Skip to main content

లాఫర్(నవ్వు) యోగ యొక్క 5 ప్రయోజనాలు

మీరు ఒత్తిడి,విచారం మరియు నిరుత్సాహపడుతున్నరా? మీరు మీ జీవితంలో మరింత నవ్వు మరియు ఆనందం తీసుకురావాలని అనుకుంటున్నారా? ఇక్కడ లాఫర్ యోగ మీ ఆరోగ్యం కొరకు ప్రయోజనాలను అందిస్తుంది.

1. మంచి మూడ్ మరియు మరింత నవ్వు


 మీ వ్యక్తిగత జీవితం,వ్యాపార జీవితం లేదా సామాజిక జీవితం అనే ప్రతిదీ మీ మూడ్ మీద ఆధారపడి ఉంటుంది.మీ మూడ్ మంచిగా ఉంటే,మీరు అన్ని విషయాలు చాలా బాగా చేయవచ్చు.నవ్వు యోగ వలన మీ మెదడు కణాలు నుండి ఎండార్ఫిన్లు అనే నిర్దిష్ట రసాయనాలు విడుదల అయ్యి నిమిషాల్లో మూడ్ మార్చడానికి సహాయపడుతుంది.మీరు సంతోషంగా మరియు రోజంతా మంచి మూడ్ లో ఉంటారు. అలాగే మీలో సాధారణంగా కంటే ఎక్కువ నవ్వు కనిపిస్తుంది. 

2. ఆరోగ్యకరమైన వ్యాయామం ఒత్తిడిని ఓడిస్తుంది 


నవ్వు యోగ ఆరోగ్యకరమైన మరియు శక్తివంతమైన అనుభూతిని ఎక్కువగా కలిగిస్తుంది. ఇది శరీరం మరియు మెదడుకు ఎక్కువ ఆక్సిజన్ అందించే ఒక ఏరోబిక్ వ్యాయామం(గుండె వ్యాయామం)వంటిది. నవ్వు యోగ ఒకేసారి భౌతిక,మానసిక మరియు భావోద్వేగ ఒత్తిడి తగ్గించే ఒక వ్యాయామం అని చెప్పవచ్చు. 

3. ఆరోగ్య ప్రయోజనాలు 


మీరు జబ్బుపడి ఉంటే మీ జీవితం ఆనందంగా ఉండదు. నవ్వు యోగ అనారోగ్యంను నిరోదించే రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. అంతేకాకుండా రక్తపోటు,గుండె వ్యాధి,మధుమేహం,నిరాశ,ఆర్థరైటిస్, అలెర్జీలు,ఆస్తమా,బ్రోన్కైటిస్,వెన్నునొప్పి,ఫైబ్రోమైయాల్జియా,పార్శ్వపు నొప్పి,తలనొప్పి,ఋతు లోపాలు, క్యాన్సర్ మరియు అనేక ఇతర వ్యాధులను నయం చేయుటలో సహాయపడుతుంది. 

4. జీవన ప్రమాణం 


జీవన ప్రమాణం అనేది మంచి స్నేహితుల నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు జాగ్రత్త మరియు షేరింగ్ సంబంధం కలిగి ఉంటారు. నవ్వులు అనేవి త్వరగా వ్యక్తులతో కనెక్ట్ అయ్యేందుకు సహాయపడతాయి. అంతేకాక సంబంధాలను మెరుగుపరచటానికి ఒక సానుకూల శక్తిగా ఉంటుంది. మీరు ఎక్కువగా నవ్వితే, మిమ్మల్ని చాలా మంది స్నేహితులు ఆకర్షిస్తారు. 

5. చాలెంజింగ్ సమయంలో సానుకూల వైఖరి 


సమయం మంచిగా ఉన్నప్పుడు అందరు నవ్వుతారు. కానీ సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు ఎలా నవ్వుతారు? నవ్వులు ప్రతికూల పరిస్థితుల్లో మరియు ప్రతికూల ప్రజలను ఎదుర్కోవటానికి ఒక పాజిటివ్ దృక్పదంను సృష్టించడానికి దోహదపడతాయి. అంతేకాక కష్టం కాలంను అధిగమించడానికి విశ్వాసం మరియు ఆశావాదంను ఇస్తుంది.



Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, బరువును తగ్గించే పృధ్వి ముద్ర!

వైట్ డిశ్చార్జ్.. కాలేజీ పిల్లల నుంచి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల వరకూ చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఈ ఇబ్బంది ఇన్ఫెక్షన్లుగా మారకుండా ఉండటానికి, అదుపులో ఉంచడానికి పృధ్విముద్ర ఆసనాన్ని ఆచరించండి.    పృధ్వి ముద్ర:  పద్మాసనంలో కూర్చుని, రెండు చేతుల ఉంగరం వేళ్లు మడిచి బొటనవేళ్లను వాటిపై ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకుని శ్వాసమీదే ధ్యాస నిలపాలి. ఐదు సెకన్ల పాటు గాలిని తీసుకుంటే పదిసెకన్ల పాటు గాలిని వదలాలి. అంటే వదిలేటప్పుడు రెండు రెట్ల గాలిని వదలాలి. వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.