Skip to main content

కంప్యూటర్‌తో ఎంతసేపు పని చేస్తున్నారు...?

ప్రస్తుతం చాలామంది కంప్యూటర్ ముందు కూర్చుని దాదాపు ఎనిమిది నుంచి పది గంటలవరకు పని చేస్తున్నారు. ఇది నిత్యకృత్యం అయిపోతోంది. దీంతో మానసికమైన ఒత్తిడి, శారీరకమైన ఒత్తిడి రెండూ పెరిగి పోతున్నాయి. వెంటనే రాత్రి అయ్యేటప్పటికి అలసటకు గురౌతుంటారు.

కంప్యూటర్ ముందు కూర్చుని తదేకంగా చూస్తూ ఉండటం మూలాన కళ్ళకు శ్రమ ఎక్కువ కలుగుతోంది. అలాగే కొన్ని కానరాని సమస్యలకు లోనయ్యే ప్రమాదం ఉంది.

నష్టాలు: 


కంప్యూటర్‌తో ఎక్కువ సేపు పనిచేసేవారిలో జ్ఞాపకశక్తి లోపించడం, దూరదృష్టి లోపం, చిరాకు పడటం, వెన్నునొప్పి, అనవసరమైన అలసట మొదలైనవి ఏర్పడతాయి. కంప్యూటర్‌తో పని చేయడం అధికంగా ఉంటే మస్తిష్కంతోబాటు కళ్ళు కూడా బాగా అలసిపోతాయి. దీంతో నిద్రతో ఉపశమనం కలుగుతుందనుకుంటే పొరబాటే.

అత్యధిక సమయం కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసేవారిలో దృష్టి లోపం ఏర్పడినట్లు వైద్యులు చెబుతున్నారు. అలాంటివారు కళ్ళజోడును ఎక్కువగా ధరిస్తున్నారని వైద్యులు తెలిపారు. ఇదికాకుండా జ్ఞాపకశక్తి కూడా కోల్పోతున్నట్లు వారి పరిశోధనల్లో తేలినట్లు పరిశోధకులు తెలిపారు.

పని ఒత్తిడి కారణంగా వారిలో చిరాకు పాళ్ళు అధికంగా ఏర్పుడుతుంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారు కార్యాలయంలోని కొపాన్నంతటిని ఇంట్లోని వారిపై చూపుతుంటారని వారు పేర్కొన్నారు. సహజంగా కంప్యూటర్‌తో ఎక్కువ సమయం గడిపేవారిలో ఇలాంటి బాధలు ఉత్పన్నమౌతాయని వారంటున్నారు.

జాగ్రత్తలు పాటించండిలా...!


ముందుగా మీ కంప్యూటర్‌ను మీ కళ్ళకు సమాంతరంగా ఉంచుకోండి. దీంతో మీ కళ్ళకు శ్రమ తగ్గించినవారవుతారు. ముఖ్యంగా మీ కంప్యూటర్‌ను మీరు కూర్చునే స్థానం నుంచి కనీసం రెండు అడుగుల నుండి మూడు అడుగుల దూరంలో ఉంచండి. మరో విషయం ఏంటంటే కంప్యూటర్‌తో నిరంతరం పని చేస్తుంటే మధ్య మధ్యలో కనీసం 5 నుంచి 10 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో దృష్టిని మరల్చండి. దీంతో దూర దృష్టి లోపం రాదంటున్నారు వైద్యులు.


Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, బరువును తగ్గించే పృధ్వి ముద్ర!

వైట్ డిశ్చార్జ్.. కాలేజీ పిల్లల నుంచి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల వరకూ చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఈ ఇబ్బంది ఇన్ఫెక్షన్లుగా మారకుండా ఉండటానికి, అదుపులో ఉంచడానికి పృధ్విముద్ర ఆసనాన్ని ఆచరించండి.    పృధ్వి ముద్ర:  పద్మాసనంలో కూర్చుని, రెండు చేతుల ఉంగరం వేళ్లు మడిచి బొటనవేళ్లను వాటిపై ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకుని శ్వాసమీదే ధ్యాస నిలపాలి. ఐదు సెకన్ల పాటు గాలిని తీసుకుంటే పదిసెకన్ల పాటు గాలిని వదలాలి. అంటే వదిలేటప్పుడు రెండు రెట్ల గాలిని వదలాలి. వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.