Skip to main content

నీరసం, అలసట రాకుండా ఉండాలా? ఈ యోగాసనాలు ట్రై చేయండి...

మీరు కొద్దిపాటి దూరం నడిస్తేనే ఆయాసపడుతున్నారా? లేదా ఆఫిసులో ఒక గంట రెండు గంటల పని చేసిన తర్వాత బాగా అలసిపోయినట్టు అనిపిస్తొందా? అందుకు కారణం మీ శరీరంలొ సత్తువ లేకపోవడం కావచ్చు. 

మీకు ముందు చెప్పినట్టు ఏమైనా అనిపిస్తుంటే అందుకు చక్కగా పనిచేసే పరిష్కారం గురించి చదవండి. శ్వాస మరియు మైగ్రైన్ వంటి సమస్యలకు చికిత్సగా యోగాసనాలు బాగా పని చెస్తాయని మీరు విని మరియు చదివే ఉంటారు. అంతే కాకుండ మన శరీరంలొ సత్తువ పెరిగి తద్వారా త్వరగా అలసిపోకుండ ఉండడానికి కొన్ని ప్రత్యెకమైన యోగాసనాలు ఉన్నాయి.

 ఈ రోజు మనం బడలిక మరియు అలసట రాకుండా ఎలాంటి యోగాసనాలు చేయాలొ చూద్దాం.

అసలు ఎవరైనా ఎందుకు అలసిపోతారు? మన శరీరంలో అక్సిజన్ తగ్గిపోయినప్పుడు, మన అవయవాలు మరియు శరీర భాగాలు సరిగా పని చేయలేవు. ఇలా సరిగా పని చెయనప్పుడే మనకు అలసటగా, బడలికగా అనిపిస్తుంది. ప్రాచీన కాలం నుండి ఇలాంటి శరీర పరిస్థితులను నయం చేయడానికి యోగాసనాలను చికిత్సగా వాడుతున్నారు. అలాంటి అలసట, బడలిక ని నయం చేసే కొన్ని యోగాసనాల జాబితా మీకోసం చదవండి.

1. శేతుభంధాసనం ( బ్రిడ్జ్ పోజ్ )


 క్రమ పద్ధతిలో శేతుభంధాసనం చేసే విధానం:


 a.వెళ్ళకిలా పడుకుని మోకాళ్ళను ముడవండి. 

b.అరచేతులు నేల వైపు ఉంచి రెండు చేతులను ముందుకు పెట్టండి. 

c.నెమ్మదిగా ఛాతి గడ్డమును తాకే వరకు నడుమును పైకి లేపండి. 

d.తొడలు రెండు ఒకదానికి ఒకటి సమాంతరంగా ఉండేల చుసుకొండి. e.శరీరాన్నీ అదే భంగిమలొ నిలకడగా కొద్ది సేపు ఉంచండి.

2. ఉష్ట్రాసనం ( కేమల్ పోజ్ )


 క్రమ పద్ధతిలో ఉష్ట్రాసన చేసే విధానం: 


a.మోకాళ్ళపై నిలబడి చేతులను పొత్తికడుపు వెనక ఉంచి అరచేతులను పిరుదులపై ఉంచండి.

 b.బొడ్డు దగ్గర లాగినట్టు అనిపించే వరకు నెమ్మదిగా మీ వెన్నుపూసను మీ జఘన సంధానమునకు దగ్గరగా తీసుకు రండి. 

c.చేతులు తిన్నగా ఉంచుతూ పాదాలను పట్టుకుని నెమ్మదిగా వెనుకకు వంగండి. 

d.మీ మెడను ఎక్కువగా వంచి శ్రమపెట్టకుండా జాగ్రత్త పడండి.

 e.ఈ భంగిమలొ 30-40 సెకండ్లు ఉండి తర్వాత సాధారణ స్థితికి రండి.

3. సుప్తవిరాసనం ( రిక్లైనింగ్ హీరో పోజ్ )


 క్రమ పద్ధతిలో సుప్తవిరాసన చేసే విధానం:


 a.తొడలకు ఇరువైపుల చేతులు ఉంచి ఒక మ్యాట్ మీద మోకాళ్ళ పై కూర్చొండి. 

b.నెమ్మదిగా బలంగా ఊపిరి తీసుకుంటూ వెనకకు నేలపై వాలండి. 

c.ముందుగా బరువు చేతులపై ఉంచి తర్వాత నెమ్మదిగా బరువును మోచేతుల మరియు భుజాలపైకి మార్చండి. 

d.మీ పిరుదులను కిందకు వంచుతూ చేతులను వెనుకకు తీసుకురండి.

 e.ఈ భంగిమలొ కొద్ది సేపు ఉండి తర్వాత సాధారణ స్థితికి రండి.

4. శలభాసనం ( లొకస్ట్ పోజ్ )


 క్రమ పద్ధతిలో శలభాసనం చేసే విధానం: 


a.నేల మిద పొట్టపై పడుకొవాలి, అలాగె కాలి వేళ్ళు సమంగా మరియు గడ్డము నేలకు తగిలేట్టుగా చూసుకోవాలి. 

b.మోకాళ్ళు మరియు మోచేతులు తిన్నగా ఉండేలా చూసుకోవాలి. 

c.బలంగా ఊపిరి తీసుకుంటూ, నెమ్మదిగా ఛాతి , భుజాలు, కాళ్ళు, తొడలు గాలిలోకి లేపండి. 

d.నెమ్మదిగా చేతులు మరియు కాళ్ళు వీలైనంతగా చాచండి.

 e.ఈ భంగిమలొ కొద్ది సేపు ఉండండి. తర్వాత ఊపిరి వదిలి సాధారణ స్థితికి రండి. 

f.ఇలా 3-4 సార్లు చేయండి.













Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, బరువును తగ్గించే పృధ్వి ముద్ర!

వైట్ డిశ్చార్జ్.. కాలేజీ పిల్లల నుంచి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల వరకూ చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఈ ఇబ్బంది ఇన్ఫెక్షన్లుగా మారకుండా ఉండటానికి, అదుపులో ఉంచడానికి పృధ్విముద్ర ఆసనాన్ని ఆచరించండి.    పృధ్వి ముద్ర:  పద్మాసనంలో కూర్చుని, రెండు చేతుల ఉంగరం వేళ్లు మడిచి బొటనవేళ్లను వాటిపై ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకుని శ్వాసమీదే ధ్యాస నిలపాలి. ఐదు సెకన్ల పాటు గాలిని తీసుకుంటే పదిసెకన్ల పాటు గాలిని వదలాలి. అంటే వదిలేటప్పుడు రెండు రెట్ల గాలిని వదలాలి. వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.