Skip to main content

"పైల్స్"ను దూరం చేసే "పవన ముక్తాసనం"

మారుతున్న ఆహారపు అలవాట్లు, విపరీతమైన పని ఒత్తిడి, తీవ్రమైన మానసిక భావోద్వేగాల కారణంగా... ఆధునిక కాలంలో చాలామంది పైల్స్ (మొలలు) రుగ్మతతో బాధపడుతున్నారు. గతంలో ఈ రుగ్మత మనదేశంలో చాలా తక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం ఈ రుగ్మత బారిన పడుతున్నవారిలో మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు.

పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడిన వారిలో ఈ సమస్య అధికంగా వేధిస్తోందని కూడా వైద్యుల అభిప్రాయం. కాగా, అనేక రకాల వ్యాధులను నయం చేయడంలో యోగాసనాలు కూడా ప్రస్తుతం చాలా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పైల్స్ వ్యాధి నివారణలోనూ, జ్ఞాపక శక్తిని పెంచుకోవడంలోనూ ఉపయోగపడే "పవన ముక్తాసనం" గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.

ఈ ఆసనం ఎలా వేయాలంటే... వెల్లకిలా పడుకుని, రెండు కాళ్లను ఒకదానితో ఒకటి దగ్గరగా కలిపి కిందికి చాచి ఉంచాలి. రెండు చేతులు నేలకు ఆన్చి నడుముకి దగ్గరగా ఉంచుకోవాలి. ఇప్పుడు మెల్లగా కుడి మోకాలును ఛాతి దాకా మడిచి రెండు చేతులతో మోకాలును పట్టుకోవాల్సి ఉంటుంది.

ఆ తరువాత శ్వాసను వదులుతూ, తల భాగాన్ని పైకి లేపి గవదను తాకించాలి. ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ పూర్వస్థితిలోకి రావాలి. మరలా శ్వాసను వదులుతూ ఇలాగే ఎడమకాలితో కూడా చేయాలి. ఇలా రెండు కాళ్లతో చేసిన తరువాత మోకాళ్లను ఒకేసారి మడవాలి. గవదను మోకాళ్లతో తాకించాలి. ఇలా ఒకటి నుంచి పదిసార్లు చేయవచ్చు. ఆ తరువాత శవాసనంలోకి మారి విశ్రాంతి తీసుకోవాలి.

ఈ పవన ముక్తాసనం వేయడం వల్ల పైల్స్ బాధ నుండి విముక్తి పొందటమేగాకుండా, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. జ్ఞాపకశక్తిని పొంపొందిస్తుంది. గ్యాస్ ట్రబుల్ రాకుండా కాపాడుతుంది. నీళ్లు తాగిన తరువాత, కాలకృత్యాలు తీర్చుకోవటానికి ముందుగానే ఈ ఆసనం వేస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది.

Comments

Popular posts from this blog

నిద్రలేచిన వెంటనే చేయాల్సిన 5 యోగాసనాలు

ఈ ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యం మీద అవగాహన, బాధ్యత కలిగి ఉండాలి. ఆరోగ్యంగా ఉండటానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. అందుకు యోగా బాగా సహాయపడుతుంది. యోగా చేయాలంటే బద్దకిస్తున్నారా? అయితే మీకు సహాయం చేయడానికి మేమున్నాం.  ప్రతి రోజూ ఉదయం యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని, చాలా మందికి తెలుసు, అయితే ఎంత మంది ఈ పద్దతిని అనుసరిస్తున్నారు? ఖచ్చితంగా ఏ కొద్ది మాత్రమే రోజూ యోగను సాధన చేస్తుంటారు.  మరికొద్దిమంది, యోగ మొదలు పెడతారు ఒక నెలలో, రెండు నెలలో ప్రాక్టీస్ చేసి, ఆపేస్తుంటారు. ఆ తర్వాత ఐదు, ఆరు నెలలు బ్రేక్ తీసుకుని, తిరిగి ప్రారంభిస్తుంటారు. రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే పరగడపుతో యోగాను ప్రాక్టీస్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. రోజూ యోగ సాధన చేయడం వల్ల శరరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. యోగ అనేది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు, దీని వల్ల ఆస్త్మా, వెన్నునొప్పి, ఇతర శ్వాస సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు. నిద్రలేచిన వెంటనే చేయాల్సిన కొన్ని యోగాసనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. 1.లార్డ్ ఆఫ్ డ్యాన్స్ ఫోజ్ (నటరాజ ఆసనం):  నటరాజాసన (నట-డ్యాన్స్, రాజ-కింగ్, ఆసన-భంగిమ)...

బ్రెయిన్ షార్ప్ గా ఉండాలంటే ఈ యోగసనాలు చేయండి

సాధారణంగా యోగలో కొన్ని భంగిమలున్నాయి. వీటినే ‘ఆసనాలు' అని అంటుంటారు. ఈ ప్రత్యేక స్థానాలు(పొజిషన్స్) లేదా ప్రత్యేక ఆసనాలతో మీ శరీరంలో వివిధ భాగాలకు రక్త ప్రసరణ అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. ఈ ఆసనాలు మానవ శరీరంలో ప్రభావితం అయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యలను నిరోధించడానికి సహాయపడుతాయి.  యోగసనాలలో ఒక ముఖ్యమైన వాస్తవాల్లో ఒకటి ధ్యానం మరియు బ్రీతింగ్ ను కంట్రోల్ చేయడం. ఇది మొదడు యొక్క పనితీరును మెరుగుపరచడానికి గొప్పగా సహాయపడుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం ప్రతి రోజు కనీసం 20 నిముషాలు యోగ చేయడం వల్ల మీ పనితనం మెరుగుపడుతుంది మరియు మీ వర్కింగ్ మెమరీకూడా మెరుగ్గా ఉంటుంది. మెదడు చురుకుగా ఉండటం కోసం వివిధ రకాల యోగాసనాలున్నాయి. వీటిని మీరు రెగ్యులర్ గా ప్రతి రోజూ సాధన చేసినట్లైతే మీరు ఒక ఖచ్చితత్వం స్థాయి చేరుకోవడంతో పాటు, మొదడు యొక్క సామర్థ్యం పెరుగుతుంది. మెదడు మీద యోగసనాల యొక్క ప్రయోజనాలు అపారంగా ఉన్నాయి. ఈ యోగసనాల్లో కొన్ని మీ మెదడు యొక్క పనితీరు సరైన కార్యాచరణకు సహాయపడుతుంది.  ఈ క్రింది స్లైడ్ లో ఇచ్చిన కొన్ని యోగసనాలను రెగ్యులర్ గా మీరు ప్రతి రోజూ అనుసరించాలి. ఈ యోగాసనాలన...

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...