Skip to main content

వృద్ధాప్యంలో మతిమరుపును యోగాతో నివారించటం ఎలా?

యోగాను దీర్ఘకాలం చేస్తే మీ మెదడు ఆకారాన్ని మార్చేసి, మీ మెదడు పనితీరును వృద్ధాప్యంలో మందగించకుండా చేస్తుందని పరిశోధనల్లో వెల్లడయింది.

 పరిశోధకులు ఒక యోగాలో నిపుణురాలైన వృద్ధమహిళ మెదడును చిత్రీకరించినపుడు, ఈ యోగినుల మెదడు ఎడమ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఎక్కువ మందంగా ఉందని తెలుసుకున్నారు. మెదడులో ఈ భాగాలు శ్రద్ధకి, జ్ఞాపకశక్తికి కారణమవుతాయి. 

యోగ ముద్రలు-వాటి ఆరోగ్య ప్రయోజనాలు

 వయస్సు మీరుతున్నప్పుడు, మెదడు ఆకారం, పనితీరులో మార్పులొచ్చి ఇదివరకు ఉన్నంత శ్రద్ధ, జ్ఞాపకశక్తి ఉండవు. అలాంటి ఒక మార్పు మెదడులోని సెరెబ్రల్ కోర్టెక్స్ పల్చనవటం. శాస్త్రవేత్తలు ఇదే మన మతిమరుపుకి కూడా కారణమని తేల్చారు.

మరి, ఈ మార్పులను ఎలా తగ్గించి, నెమ్మది చేయాలి? 

ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్ జర్నల్ లో ప్రచురించబడ్డ ఈ ఫలితాలు, జవాబు యోగా అభ్యాసంలో ఉండొచ్చని తెలుపుతోంది. 

ఇస్రాయెలిటా ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ఆస్పత్రికి చెందిన ఎలిసా కొజాసా అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ, "కండరాలలాగానే మెదడు కూడా శిక్షణ వల్ల ఎదుగుతుంది," అని వివరించారు. 

నగ్నంగా యోగ చేస్తే పొందే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు 

"ఏదైనా సమకాలీన శిక్షణలాగానే , యోగా వల్ల కూడా శ్రద్ధ, ఏకాగ్రత పెరిగే అవకాశం ఉంది," అని జతచేసారు. పరిశోధక బృందం యోగా చేసే వృద్ధుల్లో, చేయని ఆరోగ్యంగా వున్నవారి మెదడు ఆకార మార్పులు, పనితీరును విశ్లేషించి, తేడాలు ఏమున్నాయో కనుగొనటానికి ప్రయత్నించారు.

వారు కొంతమంది యోగా అభ్యాసం చేసే మహిళలను (యోగినులు అనికూడా అంటారు) నియమించుకున్నారు. వీరు వారానికి రెండుసార్లు, ఎనిమిదేళ్ళ పాటు యోగా అభ్యసించారు. వీరికి ఇంతకుముందే 15ఏళ్ళ అనుభవం కూడా ఉన్నది. 

పరిశోధకులు యోగినులను, యోగా ఎప్పుడూ చేయని స్త్రీలను పోల్చినప్పుడు, మామూలు వారు కూడా యోగా చేసేవారితో సమానమైన వయస్సు కలిగి ఉన్నవారు మరియు ఒకే శారీరక ధారుఢ్యత కలిగినవారు(60 ఏళ్ళకు పైబడినవారు). 

శాస్త్రవేత్తలు అభ్యర్థులందరి మెదడులను మాగ్నటిక్ రెసొనెస్ ఇమేజింగ్ టెక్నిక్ వాడి స్కానింగ్ చేసి వారి మెదడులో తేడాలు పరీక్షించారు. ఇస్రాయెలిటా ఆల్బర్ట్ ఐన్ స్టీన్ ఆస్పత్రి నుంచి రుయి అఫోన్సో మాట్లాడుతూ, "శ్రద్ధ, జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడు ప్రాంతాలలో, యోగినుల ఎడమ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మందం ఎక్కువగా పెరిగింది," అని తెలిపారు.








Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, బరువును తగ్గించే పృధ్వి ముద్ర!

వైట్ డిశ్చార్జ్.. కాలేజీ పిల్లల నుంచి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల వరకూ చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఈ ఇబ్బంది ఇన్ఫెక్షన్లుగా మారకుండా ఉండటానికి, అదుపులో ఉంచడానికి పృధ్విముద్ర ఆసనాన్ని ఆచరించండి.    పృధ్వి ముద్ర:  పద్మాసనంలో కూర్చుని, రెండు చేతుల ఉంగరం వేళ్లు మడిచి బొటనవేళ్లను వాటిపై ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకుని శ్వాసమీదే ధ్యాస నిలపాలి. ఐదు సెకన్ల పాటు గాలిని తీసుకుంటే పదిసెకన్ల పాటు గాలిని వదలాలి. అంటే వదిలేటప్పుడు రెండు రెట్ల గాలిని వదలాలి. వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.