Skip to main content

జ్ఞాపక శక్తిని కాపాడే 10 నిమిషాలు పాటూ చేసే సులభ యోగాభ్యాసనాలు

మతి భ్రమనాన్ని మరియు మతిమరుపు లాంటి లక్షణాలను దూరంగా ఉంచడానికి మనుషులు బహుశా ఇప్పటికే అన్ని విధాల ప్రయత్నిస్తూ, మరిన్ని కొత్త పద్దతులను అనుసరిస్తుంటారు. అంటే తమ మెదడును కాపాడుకోవటానికి మంచి నిద్ర మరియు వ్యాయామం లాంటి వాటిని చేస్తుంటారు. ఇప్పుడు పరిశోధనల వలన తేలిందేమిటంటే యోగ కూడా మీ మెదడును కాపాడుకోవటానికి ఒక మంచి సాధనమని.

యోగ ఎలా మెదడును మేల్కొల్పుతుంది?


యోగాభ్యాసం చేసేటప్పుడు మీరు శరీరాన్ని మాత్రమే కదపరు. అలా చేస్తున్నప్పుడు మీరు శ్వాశను పీల్చుకోవటం మరియు వదలటం మాత్రమే కాకుండా, అంగ విన్యాసం గురించి కూడా గుర్తుంచుకుంటారు. ఇతర వ్యాయామాలను అనగా పరుగెత్తడం లాంటివి చేస్తున్నప్పుడు మీ ధ్యాసకు చుట్టుపక్కల జరిగే వాటి వలన భంగం కలుగుతుంది. మీరు త్రికోనాసన భంగిమలో ఉన్నప్పుడు పరధ్యానంగా ఉన్నట్లయితే మీ ముఖం నేలకద్దుకుంటుంది.

మానసిక ఒత్తిడి మీకు త్వరగా ముసలితనం రావటానికి కారణమే కాకుండా, మీ నిద్రను భంగం చేస్తుంది. హానికరమైన గడ్డలను ఎక్కువ చేస్తుంది. మీ జన్యు వనరులకు హాని చేస్తుంది. అంతేకాకుండా, శరీరం ముడతలు పడటానికి కారణం అవుతుంది. పురాతన పరిశోధనల వలన తెలిసిందేమిటంటే, మానసిక ఒత్తిడి మరియు ఆత్రుత మీకున్నటువంటి ఆలోచన శక్తిపై ప్రభావం చూపిస్తాయి. అందువలన యోగ మీ మానసిక ఒత్తిడిని తగ్గించటానికి ఒక మంచి మార్గం.

వాస్తవానికి మీరు యోగాభ్యాసం వలన కలిగే లాభాలను పొందటానికి ఎక్కువ సమయం కేటాయించవలసిన అవసరం లేదు. ప్రతి రోజు పది నిమిషాల పాటు యోగాభ్యాసం చేయటం వలన మంచి లాభాలను పొందవచ్చు. వారం రోజుల పాటు తరగతులకు హాజరయ్యే దానికన్నా, ఎక్కువ ప్రయోజనం ప్రతిరోజు కొంచెం సేపు యోగ చేయటం వలన పొందవచ్చు. ఏందుకంటే మీరు ఈవిధంగా చేయటం వలన మానసిక ఒత్తిడిని అధిగమించటానికి పోరాటం చేస్తున్నారని అర్థం

మీరు ప్రతిరోజు ఉదయాన్నే యోగాభ్యాసం చేయటం వలన మీ శక్తి పెరుగుతుంది, ఉద్రిక్తత లేదా ఆందోళన తగ్గుతుంది. మీ రోజును మంచిగా ఆరంభించవచ్చు.

స్థిరంగా ఉండే యోగ భంగిమ


ఇందువలన తోడ లోపల భాగం మరియు గజ్జ ప్రాంతం వ్యాపనం అవుతాయి. ఐతిహ్యంగా ఇది రజోనివ్రుత్తి లక్షణాల నుండి ఉపశమనం కలిగించడానికి మరియు అలసటను తగ్గించడానికి ఉపయోగ పడుతుందని భావించబడింది. మీరు నిటారుగా కూర్చోవాలి. ఇలా కూర్చున్నప్పుడు రెండు పాదాలు ఒకే దగ్గర ఉండాలి మరియు మోకాళ్ళు భయటకు మడచి ఉండాలి. కాలి మడిమలు పొత్తి కడుపు దగ్గరగా ఉండేటట్లు చూడాలి. ఇప్పుడు మీ రెండు పాదాల బొటన వ్రేళ్ళను మీ చేతి బొటన వ్రేలు, ఒకటి మరియు రెండో వెళ్ళతో పట్టుకొని నిటారుగా కూర్చోవాలి.


బ్రిడ్జి భంగిమ


వెన్నెముక, పొత్తికడుపు మరియు వక్షస్థలం విశాలం అవటానికి తోడ్పడుతుంది.

మోకాళ్లను మడచి వెల్లకిలా పడుకోండి. నేల మీద పడుకున్నట్లుగా సమంగా ఉండాలి. మీ చేతులను చాచి హస్తాలు నేలపై ఉండేవిధంగా చూడాలి. మీ పాదాల అడుగు భాగాలను ఒత్తి పట్టుకొని మీ నడుమును పైకి ఎత్తవలెను. మీ శరీర బరువు వెన్నెముక క్రింద ఉన్నటువంటి ఎముక పై ఉండేవిధంగా చూడాలి. ఇలాగే కొంచం సేపు శ్వాసను తీసుకుంటూ ఉండాలి.  ఈ భంగిమ నుండి యధాస్థానానికి రావటానికి పాదాలను ఒత్తిపట్టుకొని నడుమును పైకేత్తాలి. భంగిమను విడచి శరీర క్రింది భాగం నేలమీదనే ఉంచి మెల్లగా పైకి లేచి కూర్చోవాలి.

పిల్లవాడి భంగిమ


ఇలా చేయటం వలన నడుము, తొడలు మరియు శరీరం వెనుకటి భాగం విశాలం అవటానికి వీలవుతుంది.

మోకాళ్ళ భంగిమ నుండి కాళ్ళ మడిమల మీద వెనుకకు కూర్చోండి. ఇలా చేసిన తర్వాత మోకాళ్లను నడుము వరకు విశాలంగా ఉంచండి. తర్వాత ముందుకు వంగండి. మీ శరీర పైభాగం మీ తొడల మధ్య మరియు మీ శిరం నేలవైపు ఉండేటట్లు చూడాలి. మీ చేతులను శరీరం ముందుకు తీసుకరావాలి. ఇలా చేస్తున్నప్పుడు మీ హస్తాలు క్రిందికి ఉండేటట్లు చూడాలి.

మీరు ఆలోచన శక్తిని వృద్ది చేసుకోవటానికి ఎక్కువ సమయం కేటాయించవలసిన అవసరం లేదు. మీరు క్రమం తప్పకుండ యోగ ఆసనాలను పాటిస్తే చాలు.




Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, బరువును తగ్గించే పృధ్వి ముద్ర!

వైట్ డిశ్చార్జ్.. కాలేజీ పిల్లల నుంచి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల వరకూ చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఈ ఇబ్బంది ఇన్ఫెక్షన్లుగా మారకుండా ఉండటానికి, అదుపులో ఉంచడానికి పృధ్విముద్ర ఆసనాన్ని ఆచరించండి.    పృధ్వి ముద్ర:  పద్మాసనంలో కూర్చుని, రెండు చేతుల ఉంగరం వేళ్లు మడిచి బొటనవేళ్లను వాటిపై ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకుని శ్వాసమీదే ధ్యాస నిలపాలి. ఐదు సెకన్ల పాటు గాలిని తీసుకుంటే పదిసెకన్ల పాటు గాలిని వదలాలి. అంటే వదిలేటప్పుడు రెండు రెట్ల గాలిని వదలాలి. వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.