Skip to main content

ఆరోగ్య సంజీవని ‘యోగా’... యోగా ప్రాముఖ్యత ఏంటో తెలుసా...?

ఆరోగ్యం అంటే అందరూ శరీరానికి సంబంధించినదని అనుకుంటారు. కానీ నిజమైన ఆరోగ్యానికి మూలాలు మనస్సులో ఉంటాయి. మనసు నిర్మలంగా, నిశ్చలంగా ఉన్న చోట వ్యాధులకు ఆస్కారం చాలా తక్కువ. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు. మనం రకరకాల వ్యాయామాలు చెయ్యొచ్చు. పుష్టినిచ్చే ఆహారం తీసుకోవచ్చు. మందులు వేసుకోవచ్చు. ఎన్ని చేసినా ఇవన్నీ శరీరాన్ని తప్పించి మనసును తాకలేవు. 
 మనసును కూడా స్పర్శించి, శరీరాన్ని – మనస్సును బ్యాలెన్స్ చేసే శక్తి ఒక్క యోగాభ్యాసానికి మాత్రమే ఉంది. శరీరాన్ని, మనస్సును ఒక గాడిలో పెట్టి, రెండింటిని సమతుల్యంలోకి తెచ్చేదే యోగ. యోగాకున్న సమగ్రత, సంపూర్ణత్వం మరే ఇతర సాధారణ వ్యాయామాలకు ఉండదు. శారీరక వ్యాయామాన్ని మించిన ప్రయోజనాలున్నందునే పాశ్చాత్య ప్రపంచం కూడా ఇప్పుడు యోగా పట్ల ఆకర్షితులవుతున్నారు.

యోగాసనాల వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. శరీరం నుండి విషతుల్యాలు వేగంగా బయటకు వెళ్లిపోతాయి. అవయవాల పనితీరు బాగుంటుంది. మనసును శ్వాస ప్రక్రియపై లగ్నం చేసి, ఏకాగ్రత సాధన చెయ్యడం వల్ల మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యము పెరుగుతుంది. నానా రకాల ఒత్తిళ్లలో కూరుకుపోతున్న నేటి తరానికి యోగా అత్యంత ఆవశ్యకంగా మారింది.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యంతో, మానసిక బలంతో నిత్యం యవ్వనంగా జీవించవచ్చు. రోజు కొద్దిసేపు యోగా చేస్తే ఆసుపత్రికి పరుగు తీయాల్సిన అవసరం ఉండదు. ప్రపంచంలోని అనేక దేశాలు యోగా సాధన పట్ల ఆసక్తి చూపుతుంటే, మన దేశంలోని ఉన్న కొందరు యోగాను మతంతో ముడిపెట్టే ప్రయత్నం చేయడం దురదృష్టకరం. యోగా ఒక మతానికి సంబంధించినది కాదు ఇది కేవలం ఆరోగ్యానికి మాత్రమే సంబంధించిన ప్రక్రియ అనే విషయాన్ని గుర్తించాలి.

Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, బరువును తగ్గించే పృధ్వి ముద్ర!

వైట్ డిశ్చార్జ్.. కాలేజీ పిల్లల నుంచి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల వరకూ చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఈ ఇబ్బంది ఇన్ఫెక్షన్లుగా మారకుండా ఉండటానికి, అదుపులో ఉంచడానికి పృధ్విముద్ర ఆసనాన్ని ఆచరించండి.    పృధ్వి ముద్ర:  పద్మాసనంలో కూర్చుని, రెండు చేతుల ఉంగరం వేళ్లు మడిచి బొటనవేళ్లను వాటిపై ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకుని శ్వాసమీదే ధ్యాస నిలపాలి. ఐదు సెకన్ల పాటు గాలిని తీసుకుంటే పదిసెకన్ల పాటు గాలిని వదలాలి. అంటే వదిలేటప్పుడు రెండు రెట్ల గాలిని వదలాలి. వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.