Skip to main content

Posts

యోగాసనాలు వేస్తున్నారా.. అయితే దివ్యమైన శక్తిని...

ప్రపంచంలో అనంతమైన విశ్వశక్తి ఉన్నది, అదే యోగాసనం. ఇది మహత్తర దివ్యశక్తిని సంపూర్ణంగా శరీరం లోలోపలికి తీసుకుంటుంది. మీరు యోగాచేసేటపుడు ఎంతవీలైన అంత నిదానంగా, నెమ్మదిగా శ్వాస ఎక్కువగా తీసుకుంటే అంత మంచి ప్రపంచంలో అనంతమైన విశ్వశక్తి ఉన్నది, అదే యోగాసనం. ఇది మహత్తర దివ్యశక్తిని సంపూర్ణంగా శరీరం లోలోపలికి తీసుకుంటుంది. మీరు యోగాచేసేటపుడు ఎంతవీలైన అంత నిదానంగా, నెమ్మదిగా శ్వాస ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. అలా తీసుకోవడం వలన మీరు అద్భుతమైన శక్తిని పొందవచ్చును. గాలి శరీరంలోపల ఉండగానే శ్వాసను బిగబట్టుకుని ఎంత వీలవుతుందో అంత ఎక్కువసేపు యోగా చేయాలి.  మీలోని బలహీనతను, అనారోగ్యాన్ని సంపూర్ణంగా బయటకు వదిలేస్తున్నారనే భావం చెందుతుంటే దీర్ఘంగా ఉన్నశ్వాసను బయటకు నెమ్మదిగా వదిలేయాలి. గాలిని విడిచిపెట్టిన తరువాత శ్వాశ బిగపట్టాలి. అప్పుడే ప్రాణాయామం చేసేందుకు మంచిగా ఉపయోగపడుతుంది. 5 నిమిషాల పాటు ప్రాణాయామం చేయాలి.   ఇలా చేయడం దివ్యశక్తిని పొందగలుగుతారు.  ఈ ప్రాణాయామం మరొక 5 నిమిషాల పాటు చేయడం వలన శరీరంలో ప్రవేశిస్తున్న ఈ దివ్యశక్తి తరంగాలను చేరుకుంటుంది. మీ శరీరంలో, మనస్సులో, ...

ఛాతీ పరిమాణాన్ని పెంచే మత్య్సాసనం

మత్స్యాసనం చేప భంగిమలో ఉంటుంది. సంస్కృతంలో మత్స్య అంటే చేప అని అర్ధం. సాధారణంగా నీటిలో ఈ ఆసనం వేయడంలో ప్రావీణ్యం సాధించినవారు చేతులు, కాళ్లు సాయం లేకుండా ఈ ఆసనస్థితిలో పైకి తేలుతారు. చేయుపద్ధతి :  ముందుగా పద్మాసన స్థితిలోకి రావాలి. మోకాలు భాగాలు తప్పనిసరిగా నేలను తాకుతున్న స్థితిలో ఉండాలి మోచేతులను వెనుకకు తీసుకురావాలి. మీ వీపును నేలకు సమాంతరంగా ఉంచాలి. ఈ స్థితిలో మీ మోచేతులు మరియు చేతుల సాయాన్ని మీరు తీసుకోవచ్చు. మీ చేతులను తలవైపుగా వెనక్కు ఉంచాలి. ఇప్పుడు మీ అరచేతులు నేలకు సమాంతరంగా ఉంచాలి. మీ చేతులు భుజాలకు వ్యతిరేక దశలో ఉండాలి. మీ అరచేతులను, మోచేతులను కిందికి నొక్కి ఉంచాలి. మీ పొత్తి కడుపును, ఛాతీని ముందుకు లేపి ఉంచాలి. నడుము, వీపు, భుజాలు నేలకు తాకకుండా పైకి లేపాలి. మీ శరీరం ఇప్పుడు మీ చేతుల సాయంపై ఆధారపడి ఉండాలి. వెన్నుపూసను విల్లులాగా వంచాలి. అదే సమయంలో మీ మెడ మరియు తలను గరిష్ఠ స్థాయిలో వెనుకకు వంచాలి. మీ తల పైభాగం నేలకు తాకేలా ఉండాలి. మీ చేతులను ముందుకు చాచండి. మీ తొడల వెనుక భాగాలను పట్టి ఉంచండి. మీ పొత్తికడుపు మరియు రొమ్ముభాగాన్ని పైకి ఎత్తి ఉంచేంద...

భుజంగాసనంతో శ్వాసకోశ సమస్యలకు చెక్

సాధారణంగా వర్షాకాలంలో అనేక రకాలైన వ్యాధులతో పాటు అనారోగ్య సమస్యలూ వస్తుంటాయి. వీటి నుంచి బయటపడేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అయితే, వర్షాకాలంలో మరింత జాగ్రత్త తీసుకున్నట్టయితే అనారోగ్యం బారినపడకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా శ్వాసకోస వ్యాధలు నుంచి తప్పించుకోవచ్చు. వర్షాకాలంలో ఎదురయ్యే ఈ శ్వాసకోశ సమస్యలను నియంత్రించడానికి ఉత్తమమైన మార్గం యోగాసనాలు. ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో భుజంగాసనం ప్రసిద్ధి చెందింది. ఈ ఆసనం రోజూ వేస్తే శ్వాసకోశ వ్యాధుల నుంచి బయటపడవచ్చు. శరీరంలోని అన్ని భాగాలకు శక్తినిచ్చే ఆసనం ఇదని, ప్రత్యేకించి యువతకు ఉపయోగకరమని యోగాసన నిపుణులు చెబుతున్నారు.  ఈ ఆసనం వేయడం వల్ల వల్ల గొంతు దగ్గర ఉండే థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మెరుగుపడుతుంది. సర్వైకల్‌ స్పాండిలైటిస్‌ అనే మెడకు సంబంధించిన వ్యాధి రాకుండా పూర్తిగా నివారిస్తుంది. ఊపిరితిత్తులు వ్యాకోచం చెంది శ్వాస బాగా ఆడటం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు దరిచేరవు. శరీరం చాలా శక్తివంతంగా మారుతుంది. వెన్నుకు బాగా శక్తివచ్చి వెన్నులోని డిస్క్‌ల సమస్యలు తగ్గిస్తుంది. నాభి వరకు బాగా సాధన చేయడం వల్ల పొట్ట కండరాలు గట్టిపడటమ...

నిముషానికి మీ శ్వాస 12 సార్లు... 5 సార్లకు తగ్గిస్తే ఏం జరుగుతుంది? హఠ యోగా...

హఠ యోగాతో అద్భుత ప్రయోజనాలున్నాయి.  చాలామంది కేవలం ఆరోగ్యం, ఫిట్‌నెస్‌లనే హఠ యోగా ప్రయోజనాలుగా భావిస్తుంటారు. అయితే, సద్గురు హఠ యోగా వల్ల శారీరకంగా పలు ప్రయోజనాలు లభించినా, అవన్నీ కేవలం సైడ్ ఎఫెక్టులు మాత్రమే అని  చెబుతున్నారు. మానవుని పూర్తి సామర్ధ్యాన్ని తెలుసుకోవడానికి, విశ్వాన్నే మీలోకి “డౌన్లోడ్” చేసుకునేందుకు తగినట్టుగా శరీర వ్యవస్ధను మలచుకోవడానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన వ్యవస్ధే ‘సాంప్రదాయ హఠ యోగ ‘అని ఆయన ఈ వ్యాసంలో తెలియజేస్తున్నారు. ఈ సృష్టి అంతా ఒక రకమయిన “జామెట్రీ” అంటే రేఖాగణితం, అలాగే మీ శరీరం కూడా. ఇది శరీరాన్ని ఒక అద్భుతమైన అవకాశంగా మారుస్తుంది. బహుశా ఈ రోజులలో, ఈ సమస్య ఇక లేదు కానీ, కొన్ని సంవత్సారాల క్రితం, తుఫాను వచ్చిపోయిన ప్రతిసారీ, పైకి వెళ్లి టీవి(TV) యాంటెనాని సరి చేసుకోవాల్సి వచ్చేది. అది ఒకవిధమైన కోణంలో ఉంటేనే మీ టీవిలో ప్రసారాలు వచ్చేవి, లేదా మీరు క్రికెట్ చూస్తున్నప్పుడో లేదా సీరియల్ చూస్తున్నప్పుడో అకస్మాత్తుగా మీ టీవిలో చుక్కలు వచ్చేవి. అప్పుడు మీరు యాంటెనాని సరిచేయవలసి వచ్చేది. ఈ శరీరం కూడా అలాంటిదే :  మీరు దానిని సరైన స్ధితిలో ఉ...

వర్షాకాలంలో ఇబ్బంది పెట్టే శ్వాసకోశ వ్యాధులు... ఈ ఆసనం వేస్తే...

శ్వాసకోశ వ్యాధుల నివారణకు భుజంగాసనం మంచి మేలు చేస్తుంది. ఈ ఆసనం ఎలా వేయాలో తెలుసుకుందాం. ప్రశాంతమైన గదిలో ఒక మెత్తని దుప్పటి పరుచుకోవాలి. దానిపై నెమ్మదిగా బోర్లా పడుకోవాలి. గడ్డాన్ని నేలకు ఆనించి ఉంచి చేతులను ఛాతీ ప్రక్కన అరచేతులు ఆని ఉండేటట్లుగా మోచేతులు పైకి ఉండేటట్లు ఏర్పరుచుకోవాలి. బారుగా చాపిన పాదాలు ఒకదానికొకటి ఆని ఉండేటట్లు ఉంచుకోవాలి. అనంతరం నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ బరువును అరచేతులపై ఉంచి ఛాతీని తద్వారా మెడను బాగా పైకి లేపాలి.  తలను బాగా పైకెత్తి పైకి ఆకాశం వంక చూస్తున్నట్లు ఉంచుకోవాలి. ఈ భంగిమలో వెన్ను చక్కగా అర్థచంద్రాకారంలాగా వెనుకకు వంగి ఉంటుంది. ఇలా ఎవరి అవకాశాన్ని బట్టి వారు ఛాతీని పైకి లేపాలి.  లేదంటే బొడ్డును కొలమానంగా ఉంచుకుని నాభి వరకూ నడుము నుంచి పొట్ట, ఛాతీ లేపాలి. ఈ సమయంలో చేతులను నిటారుగా లేపి ఉంచేకంటే కొంచెం వంచి ఉంచడం మంచిది. ఇలా చెయ్యడం వలన భుజాలు, చేతులు కూడా శక్తివంతమవుతాయి.  ఇది సర్పం శిరస్సు లేపి పడగ విప్పి ఆడినట్లు ఉంటుంది కాబట్టి భుజంగాసనం అన్నారు. దీనిలో శ్వాస నియమం శరీర భాగాలు విప్పారుతాయి. కాబట్టి శ్వాస తీసుకుంటూ భంగిమకు ...

శీర్షాసనం ఎవరు వేయకూడదు...? వేస్తే ఏంటి?

శీర్షాసనం వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ ఆసనాన్ని నాలుగు కాళ్ళు కలిగిన ఇనుప చట్రంమీద చేతులు పెట్టడానికి అనువైన వెడల్పు భాగం మీద చేతులు వుంచి, శరీర బరువును మోసేందుకు తమ భుజాలను సిద్ధం చేసి నెమ్మదిగా కాళ్ళు పైకి ఎత్తాలి. క్రమక్రమంగా శరీరం తూలకుండా నిలుపుతూ మొత్తం శరీరం తలకిందులుగా నిలపాలి.  ఈ ఆసనంలో శ్వాసక్రియ మామూలుగా జరపాలి. తిరిగి సాధారణ స్థితికి వచ్చి కాసేవు శవాసనం వేయాలి. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ (హైపర్ టెన్షన్) ఉన్నవాళ్ళు సాధారణమైన యోగాసనాలు చేయవచ్చు కానీ శీర్షాసనం వేయకూడదు. బీపీ ఉన్నవారు వేయకూడని ఆసనాలు కొన్నివున్నాయి. ఉదా:- పశ్చిమోత్తాసనము, పాదహస్తాసనం, శీర్షాసనం, సర్వాంగాసనాలు వేయకూడదు.  కారణం ఈ ఆసనాలు వేస్తే రక్తం అధికంగా తల లోపలికి ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాలు వేయకూడదు. ఇలాంటి ఆసనాలు వేస్తే తలలోని రక్తనాళాలు చిట్లే అవకాశం వుందని పరిశోధనలు చెబుతున్నాయి. బీపీ తగ్గడం కోసం చేస్తున్న ఏ ఆసనం వేస్తున్నప్పుడయినా సరే మీకు కాస్త అలసటగా అనిపిస్తే వెంటనే శవాసనం వేయడం అత్యుత్తమని యోగా నిపుణులు చెపుతారు. శవాసనంలో వీలయినంత సేపు ఉండడంకోసం మీ శ్వాసని లెక్క పెట్టడం మొదలు...

టైపింగ్ పనిచేసేవారు ''మకరాసనం'' వేస్తే...

మెడనొప్పులతో బాధపడేవారు మకరాసనం వేయడం వలన ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా టైప్ ఇనిస్టిట్యూట్‌లలో పనిచేసేవారు, ప్రెస్ కంపోజింగ్ పనిలో ఉండేవారు, కంప్యూటర్ ఆపరేటర్లు, లెక్కలు రాసేవారు, పుస్తకాలు చదివేవారు ఎక్కువగా మెడనొప్పితో బాధపడుతుంటారు. ఇలాంటివారు రాత్రి భోజనానికి ముందుగా ఈ మకరాసనం వేయడమ మంచిది. మకరాసనం అనగా ముందుగా మకరం అంటే మెుసలి అని అర్థం, ఆసనం అనగా మెుసలి రూపంలో ఉంటుంది. దీనికి నిరాలంబాసనం అనే మరో పేరు కూడా ఉంది. ఈ ఆసనం ఎలా వేయాలంటే ముందుగా బోర్లా పడుకుని భుజంగాసనంలాగా వేయాలి. రెండు చేతులను చుబుకం కింద ఆనించి, బుగ్గలను ఒత్తుతూ ఉండాలి. అలాగే రెండు మోచేతులను జోడించి నేలపై ఉంచి శ్వాసను సామాన్యంగా పీలుస్తూ, కళ్లు మూసుకుని, మెడమీద మనస్సును నిలపాలి. అలా రెండు నిమిషాల తరువాత తలను కిందికి దించి మోకాళ్లను చాపి ఉంచాలి. తరువాత శరీరం బరువునంతటినీ భూమిమీద పడేసి కళ్లు మూసుకోవాలి. అన్ని ఇంద్రియాలను మరచిపోయి కాసేపు అలాగే పడుకోవాలి. ఇలా చేయడం వల్ల మనస్సు శాంతపడుతుంది. శరీరమంతా శీతలీకరణం చెందుతుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేంటంటే అధిక రక్తపోటుతో భాదపడుతున్నవారు మాత్రం ఎట్ట...