Skip to main content

ఈ యోగాసనంతో ఛాతీ పెరుగుతుంది... ఎలా చేయాలో తెలుసా?


చాలామంది పురుషులు, స్త్రీలు తమ ఛాతీ భాగం చిన్నదిగా వుందని మథనపడుతుంటారు. అలాంటివారు ఈ ఆసనం వేస్తే ఛాతీ పెరుగుతుంది. ఈ ఆసనం పేరు మత్స్యాసనం. ఇది చేప భంగిమలో ఉంటుంది. సంస్కృతంలో మత్స్య అంటే చేప అని అర్ధం. సాధారణంగా నీటిలో ఈ ఆసనం వేయడంలో ప్రావీణ్యం సాధించినవారు చేతులు, కాళ్లు సాయం లేకుండా ఈ ఆసన స్థితిలో పైకి తేలుతారు.


చేయుపద్ధతి :

ముందుగా పద్మాసన స్థితిలోకి రావాలి.

మోకాలు భాగాలు తప్పనిసరిగా నేలను తాకుతున్న స్థితిలో ఉండాలి

మోచేతులను వెనుకకు తీసుకురావాలి.

మీ వీపును నేలకు సమాంతరంగా ఉంచాలి.

ఈ స్థితిలో మీ మోచేతులు మరియు చేతుల సాయాన్ని మీరు తీసుకోవచ్చు.

మీ చేతులను తలవైపుగా వెనక్కు ఉంచాలి.

ఇప్పుడు మీ అరచేతులు నేలకు సమాంతరంగా ఉంచాలి.

మీ చేతులు భుజాలకు వ్యతిరేక దశలో ఉండాలి.

మీ అరచేతులను, మోచేతులను కిందికి నొక్కి ఉంచాలి.

మీ పొత్తి కడుపును, ఛాతీని ముందుకు లేపి ఉంచాలి.

నడుము, వీపు, భుజాలు నేలకు తాకకుండా పైకి లేపాలి.

మీ శరీరం ఇప్పుడు మీ చేతుల సాయంపై ఆధారపడి ఉండాలి.

వెన్నుపూసను విల్లులాగా వంచాలి.

అదే సమయంలో మీ మెడ మరియు తలను గరిష్ఠ స్థాయిలో వెనుకకు వంచాలి.

మీ తల పైభాగం నేలకు తాకేలా ఉండాలి.

మీ చేతులను ముందుకు చాచండి.

మీ తొడల వెనుక భాగాలను పట్టి ఉంచండి.

మీ పొత్తికడుపు మరియు రొమ్ముభాగాన్ని పైకి ఎత్తి ఉంచేందుకు మీ మోచేతులు ఒక కప్పీలాగా ఉపయోగపడాలి.

ఇది మీ వెన్నుపూసను వంచేందుకు మరియు మీ తలపైభాగం నేలమీద సరైన స్థితిలో ఉంచేలా తోడ్పడుతుంది.

బొటనవేలు, చూపుడు వేలు, మధ్యవేలు మూడూ ఎదురుగా ఉన్న కాలివేళ్ళను గట్టిగా పట్టి ఉంచడానికి గాను కొక్కీ రూపంలో ఉండాలి.

కనీసం 10 సెకనుల పాటు ఈ స్థితిలోనే ఉండాలి.

మీరు మామూలుగానూ, క్రమబద్ధంగాను శ్వాసను పీలుస్తుండాలి.

ఈ స్థితినుంచి మెల్లగా ప్రారంభంలోని పద్మాసన స్థితికి మళ్లాలి.


ప్రయోజనాలు :



ఛాతీ పరిమాణం పెరుగుతుంది.

మీ ఊపిరితిత్తులు తాజా ప్రాణవాయువును పీల్చు ఉంచుకునేలా తమ సామర్థ్యతను పెంచుకుంటాయి.

వెన్నెముక బలిష్టంగా తయారవుతుంది.

మీ వెన్ను మరియు మెడ ప్రాంతాలు విస్తరించడం వల్ల మరింత అనుకూల స్థితిలో ఉంటాయి.

సరైన స్థితిలో కూర్చోకపోవడం అనే అలవాటునుంచి వెన్ను వంపు భాగాలు సరిదిద్దబడతాయి.


హెచ్చరికలు :



ఛాతీలో లేదా మెడలో నొప్పితో బాధపడుతున్నప్పుడు మీరు ఈ ఆసనం వేయరాదు.

Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

నిద్రలేచిన వెంటనే చేయాల్సిన 5 యోగాసనాలు

ఈ ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యం మీద అవగాహన, బాధ్యత కలిగి ఉండాలి. ఆరోగ్యంగా ఉండటానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. అందుకు యోగా బాగా సహాయపడుతుంది. యోగా చేయాలంటే బద్దకిస్తున్నారా? అయితే మీకు సహాయం చేయడానికి మేమున్నాం.  ప్రతి రోజూ ఉదయం యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని, చాలా మందికి తెలుసు, అయితే ఎంత మంది ఈ పద్దతిని అనుసరిస్తున్నారు? ఖచ్చితంగా ఏ కొద్ది మాత్రమే రోజూ యోగను సాధన చేస్తుంటారు.  మరికొద్దిమంది, యోగ మొదలు పెడతారు ఒక నెలలో, రెండు నెలలో ప్రాక్టీస్ చేసి, ఆపేస్తుంటారు. ఆ తర్వాత ఐదు, ఆరు నెలలు బ్రేక్ తీసుకుని, తిరిగి ప్రారంభిస్తుంటారు. రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే పరగడపుతో యోగాను ప్రాక్టీస్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. రోజూ యోగ సాధన చేయడం వల్ల శరరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. యోగ అనేది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు, దీని వల్ల ఆస్త్మా, వెన్నునొప్పి, ఇతర శ్వాస సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు. నిద్రలేచిన వెంటనే చేయాల్సిన కొన్ని యోగాసనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 1.లార్డ్ ఆఫ్ డ్యాన్స్ ఫోజ్ (నటరాజ ఆసనం):  నటరాజాసన (నట-డ్యాన్స్, రాజ-కింగ్, ఆసన-భంగిమ)...