Skip to main content

శరీర బరువును తగ్గించే యోగాసనాలు

చాలా మంది వారి బరువును పెంచుకొనుటకు లేదా తగ్గించుకొనుటకు యోగాను చేస్తున్నారు, కొంత మంది అధిక బరువుకు లేదా తక్కువ బరువుకు జన్యువులు కారణంగా చెబుతున్నారు. కానీ ఈ కారణం అన్ని సమయాల్లో నిజం కాకపోవచ్చు. జన్యువులు మాత్రమే కాకుండా మనం తినే ఆహరం, అనుసరించే జీవన విధానాలపై శరీర బరువు ఆధారపడి ఉంటుంది. సహజంగా శరీర బరువును తగ్గించుకోటానికి చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి, వీటిలో యోగా కూడా ఒకటి. ఇతర పద్దతులతో పోలిస్తే, బరువు తగ్గించుటలో యోగా భంగిమలు శక్తివంతంగా పని చేస్తాయి.

శరీర బరువును శక్తివంతంగా తగ్గించే కొన్ని యోగా భంగిమల గురించి ఇక్కడ తెలుపబడింది.

వక్రసనా


ఈ ఆసనంలో, సౌకర్యవంతంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోండి. ఇప్పుడు, మీ ఎడమ మోకాలిని పైకి అని, దానిపై మీ కుడి చేతిని ఉంచండి. ఈ సమయంలో ఎడమ దిశలో మీ శరీరాన్ని కొద్దిగా తిప్పండి. ఎడమ వైపుగా చేయాలనే నియమం ఏమి లేదు కుడి వైపుగా కూడా ఈ భంగిమను రోజు అనుసరించటం వలన శరీర బరువు మరియు అధిక కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గుతాయి.

భుజంగాసన (కోబ్రా భంగిమ)


ఈ రకమైన భంగిమలో, స్వతహాగా శరీరాన్ని వంచాలి, అనగా నుదురు భాగం భూమికి అనుకునేలా నెలపై పడుకోండి. ఆ తరువాత మీ అర చేతులను నెలపై ఉంచి శరీర సగభాగాన్ని లేపండి, మీ కాళ్ళను అలానే చాపి, పైన పటంలో తెలిపిన విధంగా కాలి యొక్క బొటన వేలును నెలకు తాకి ఉంచండి. ఈ భంగిమను చేసిన తరువాత, గాలిని పీల్చండి, వదలండి. ఈ విధంగా చేయటం వలన మీ శరీర బరువు తగ్గుతుంది, ఈ భంగిమ చూడటానికి పాము వాలే ఉండటం వలన కోబ్రా భంగిమ అని కూడా అంటారు.

పాదహస్తాసన


ఈ రకం ఆసనంలో ముందుగా నిటారుగా నిలబడండి, తరువాత నెమ్మదిగా వంగుతూ కాలి యొక్క వెళ్ళను పట్టుకోండి. తరువాత, పాదాల కిందకు మీ చేతులను చాచి, పాదం యొక్క మధ్య భాగాన్ని చేతులతో తాకేలా ప్రయత్నించండి. ఈ ఆసనాన్ని అనుసరించే సమస్యంలో మీ చేతులను చాచి ఉంచండి. ఇలా కాస్త సమయం పాటూ ఉండి, తిరిగి మాములు స్థానానికి చేరండి. ఈ ఆసనాన్ని రోజు చేయటం వలన శరీర బరువు తగ్గుతుంది.

ధనురాసన


ఈ రకమైన ఆసనాన్ని ''బౌ'' అని కూడా అంటారు. ఈ ఆసనంలో, నేలపై మీ పొట్టను తాకించేలా పడుకోవాలి, తరువాత మీ చేతులను వెనక్కి చాపి, ఇదే సమయంలో కాళ్ళను పైకి ఎత్తి, దీర్ఘమైన శ్వాసను తీసుకుంటూ చేతులతో కాళ్ళను పట్టుకోవాలి. ఈ భండిమలో 30 సెకన్ల పాటూ ఉండి వదలాలి.

సేతుభంద్


ఈ రకమైన ఆసనంలో, నేలపై పడుకొని పటంలో చూపిన విధంగా పాదాలను నెలపై పెట్టి, మోకాలిని వంచాలి. మీ పదాలు మరియు పిరుదులకు మధ్య ఉన్న దూరం, మీ చేతులకు కూడా సమాన దూరంలో ఉండేలా చూసుకోండి. ఇపుడు, మీ శరీరాన్ని పైకి లేపండి, ఇలా 5 నుండి 10 నిమిషాల పటు ఉండండి. ఈ రకమైన ఆసనం వలన బరువ తగ్గటమే కాకుండా, తొడలకు, పిరుదులకు మంచి మసాజ్'లా చేస్తాయి.

ఇక్కడ తెలిపిన యోగాసనాలు, శరీర బరువును తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తాయి. కానీ ఈ ఆసనాలను నిపుణులు లేదా వీటిలో అవగాహన కలిగిన వారి సమక్షంలో లేదా శిక్షణ తీసుకున్న తరువాత అనుసరించటం చాలా మంచిది..





Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, బరువును తగ్గించే పృధ్వి ముద్ర!

వైట్ డిశ్చార్జ్.. కాలేజీ పిల్లల నుంచి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల వరకూ చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఈ ఇబ్బంది ఇన్ఫెక్షన్లుగా మారకుండా ఉండటానికి, అదుపులో ఉంచడానికి పృధ్విముద్ర ఆసనాన్ని ఆచరించండి.    పృధ్వి ముద్ర:  పద్మాసనంలో కూర్చుని, రెండు చేతుల ఉంగరం వేళ్లు మడిచి బొటనవేళ్లను వాటిపై ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకుని శ్వాసమీదే ధ్యాస నిలపాలి. ఐదు సెకన్ల పాటు గాలిని తీసుకుంటే పదిసెకన్ల పాటు గాలిని వదలాలి. అంటే వదిలేటప్పుడు రెండు రెట్ల గాలిని వదలాలి. వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.