Skip to main content

అధిక రక్తపోటును నియంత్రించే 5 ముఖ్య యోగాసనాలు

యోగాసనాలను అనుసరించటం వలన అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. వీటి వలన వివిధ రకాల ఆరోగ్య సమస్యల వలన బహిర్గతమయ్యే లక్షణాలను లేదా వాటిని తగ్గించుటం, అధికరక్తపోటు లేదా అధిక రక్త పీడనం వంటి వాటిని నియంత్రణలో ఉంచుతుంది. యోగాను రోజు చేయటం వలన టెన్షన్ మరియు మానసిక, భౌతిక ఒత్తిడిల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా, వీటి వలన శరీర బరువు తగ్గటం మాత్రమె కాకుండా, ఆరోగ్యకర బరువును నిర్వహించేలా చేస్తుంది. వీటి ఫలితంగా, రక్త పీడనం కూడా తగ్గుతుంది.
రక్త పీడనాన్ని తగ్గించే యోగాసనాల గురించి కింద తెలుపబడింది.

వృక్ష భంగిమ


ఈ భంగిమను రోజు అనుసరించటం వలన బలంతో పాటూ, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ భంగిమలో, లోతైన శ్వాసను తీసుకొని, ముక్కు ద్వారా వదలటం వలన, ఊపిరిత్తిత్తులు పని తీరు మెరుగుపడుతుంది.

ఈ యోగాసనాన్ని అనుసరించుకు, రెండు కాళ్ళను తాకిస్తూ, నిటారుగా నిలబడండి. తరువాత, కుడి కాలును పైకి ఎత్తి, పాదాన్ని, నెమ్మదిగా ఎడమ కాలు యొక్క తోడ వద్ద ఉంచండి. ఇలా అనుసరించే సమయంలో మీ రెండు చేతులను పైకి ఎత్తి, నమస్కారం భంగిమలో ఉంచండి. ఇలా కొన్ని నిమిషాల పాటూ నిలబడి, లోతైన శ్వాసను తీసుకొని, వదలండి. తిరిగా సాధారణ స్థితికి వచ్చాకా, ఎడమ కాలిని ఎట్టి పైన తెలిపిన విధానాన్ని అనుసరించండి. ఈ ఆసనాన్ని రోజు అనుసరించటం వలన రక్తపీడనం అదుపులో ఉండటమే కాకుండా, శ్వాస వ్యవస్థ, శరీరం ఫిట్'గా కూడా ఉంటుంది.

విపరీతకరణి


ఈ ఆసనాన్ని, ''లెగ్ అప్ వాల్ పోస్'' అని కూడా అంటారు, ఈ ఆసనం వలన కళ్ళలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

ఈ ఆసనంలో వేల్లంకిల పడుకొని, రెండు కాళ్ళను పైకెత్తండి, అరచేతులతో పిరుదులను లేపండి, శరీర బరువు చేతులు, భుజాల పైన ఉండేలా చూసుకోండి, తరువాత నమ్మదిగా కాళ్ళను తిన్నగా వెనుకకు వంచండి. ఆసనంలో కొద్ది సమయం పాటు ఉన్న తరువాత, రెండు కాళ్ళ యొక్క మోకాళ్ళను మడచి, పిరుదులను నెమ్మదిగా నేలకు తాకించి, యధా స్థితికి రావాలి.

నమస్తే భంగిమ


ఈ ఆసనం చాలా సులభంగా అనుసరించవచ్చు. ఈ ఆసనంలో మొదటగా కాళ్ళను మడచి కూర్చోవాలి, రెండు చేతులను, నమస్తే భంగిమలో ఉంచి, చాతి ప్రాంతం దగ్గరగా ఉంచాలి. ఇదే సమయంలో, నెమ్మదిగా గాలిని పీలుస్తూ, వదలాలి.

 

చిన్నారుల భంగిమ


ఈ భంగిమలో, మోకాళ్ళను మడచి నేలపై కూర్చిండి, గాలిని పీలుస్తూ, తలను నేలకు తాకించండి. ఈ భంగిమలో 3 శ్వాసల పాటూ ఉండండి. తరువాత, తిరిగి గాలిని పీలుస్తూ, పూర్వపు స్థితికి రండి. ఈ ఆసనాన్ని కొన్ని సార్లు అనుసరించటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

 

శ్వాస వ్యాయామం


ఈ ఆసనంలో, వేలుతో ఎడమ/కుడి నాసికా రంధ్రాన్ని మూసి, ఒకే ఒక నాసికా రంధ్రంతో శ్వాస తీసుకోవాలి, ఇలా రెండు నాసికా రంధ్రాల ద్వారా అనుసరించాలి. ఈ ఆసనం వలన గుండె సంబంధిత అవయవాలు, నాడీ వ్యవస్థ, ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, అధిక రక్త పీడనం కూడా నియంత్రణలో ఉంటుంది.

సౌకర్యవంతమైన ప్రాంతంలో కూర్చొని, ఎడమ చేతిని, ఎడమ మోకాలి పై ఉంచండి. కుడి చేతి యొక్క ఉంగరపు వేలును, కుడి నాసికా రంధ్రంను మూసి, లోతైన శ్వాసను తీసుకోండి. ఇలా కొద్ది సమయం పాటు అనుసరించిన తరువాత, ఎడమ చేతి ఉంగరపు వేలుతో, ఎడమ నాసికా రంధ్రాన్ని మూసి, లోతైన స్వాసు తీసుకోండి. ఈ విధంగా కనీసం 5 నిమిషాల పాటూ అనుసరించండి.

అల్లోపతీ మందుల కన్నా, యోగా భంగిమలు రక్త పీడనాన్ని తగ్గించటమే కాకుండా, అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కానీ, ఈ యోగాసనాలను అనుసరించటానికి మందు, యోగా నిపుణులను లేదా అవగాహన ఉన్న వారి ద్వారా శిక్షన పొందటం మంచిది.


Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, బరువును తగ్గించే పృధ్వి ముద్ర!

వైట్ డిశ్చార్జ్.. కాలేజీ పిల్లల నుంచి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల వరకూ చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఈ ఇబ్బంది ఇన్ఫెక్షన్లుగా మారకుండా ఉండటానికి, అదుపులో ఉంచడానికి పృధ్విముద్ర ఆసనాన్ని ఆచరించండి.    పృధ్వి ముద్ర:  పద్మాసనంలో కూర్చుని, రెండు చేతుల ఉంగరం వేళ్లు మడిచి బొటనవేళ్లను వాటిపై ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకుని శ్వాసమీదే ధ్యాస నిలపాలి. ఐదు సెకన్ల పాటు గాలిని తీసుకుంటే పదిసెకన్ల పాటు గాలిని వదలాలి. అంటే వదిలేటప్పుడు రెండు రెట్ల గాలిని వదలాలి. వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.