ఆరోగ్యవంతమైన వెన్నెముకను పొందేటందుకు చాలా సమర్థవంతంగా పని చేస్తుంది. ఒక కోబ్రా (పాము) దాని తలను పైకి ఎత్తి చూసినట్లుగా పోలినట్లుగా ఉండి - వెనకకు వంగినట్లుగా కనబడే ఈ భంగిమలో, మీరు మీ మొండెము భాగాన్ని చేతుల సాయంతో పైకి ఎత్తినట్లుగా కనపడుతుంది. కోబ్రా భంగిమ అనేది చాలా వంతమైన యోగా భంగిమగా ఉంటూ, మీ వెన్నెముకకు మరింత బలాన్ని చేకూర్చేదిగా ఉంటుంది.

2. తిర్యాక్ భుజంగాసనము : 


తిర్యాక్ భుజంగాసానము (లేదా) స్వేయింగ్ (ప్రక్కకు తిరిగి ఉన్న) కోబ్రా భంగిమలో మీ వెన్నెముకను బాగా విస్తరించినట్లుగా చేసి మరియు వెన్నెముకను మరింతగా బలపరిచేటట్లుగా చేస్తుంది. ఇది కాటువేసే పాము యొక్క వంకరగా ఉన్న రూపాన్ని పోలి ఉంటుంది. ఇది అన్ని రకాల వెన్నెముకకు సంబంధించిన సమస్యలను మరియు వెన్నుపాముకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది వెన్నెముకకు పైన ఉన్న కండరాల వశ్యతను (సాగే గుణాన్ని) బలపరుస్తుంది మరియు అందుకు సహాయపడుతుంది కూడా.

3. బాలసనము :


 బాలసానము (లేదా) పిల్లల భంగిమ అనేది విశ్రాంతిని సూచించే భంగిమ, ఇందులో ఒక పిల్లవాడు ముడుచుకొని (చుట్టుకొని) ఉన్నట్లుగా పోలి ఉంటుంది. ఈ స్థితిలో ఉన్నప్పుడు మీ వెన్నెముకకు విశ్రాంతిని కలుగజేసి, వెన్నెముక క్రింద భాగాన్ని కూడా బాగా సాగేటట్లుగా చేస్తుంది. ఏదైనా ఇతర యోగ భంగిమలను సాధన చేసిన తర్వాత ఈ భంగిమను చేయవచ్చు. ఒత్తిడిని విడుదల బయటకు విడుదల చేయడానికి అనువుగా మన శరీరాన్ని మారుస్తుంది మరియు చాలా శరీరానికి ఉపశమనాన్ని కల్గజేస్తుంది.

4. సలభాసనము :


 సలభాసానము (లేదా) లోకస్ట్ (మిడుత) భంగిమ, ఇది వెనుకకు వంగగల ఒక సాధారణమైన ఆసనము మరియు యోగాను కొత్తగా సాధన చేసేవారికి సిఫార్సు చెయ్యబడే భంగిమలో ఇది సర్వసాధారణమైనది. ఇది వెన్నెముకలో ఉన్న ఉద్రిక్తతలను తొలగించి ఉపశమనమును కలిగించేదిగా సమర్ధవంతమైన పాత్రను పోషిస్తుంది. ఈ యోగా ఆసనము మొత్తం శరీరం యొక్క స్థితిని మెరుగు పరుస్తుంది. సలభాసానము, మీ వెన్నెముకను బలపరచే యోగాసనాలలో ఉత్తమమైనది మరియు ప్రసిద్ధి చెందిన యోగాసనాలలో ఒకటిగానూ ఉన్నది.

5. మకరసనము : 


వెన్నెముకకు సంబంధించిన అన్నిరకాల సమస్యలకు, మకరసానము (లేదా) మొసలి భంగిమ అనేది చాలా లాభదాయకము. ఈ భంగిమలో నీటిలో మునిగివున్న మొసలి, దాని యొక్క మెడను, తలను నీటిపైన ఉంచినట్లుగా పోలి ఉంటుంది. ఈ యోగాసనము మీ యొక్క భుజాలను మరియు వెన్నెముకను విశ్రాంతిని కలుగచేసేదిగా ఉంటుంది. ఇది ఒత్తిడిని మరియు వెన్నునొప్పిని తగ్గిస్తుంది.

6. విరాసనము : 


రెస్లింగ్ వీరుని యొక్క భంగిమగా ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఈ భంగిమను సాధన చేయుట వల్ల వెన్నుపామును పునరుద్ధరించబడేలా చేసి, నిటారుగా ఉండేలా చేస్తుంది. ఇది మీకు విశ్రాంతిని కలుగజేసి, సరైన స్థితిలో మనల్ని ఉంచేలా చేస్తుంది. ఈ విరాసానము, వెన్నెముక యొక్క సమతుల్యతను కాపాడుతూ, దానిని సంరక్షిస్తుంది మరియు వెన్నెముక యొక్క సాగే గుణాన్ని మెరుగుపరుస్తుంది.

7. తడాసనము : 


తడాసనము (లేదా) పర్వత భంగిమ అనేది, ఇతర యోగ భంగిమల వలె కాకుండా, ప్రాథమికంగా నిలబెట్టబడి భంగిమగా (లేదా) ఆధారభూతమైన భంగిమగా ఉంది. ఈ ప్రత్యేక భంగిమలో వెన్నెముక పొడుగుగా ఉంటుంది. ఈ సాధారణ భంగిమ, మిమ్మల్ని సరిగ్గా నిలబడేటట్లు చెయ్యటానికి మరియు మీ యొక్క స్థితి భంగిమను సరిచేస్తుంది.. తడాసనము అనేది ఉత్తమమైన యోగాసనాలలో ఒకటిగా చెప్పబడుతుంది, మరియు ఇది ఇంకా సమర్థవంతమైనదిగా ఉంటుంది.

8. ఉత్తనాసనము :


 ఉత్తనాసనము కూడా నిలుచుని ముందుకు వంగే భంగిమగా ఉండి, మీ వెన్నెముకను సాగేటట్లుగానూ మరియు బలమైనదిగానూ చెయ్యడంలో సహాయపడుతుంది. ఈ యోగాసనము, శరీర కండరాలను తీవ్రంగా సాగదీస్తుంది. ఇది వెన్నెముకను బలపరిచే ఉత్తమమైన ఆశనాలలో ఒకటి. ఈ ఉత్తనాసనము, వెన్నెముకకు, భుజానికి, మెడ మరియు వీపు వెనుక భాగంలో ఉన్న ఒత్తిడిని తగ్గించి, ఉపశమనాన్ని కలుగజేస్తుంది. ఈ కథనాన్ని ఇతరులకు భాగస్వామ్యం చేయండి!

























Comments

Popular posts from this blog

సూర్యనమస్కారాలతో ఆ సమస్య తగ్గుతుంది...

రకరకాల ఒత్తిళ్లతో బిజీగా ఉండే మహిళలకు ఆరోగ్యవంతమైన జీవితం చాలా ముఖ్యం. మరి అదేలా సాధ్యం... రోజూ తీసుకునే ఆహారాలలో పోషక విలువలు అధికంగా ఉండాలి. అలానే రోజుకో ఆపిల్ పండు తీసుకోవాలి. కొన్ని రకాల వ్యాయామాలతో మహిళలు ఆరోగ్యపరమైన జీవితాన్ని పొందవచ్చును. మరి ఆ వ్యాయామాలేంటో.. ఎలా చేయాలో చూద్దాం... అధిక బరువు గలవారు బరువు తగ్గాలనుకుంటే.. స్క్వాట్స్ వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామం చేయడం వలన ఊపిరితిత్తులు, హృదయానికి ఎంతో మేలు చేస్తుంది. తద్వారా బరువు తగ్గుతారు. తరచుగా సూర్యనమస్కారాలు చేయడం వలన నడుము భాగం గట్టి పడుతుంది. అలానే మోకాళ్లపై భాగం దృఢంగా మారుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.  ప్లాంక్స్ వ్యాయామం చేస్తే.. కండారాలకు చాలా మంచిది. ముఖ్యంగా ఛాతీ, కటి వలయ భాగం దృఢంగా మారుతుంది. ఈ వ్యాయామంతో రక్తంలోని చక్కెర స్థాయిలు మెరుగుపడుతాయి. తద్వారా శ్వాస తీసుకోవడంలో అడ్డంకులు ఉండవు. అలానే నెలసరి సమస్యలు అదుపులో ఉంటాయి. వ్యాయామం చేయడం వలన ముడతల చర్మం కాస్త తాజాగా మారుతుంది.

కాయకల్ప యోగ భంగిమ దశలు మరియు ఉపయోగాలు

కాయకల్ప యోగ విధానం అనేది యోగ ప్రక్రియలో అత్యంత ప్రశంసనీయమైనది, జీవన శక్తిని మెరుగుపర్చడానికి ఈ యోగ విధానంను అభ్యసించడం జరుగుతుంది. కాయకల్ప యోగ భంగిమల ప్రాథమిక లక్ష్యం- శరీర విధానాన్ని గాడిలో పెట్టడం, సహజంగానే వృద్దాప్య ప్రక్రియను మందగింపచేసి, జీవిత కాలాన్ని పెంచుతుంది. యోగ అనేది భౌతిక జీవితం మరియు స్మారక స్థితితో కూడుకొని ఉంటుంది. కాయకల్ప యోగ విధానంను సాధన చేయడం ద్వారా లైంగిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిలోకి రూపాంతరం చెందించవచ్చు. కాయకల్ప యోగ విధానం యొక్క నియమావళి కాయకల్ప యోగ, నరాలు సరైన విధంగా పని చేయడానికి మరియు శరీర కేంద్ర నాడీ వ్యవస్థని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. యోగ పద్దతిలో "క్రౌన్ చర్కా" అనే ఆసనం వుంటుంది, దీనిని నుదుటి మధ్య భాగంలో ఉంచుతారు అది శక్తి ప్రవాహంపై ప్రభావం చూపుతుంది. ఈ సాధనను ఆచరించడం వలన మనం ఆరోగ్యకరమైన శరీరంతో పాటు ప్రశాంతమైన మనస్సు కలిగి ఉండేలా ప్రోత్సహిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, కాయకల్ప నియమావళి వలన సాధకుడు శరీర దారుడ్యం మరియు ఆధ్యాత్మికంగా కూడా సంతృప్తి పొందేలా చేస్తుంది. కాయకల్ప యోగ భంగిమల అనుసరణ     కాయకల్ప యోగ శ్వాససంబంధిత వ్యాయామాలత...

12 ఆసనాలతో సూర్య నమస్కారం... ఎలా వేయాలి? ఫలితాలు ఏమిటి...?

సూర్యనమస్కారం పలు యోగాసనాల మేలు కలయిక. ఈ ఆసనాన్ని ఏ వయస్సులోని వారైనా వేయవచ్చు. దీని వలన శారీరకంగానూ, మానసికంగానూ ఉపయోగంగా ఉంటుంది. సూర్యనమస్కారం 12 ఆసనాలతో కలసి ఉంటుంది.  ఆసనం వేయు పద్ధతి... నిలబడిన స్థితిలో కాళ్ళను పరస్పరం దగ్గరకు తీసుకు రావాలి. భుజాలను చక్కగా పైకి తీసుకు రావాలి. తలకుపైకి తీసుకు వచ్చిన అరచేతులను కలపాలి. ఆలాగే ముఖం ఎదుటకు తీసుకువచ్చి నమస్కారం చేసే స్థితికి రావాలి. కలిపిన చేతులు ఛాతీ వద్ద ఉండేలా చూసుకోవాలి. గాలిపీల్చుకుంటూ భుజాలను పైకి తీసుకురావాలి. చెవులను తాకుతూ ఉండాలి. మెల్లగా చేతులను వెనకవైపుకు తీసుకురావాలి. వీలైనంతగా తలను వెనక్కు వంచాలి. మెల్లగా గాలి వదులుతూ ముందుకు వంగాలి. చేతులను సమాంతరంగా ఉంచుతూ నేలను తాకాలి. ఈ సమయంలో తల మోకాలిని తాకుతూ ఉండేంతవరకూ తీసుకురావాలి. ఈ స్థితిలో కొన్నిసెకనులు అలాగే ఉండాలి. దీనినే పాద పశ్చిమోత్తాసనం అంటారు. గాలి పీల్చుతూ కుడికాలును వెనక్కు తీసుకురావాలి. వీలైనంత వెనక్కు ఉండేలా చూడాలి. ఈ స్థితిలో తలపైకెత్తాలి. కొన్ని సెకనలు ఈ స్థితిలో ఉండాలి. మెల్లగా గాలి వదులుతూ అదే విధంగా ఎడమ కాలిని వెనక్కు తీసుకురావాలి. పాదాలు రెండూ పక్కపక్క...