Skip to main content

యోగ సాధనతో వ్యాధులు దూరం !

పతంజలి మహర్షి యోగని ఎనిమిది భాగాలుగా విభజించారు. వీటిలో మొదటి అయిదు ధ్యానసాధనలో బాహ్యంగా సహాయపడితే, చివరి మూడు అంతర్గత శక్తులను వెలికి తీసేందుకు దోహదం చేసి, యోగ సాధన ఫలాలను యిస్తాయి.

ఎనిమిది విధానాలు:



యమ: 


ఒక సైనికుడి ఆయుధాలను అప్పగించినప్పుడు ముందుగా క్రమశిక్షణ నేర్పుతారు. ఎప్పుడు వాటిని ప్రయోగించాలి అనే విషయంతో పాటు సమాజ పరిరక్షణకు, శాంతి స్థాపనకు ఎలా ఉపయోగపడాలనేది అవగతం చేసుకుంటారు. జీవిత విధానంపై, ప్రవర్తనపై నిర్దిష్టమైన క్రమశిక్షణ వుండాలి.
ఆ అయిదు అంశాలు:
1. అహింస
2. సత్యం
3. బ్రహ్మచర్యం
4. దొంగతనానికి పాల్పడకపోవడం
5. కోరికలను అదుపులో ఉంచుకోవడం
ఈ అయిదు అంశాలను పాటించినప్పుడే యోగ సాధకుడు ముందు అడుగు వేయగలడు.

నియమాలు: 


యోగ సాధన ఈ దేహంతోనే చేయవలసి వుంటుంది. అందువల్ల శరీరం రోగగ్రస్తం కాకూడదు. ఆరోగ్యంగా, ధృఢంగా వుండాలి. ప్రకృతిలోని ఎటువంటి మార్పులని అయినా తట్టుకునే శక్తి కలిగి వుండాలి. వాంఛలు అదుపులో వుండాలి. సాధకుడు తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించగలగాలి. ఆ అనంతశక్తిని తెలుసుకోవాలనే జ్ఞానతృష్ణ కలిగి వుండాలి. పతంజలి మహర్షి సూచించిన అయిదు నియమాలు ఇవి:-

1. పరిశుభ్రత
2. సంతృప్తి
3. సంయమం
4. ధర్మశాస్త్రాల అధ్యయనం
5. ప్రతి చర్యను భగవత్‌ అర్పితం చేయడం

ఈ అయిదు నియమాలను పాటించడంతో సాధకుడికి మానసికంగా, శారీరకంగా ప్రయోజనం చేకూరుతుంది.

ఆసనాలు:


 ప్రస్తుత కాలంలో యోగ పేరు చెప్పగానే అందరూ యోగాసనాల గురించే మాట్లాడుతున్నారు. హఠయోగంలో ఆసనాలు ఒక భాగం.
పతంజలి మహర్షి ఏనాడూ యోగాసనాలు పాటించాలని ఖచ్చితంగా చెప్పలేదు. కేవలం విశ్రాంతిగా, స్థిరంగా కూర్చునే ఆసనాన్ని మాత్రమే సూచించారు పతంజలి. పద్మాసనం కూడా అనుమతించారు. ఆసనాలతో శరీరంలోని భౌతికపరమైన ఇబ్బందులు తొలగుతాయి. వేడి, చలిలాంటి ఉష్ణోగ్రత స్థితులపై అదుపు లభిస్తుంది. హఠయోగంలో పేర్కొన్న ఆసనాలను పాటించడంలో ఎటువంటి వ్యతిరేకత లేదు కాని, అత్యున్నతమైన సమాధిస్థితిని చేరుకోవడానికి యిది ప్రామాణికం కాదు.

ప్రాణాయామం:


 హఠ యోగంలో పేర్కొన్న వ్యాయామాల గురించి, పతంజలి మహర్షి ఎలా నొక్కి చెప్పలేదో, అలాగే శ్వాసక్రియ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పలేదు. కేవలం ఏకాగ్రతతో, నెమ్మదిగా, గాఢంగా ఊపిరి పీల్చి వదలడం మాత్రమే ఆయన సూచించారు. ఇలా ఉచ్ఛాశ్వ, నిశ్వాసక్రియ చేయడం వల్ల ఇంద్రియాలపై అదుపు ఏర్పడుతుంది. ఏకాగ్రతని వ్ధృది చేస్తుంది. అనునిత్యం సాధనం చేయడం వల్ల మాత్రమే యిది సాధ్యపడుతుంది.

Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, బరువును తగ్గించే పృధ్వి ముద్ర!

వైట్ డిశ్చార్జ్.. కాలేజీ పిల్లల నుంచి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల వరకూ చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఈ ఇబ్బంది ఇన్ఫెక్షన్లుగా మారకుండా ఉండటానికి, అదుపులో ఉంచడానికి పృధ్విముద్ర ఆసనాన్ని ఆచరించండి.    పృధ్వి ముద్ర:  పద్మాసనంలో కూర్చుని, రెండు చేతుల ఉంగరం వేళ్లు మడిచి బొటనవేళ్లను వాటిపై ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకుని శ్వాసమీదే ధ్యాస నిలపాలి. ఐదు సెకన్ల పాటు గాలిని తీసుకుంటే పదిసెకన్ల పాటు గాలిని వదలాలి. అంటే వదిలేటప్పుడు రెండు రెట్ల గాలిని వదలాలి. వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.