Skip to main content

నిముషానికి మీ శ్వాస 12 సార్లు... 5 సార్లకు తగ్గిస్తే ఏం జరుగుతుంది? హఠ యోగా...

హఠ యోగాతో అద్భుత ప్రయోజనాలున్నాయి. 

చాలామంది కేవలం ఆరోగ్యం, ఫిట్‌నెస్‌లనే హఠ యోగా ప్రయోజనాలుగా భావిస్తుంటారు. అయితే, సద్గురు హఠ యోగా వల్ల శారీరకంగా పలు ప్రయోజనాలు లభించినా, అవన్నీ కేవలం సైడ్ ఎఫెక్టులు మాత్రమే అని  చెబుతున్నారు. మానవుని పూర్తి సామర్ధ్యాన్ని తెలుసుకోవడానికి, విశ్వాన్నే మీలోకి “డౌన్లోడ్” చేసుకునేందుకు తగినట్టుగా శరీర వ్యవస్ధను మలచుకోవడానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన వ్యవస్ధే ‘సాంప్రదాయ హఠ యోగ ‘అని ఆయన ఈ వ్యాసంలో తెలియజేస్తున్నారు.


ఈ సృష్టి అంతా ఒక రకమయిన “జామెట్రీ” అంటే రేఖాగణితం, అలాగే మీ శరీరం కూడా. ఇది శరీరాన్ని ఒక అద్భుతమైన అవకాశంగా మారుస్తుంది. బహుశా ఈ రోజులలో, ఈ సమస్య ఇక లేదు కానీ, కొన్ని సంవత్సారాల క్రితం, తుఫాను వచ్చిపోయిన ప్రతిసారీ, పైకి వెళ్లి టీవి(TV) యాంటెనాని సరి చేసుకోవాల్సి వచ్చేది. అది ఒకవిధమైన కోణంలో ఉంటేనే మీ టీవిలో ప్రసారాలు వచ్చేవి, లేదా మీరు క్రికెట్ చూస్తున్నప్పుడో లేదా సీరియల్ చూస్తున్నప్పుడో అకస్మాత్తుగా మీ టీవిలో చుక్కలు వచ్చేవి. అప్పుడు మీరు యాంటెనాని సరిచేయవలసి వచ్చేది.

ఈ శరీరం కూడా అలాంటిదే : 

మీరు దానిని సరైన స్ధితిలో ఉంచితే, అది పూర్తి విశ్వాన్ని గ్రహించగలదు. మీరు దానిని వేరే విధంగా ఉంచితే, మీకు మీ పంచేంద్రియాలు తప్ప ఇంకేమీ తెలియవు. మన శరీరం ఒక బారోమీటర్ వంటిది. మీకు దానిని ఎలా చూడాలో తెలిస్తే, అది మీ గురించి, మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి అంతా తెలియజేస్తుంది. మీ శరీరం మీకు ఎప్పుడూ అబద్ధం చెప్పదు, అందుకనే మనం యోగాలో మన శరీరాన్ని నమ్మటం నేర్చుకుంటాము. యోగా ద్వారా మనం మన భౌతిక శరీరంలో జరిగేకొన్ని నిర్బంధపు ప్రక్రియలను స్పృహతో జరిపే ప్రక్రియలుగా మారుస్తాం. తద్వారా శరీరాన్ని అన్నింటినీ గ్రహంచగలిగే, తెలుసుకోగలిగే ఒక శక్తివంతమైన పరికరంగా మారుస్తాం.

శరీరం అతి గొప్ప పరికరం

ఈ శరీరాన్ని, కేవలం మనం ఈ భూమి నుండి సేకరించిన ఒక ఆహారపు కుప్పగానో  లేక నిర్బంధపు ప్రక్రియలు జరిగే రసాయనాల సమ్మేళనంగానో లేక రక్త మాంసాలగానో కాకుండా, వాటికి మించిన దానిగా తయారుచేయడానికి ఒక సైన్స్, టెక్నాలజీ ఉంది. మీకు శరీరాన్ని ఎలా చదవాలో తెలిస్తే, అది మీ సామర్ధ్యాన్ని, మీ పరిమితులని, మీ భూత, భవిష్యత్, వర్తమానాలన్నిటినీ మీకు తెలియజేస్తుంది. అందుకనే, ప్రాధమికమైన యోగా శరీరంతో మొదలవుతుంది. దీనిని ఇలా వివరించవచ్చు. 

మీ ఫోన్ లేదా మీ దగ్గర ఉన్న ఏదైనా పరికరం గురించి మీకు ఎంత ఎక్కువ తెలిస్తే, మీరు దానిని అంత బాగా ఉపయోగించుకోగలరు. కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశంలో ఫోన్ కంపెనీలు ఒక సర్వేని చేసి తెలుసుకున్నది ఏమిటంటే 97% మంది తమఫోను సామర్ధ్యంలో కేవలం 7% మాత్రమే ఉపయోగిస్తున్నారని (నేను నేటి స్మార్ట్ ఫోన్ల గురించి మాట్లాడటం లేదు, ఆ రోజుల్లోని డబ్బా ఫోన్ల గురించి మాట్లాడుతున్నాను!) ఆ చిన్న పరికరంలోనే మీరు 7% వాడుతున్నారు. మరి మీ శరీరం విషయానికొస్తే, అది అసలైన పరికరం. ఈ ప్రపంచంలోని ప్రతి పరికరం కూడా దీని నుండే వచ్చింది.

మరి మీరు ఈ పరికరంలో ఎంత శాతాన్ని వాడుతున్నారని అనుకుంటున్నారు?1% కంటే కూడా చాలా తక్కువ. ఈ భౌతిక ప్రపంచంలో జీవించడానికి, అంటే మీ మనుగడ కోసం, మీ శరీరంలో 1% కూడా మీకు అవసరం లేదు. మనం దీనితో ఎన్నో పనికిమాలిన పనులు చేస్తున్నాము, ఎందుకంటే ప్రస్తుతం మనం ఉనికిలోని భౌతిక భాగాన్ని మాత్రమే గ్రహించగలుగుతున్నాం. కానీ మీ శరీరానికి పూర్తి విశ్వాన్ని గ్రహించగల సామర్ధ్యం ఉంది. మీరు కనుక దానిని సరిగ్గా సిద్ధం చేస్తే, అది ఉనికిలోని ప్రతి దానిని గ్రహించగలదు, ఎందుకంటే ఉనికిలో జరిగే ప్రతిదీ కూడా ఒక విధంగా మన భౌతిక శరీరంలో కూడా జరుగుతుంది.

తరువాతి అడుగు

మనిషి సాధారణంగా నిముషానికి 12 నుండి 15 సార్లు శ్వాస తీసుకుంటాడు. మీరు కనుక దానిని 11 కి తగ్గిస్తే, మీకు భూగోళపు బాహ్య పొర గురించి తెలుస్తుంది. మీరు దానిని 9కి తగ్గిస్తే, మీకు ఈ భూమండలంలోని ఇతర ప్రాణుల భాష అర్ధమవుతుంది. మీరు దానిని 7కి తగ్గిస్తే, మీకు ఏకంగా భూగోళపు భాషే అర్ధమవుతుంది. మీరు దానిని 5కి తగ్గిస్తే, మీకు ఈ సృష్టి మూలం యొక్క భాష అర్ధమవుతుంది. ఇది మీ ఏరోబిక్ సామర్ధ్యాన్ని పెంచడం గురించి లేదా బలవంతంగా మీ శ్వాసను బిగపట్టడం గురించీ కాదు. మీరు హఠ యోగ, క్రియలను కలిపి చేయడం ద్వారా మీ ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని క్రమంగా పెంచుకోవచ్చు. అయితే అన్నిటిని మించి, అవి మీ శారీరక వ్యవస్థలో ఒక విధమైన అలైన్‌మెంట్‌ని(సర్దుబాటుని), ఒక విధమైన సౌలభ్యాన్ని సాధించడానికి దోహదపడుతాయి. దాంతో మీ వ్యవస్ధ ఎటువంటి అలజడులు లేని ఒక స్థిరత్వాన్ని పొందుతుంది. అప్పుడు అది అన్నిటినీ గ్రహిస్తుంది.

Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, బరువును తగ్గించే పృధ్వి ముద్ర!

వైట్ డిశ్చార్జ్.. కాలేజీ పిల్లల నుంచి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల వరకూ చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఈ ఇబ్బంది ఇన్ఫెక్షన్లుగా మారకుండా ఉండటానికి, అదుపులో ఉంచడానికి పృధ్విముద్ర ఆసనాన్ని ఆచరించండి.    పృధ్వి ముద్ర:  పద్మాసనంలో కూర్చుని, రెండు చేతుల ఉంగరం వేళ్లు మడిచి బొటనవేళ్లను వాటిపై ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకుని శ్వాసమీదే ధ్యాస నిలపాలి. ఐదు సెకన్ల పాటు గాలిని తీసుకుంటే పదిసెకన్ల పాటు గాలిని వదలాలి. అంటే వదిలేటప్పుడు రెండు రెట్ల గాలిని వదలాలి. వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి.