Skip to main content

టీనేజర్స్ లో బరువు తగ్గించే సులభ వ్యాయామాలు!

ప్రస్తుత రోజుల్లో టీనేజర్స్ లో కూడా ఊబకాయన్ని చూస్తున్నాం. అందుకు కారణం అపక్రమ ఆహార శైలి మరియు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం. ఇదికాకుండా, సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ మరియు ఇంటర్నెట్ వంటివి వారి పొటాటో కోచ్ లా తాయారు చేస్తాయి. దాంతో వారు నిజమైన ప్రపంచంతో పరిచయం కోల్పోయిన వాస్తవ ప్రపంచంలో జీవిస్తున్నారు. దాని ఫలితం, టీనేజర్స్ లో ఊబకాయం మరియు అనుకోకుండా అపూర్వమైన విధంగా అధిక బరువు పెరగడం. టీనేజర్స్ బరువు తగ్గడానికి మంచి పద్దతి వారు యాక్టివ్ గా ఉండటమే.

 టేనేజర్ చిన్న వయస్సులో ఉన్నప్పుడే ఫిజికల్ యాక్టివిటీస్ సాధారణంగా ఉంటాయి. కాబట్టి బరవు తగ్గాలని కోరుకొనే టీనేజర్స్ ఫేస్ బుక్ ను సెలవు తీసుకొని అవుట్ డోర్ యాక్టివిటీస్ లో పాల్గొనడమే. అంతే కంటే ముందు, రెగ్యులర్ వెయిట్ లాస్ వ్యాయామాలు నిజంగా మిమ్మల్ని తిరిగి యాథాస్థితికి తీసుకొచ్చి మిమ్మల్ని స్లిమ్ గా మార్చుతాయి.


మరి టీనేజర్స్ బరువు తగ్గించుకోవడానికి కొన్ని విలువైన వ్యాయామాలు క్రింది విధంగా ఉన్నాయి పరిశీలించండి..

రన్నింగ్: 


మీరు టీనేజ్ లో ఉన్నట్టైతే, మీ జీవక్రియలను నిధానం అవ్వడంలో మీరు ఇంకా యవ్వనంగా ఉన్నట్లే. కాబట్టి మంచి వ్యాయామం అంటే నడక మరియు జాగింగ్ వంటివి మీకు సహాయపడుతాయి. ప్రతి రోజూ కొంత సమయం వీటికోసం వెచ్చించాలి. ప్రతి రోజూ మూడు నాలుగు కిలో మీటర్లు పరుగెత్తడం వల్ల మీరు బరువును ఒక లెవల్ కు తీసుకురావచ్చు. పరుగెత్తడం అనేది బెస్ట్ కార్డియో ఎక్సర్ సైజ్ వంటిది మరియు ఇది క్యాలరీలను కరిగించేస్తుంది. 

సైకిల్ తొక్కడం: 


మీరు యవ్వనంలో ఉన్నప్పుడు, మీ వెన్ను చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి సపోర్ట్ (బ్యాలెస్ ఇష్యూష్)అవసరం ఉండదు. హై స్పీడ్ లో సైకిల్ తొక్కడం వల్ల ఇది మీకు కార్డియో ఎక్సర్ సైజ్ లా బాగా సహాయపడుతుంది. దీంతో మీరు బరువు తగ్గడం మాత్రమే కాదు, మీ కాళ్ళ కండరాలు కూడా బలపడుతాయి. ఇంకా కడుపు కండరాల మీద మంచి ప్రభావాన్ని చూపి, కడుపు వద్ద పేరొకొన్న అధిక కొవ్వును కరిగించేందుకు సహాయపడుతాయి.

 ఏరోబిక్స్ వ్యాయామాలు: 


మీ శరీరానికి అవసరం అయ్యే ఏరోబిక్స్ వ్యాయామాల మీద పై దృష్టి పెట్టడం చాలా అవసరం. అందుకు ఏరోబిక్స్ డ్యాన్స్ లేదా పవర్ యోగా క్లాసెస్ లో చేరడం వల్ల మీరు నిజంగా అధిక చెమటను పొందవచ్చు. దాంతో శరీరంలోని మలినాలను తొలగించుకొని, బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. ఆటలు ఆడటం: మీరు యవ్వనంలో ఉన్నప్పుడు, మీ డైలీ షెడ్యూల్లో వ్యాయామాలు ఒక భాగం. అయితే అదేపనిగా చేయకూడదు. లేదంటే విసుగు చెందుతారు. టెన్నీస్ లేదా ఫుట్ బాల్ టీమ్ లో చేరడం వంటివి కొత్తగా ఉత్సహాయంగా ఉంటాయి. దాంతో యవ్వనంలో బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతాయి.

 ఫ్రీ హ్యాండ్ ఎక్సర్ సైజ్: 


మీరు బరువు తగ్గడం ఒక్కటే సరిపోదు. అది మీ శరీర ఆకారన్ని కూడా మార్చాలి. కాబట్టి అందుకు ఉదరం మీద ఒత్తిడినీ తీసుకురావాలి. అలాగే పుష్ అప్స్ చేయడం వల్ల మీ కండరాల నుండి కొవ్వులు కరిగించవచ్చు. మీరు చాలా యంగ్ గా ఉండటం వల్ల ఇవి మీకు చాలా సులభంగా ఉంటాయి..





Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, బరువును తగ్గించే పృధ్వి ముద్ర!

వైట్ డిశ్చార్జ్.. కాలేజీ పిల్లల నుంచి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల వరకూ చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఈ ఇబ్బంది ఇన్ఫెక్షన్లుగా మారకుండా ఉండటానికి, అదుపులో ఉంచడానికి పృధ్విముద్ర ఆసనాన్ని ఆచరించండి.    పృధ్వి ముద్ర:  పద్మాసనంలో కూర్చుని, రెండు చేతుల ఉంగరం వేళ్లు మడిచి బొటనవేళ్లను వాటిపై ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకుని శ్వాసమీదే ధ్యాస నిలపాలి. ఐదు సెకన్ల పాటు గాలిని తీసుకుంటే పదిసెకన్ల పాటు గాలిని వదలాలి. అంటే వదిలేటప్పుడు రెండు రెట్ల గాలిని వదలాలి. వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.