Skip to main content

శ్రీ శ్రీ యోగ

శ్రీ శ్రీ యోగ మన శరీరాన్ని, మనసును మరియు ఆత్మను ఒకే పంధాలో తీసుకువచ్చే ఒకే సంపూర్ణమైన పద్ధతి. ఈ ప్రాచీనమైన విజ్ఞానం ఆధునిక యుగానికి అనువర్తించే విధంగా తీర్చి దిద్దిన ఒక మంచి మార్గము. రోజూ సాధన చేస్తే మన అంతర్గత శక్తిని పెంచి సంపూర్ణ సంక్షేమానికి ఉపయోగపడుతుంది.

యోగ సాధన వల్ల  సంపూర్ణ ఆరోగ్యం తో పాటు మానసిక స్పష్టత మరియు ఆధ్యాత్మికత సాధించగలము. సాంప్రదాయ ఆసనములతో పాటు ప్రాణాయామము మరియు ధ్యానం మొదలైన విషయాలతో శ్రీ శ్రీ యోగ పరిపూర్ణమైన సాధన అందిస్తుంది. సుమారు 4 నుండి 6 రోజుల వ్యవధిలో మొత్తం 10 గంటల శిక్షణతో అనుభవజ్ఞులైన  భోధకులు నేర్పించే ఈ పద్ధతులు ప్రతి నిత్యం మన ఇళ్ళలో మనము చేసుకునే విధంగా కూర్పబడింది. దీని ద్వారా సంపూర్ణ మైన అభివృద్ధి మనకు కలుగుతుంది.

ఈ కోర్సు సాధారణమైన యోగ నేర్చుకోవాలనే ఔత్సాహికులతో పాటు పరిపూర్ణమైన యోగ ఉపాసకులకు కూడా అనుయోగ్యమైనది. శారీరక స్థాయి లోనే కాకుండా సూక్ష్మ  స్థాయిలో కూడా ఉపయోగపడే విధంగా శ్రీ శ్రీ యోగ కూర్ప బడింది.  వీటి సహాయంతో ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన   మరియు సంతృప్తికరమైన జీవన శైలి అలవర్చుకోవచ్చు

Comments

Popular posts from this blog

సూర్యనమస్కారాలతో ఆ సమస్య తగ్గుతుంది...

రకరకాల ఒత్తిళ్లతో బిజీగా ఉండే మహిళలకు ఆరోగ్యవంతమైన జీవితం చాలా ముఖ్యం. మరి అదేలా సాధ్యం... రోజూ తీసుకునే ఆహారాలలో పోషక విలువలు అధికంగా ఉండాలి. అలానే రోజుకో ఆపిల్ పండు తీసుకోవాలి. కొన్ని రకాల వ్యాయామాలతో మహిళలు ఆరోగ్యపరమైన జీవితాన్ని పొందవచ్చును. మరి ఆ వ్యాయామాలేంటో.. ఎలా చేయాలో చూద్దాం... అధిక బరువు గలవారు బరువు తగ్గాలనుకుంటే.. స్క్వాట్స్ వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామం చేయడం వలన ఊపిరితిత్తులు, హృదయానికి ఎంతో మేలు చేస్తుంది. తద్వారా బరువు తగ్గుతారు. తరచుగా సూర్యనమస్కారాలు చేయడం వలన నడుము భాగం గట్టి పడుతుంది. అలానే మోకాళ్లపై భాగం దృఢంగా మారుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.  ప్లాంక్స్ వ్యాయామం చేస్తే.. కండారాలకు చాలా మంచిది. ముఖ్యంగా ఛాతీ, కటి వలయ భాగం దృఢంగా మారుతుంది. ఈ వ్యాయామంతో రక్తంలోని చక్కెర స్థాయిలు మెరుగుపడుతాయి. తద్వారా శ్వాస తీసుకోవడంలో అడ్డంకులు ఉండవు. అలానే నెలసరి సమస్యలు అదుపులో ఉంటాయి. వ్యాయామం చేయడం వలన ముడతల చర్మం కాస్త తాజాగా మారుతుంది.

కాయకల్ప యోగ భంగిమ దశలు మరియు ఉపయోగాలు

కాయకల్ప యోగ విధానం అనేది యోగ ప్రక్రియలో అత్యంత ప్రశంసనీయమైనది, జీవన శక్తిని మెరుగుపర్చడానికి ఈ యోగ విధానంను అభ్యసించడం జరుగుతుంది. కాయకల్ప యోగ భంగిమల ప్రాథమిక లక్ష్యం- శరీర విధానాన్ని గాడిలో పెట్టడం, సహజంగానే వృద్దాప్య ప్రక్రియను మందగింపచేసి, జీవిత కాలాన్ని పెంచుతుంది. యోగ అనేది భౌతిక జీవితం మరియు స్మారక స్థితితో కూడుకొని ఉంటుంది. కాయకల్ప యోగ విధానంను సాధన చేయడం ద్వారా లైంగిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిలోకి రూపాంతరం చెందించవచ్చు. కాయకల్ప యోగ విధానం యొక్క నియమావళి కాయకల్ప యోగ, నరాలు సరైన విధంగా పని చేయడానికి మరియు శరీర కేంద్ర నాడీ వ్యవస్థని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. యోగ పద్దతిలో "క్రౌన్ చర్కా" అనే ఆసనం వుంటుంది, దీనిని నుదుటి మధ్య భాగంలో ఉంచుతారు అది శక్తి ప్రవాహంపై ప్రభావం చూపుతుంది. ఈ సాధనను ఆచరించడం వలన మనం ఆరోగ్యకరమైన శరీరంతో పాటు ప్రశాంతమైన మనస్సు కలిగి ఉండేలా ప్రోత్సహిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, కాయకల్ప నియమావళి వలన సాధకుడు శరీర దారుడ్యం మరియు ఆధ్యాత్మికంగా కూడా సంతృప్తి పొందేలా చేస్తుంది. కాయకల్ప యోగ భంగిమల అనుసరణ     కాయకల్ప యోగ శ్వాససంబంధిత వ్యాయామాలత...

బ్రెయిన్ షార్ప్ గా ఉండాలంటే ఈ యోగసనాలు చేయండి

సాధారణంగా యోగలో కొన్ని భంగిమలున్నాయి. వీటినే ‘ఆసనాలు' అని అంటుంటారు. ఈ ప్రత్యేక స్థానాలు(పొజిషన్స్) లేదా ప్రత్యేక ఆసనాలతో మీ శరీరంలో వివిధ భాగాలకు రక్త ప్రసరణ అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. ఈ ఆసనాలు మానవ శరీరంలో ప్రభావితం అయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యలను నిరోధించడానికి సహాయపడుతాయి.  యోగసనాలలో ఒక ముఖ్యమైన వాస్తవాల్లో ఒకటి ధ్యానం మరియు బ్రీతింగ్ ను కంట్రోల్ చేయడం. ఇది మొదడు యొక్క పనితీరును మెరుగుపరచడానికి గొప్పగా సహాయపడుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం ప్రతి రోజు కనీసం 20 నిముషాలు యోగ చేయడం వల్ల మీ పనితనం మెరుగుపడుతుంది మరియు మీ వర్కింగ్ మెమరీకూడా మెరుగ్గా ఉంటుంది. మెదడు చురుకుగా ఉండటం కోసం వివిధ రకాల యోగాసనాలున్నాయి. వీటిని మీరు రెగ్యులర్ గా ప్రతి రోజూ సాధన చేసినట్లైతే మీరు ఒక ఖచ్చితత్వం స్థాయి చేరుకోవడంతో పాటు, మొదడు యొక్క సామర్థ్యం పెరుగుతుంది. మెదడు మీద యోగసనాల యొక్క ప్రయోజనాలు అపారంగా ఉన్నాయి. ఈ యోగసనాల్లో కొన్ని మీ మెదడు యొక్క పనితీరు సరైన కార్యాచరణకు సహాయపడుతుంది.  ఈ క్రింది స్లైడ్ లో ఇచ్చిన కొన్ని యోగసనాలను రెగ్యులర్ గా మీరు ప్రతి రోజూ అనుసరించాలి. ఈ యోగాసనాలన...