Skip to main content

ఐటీ ఉద్యోగులూ... భుజంగాసనం తప్పక వేయండి... ఎలా చేయాలంటే...?(వీడియో)

 సంస్కృతంలో భుజంగ అంటే పాము అని ఆసన అంటే వ్యాయామం అని అర్థం. భుజంగాసనం చాలా సులువైన వ్యాయామ రీతిగా చెప్పవచ్చు. అయితే, దీంట్లో తప్పులు కూడా చేసే అవకాశముంది. కాబట్టి ఈ ఆసనం ద్వారా గరిష్ట ప్రయోజనాలు పొందడానికి గాను దీని గురించిన వివరాల పట్ల శ్రద్ధ వహించాలి.

విరామ స్థితిలో ఉన్నప్పుడు, నింపాదిగా ఈ భుజంగాసనాన్ని ప్రయత్నిస్తే మంచిది. ఈ ఆసనం వేసేటప్పుడు మీ వెన్నెముక కండరాలు ఒత్తిడికి గురికారాదు. అలాగే ఆసనాన్ని త్వరత్వరగాను, ఉన్నట్లుండి కూడా వేయడానికి ప్రయత్నించరాదు. భుజంగాసనాన్ని శలభాసనం, ధనురాసనాలతో కలిపి వేయాలి, ఈ మూడు ఆసనాలు కలిపి త్రయంగా ఏర్పడతాయి.

ఈ మూడు ఆసనాలూ పరస్పరం అనుసంధానమై ఉంటాయి. భుజంగాసనానికి వ్యతిరేక భంగిమలు హలాసనంగా, పశ్చిమోత్తాసనంగా రూపు దాలుస్తాయి. భుజంగాసనం రెండు విధాలుగా ఉంటుంది: సాధారణం, సంక్లిష్టం. 

 భుజంగాసనం వేయు విధానం:

మకరాసనంలో విశ్రాంతిగా ఉండండి.
కాలిమడమలను బొటనవేళ్లను కలిపి ఉంచి బోర్లా పడుకోవాలి.
చుబుకాన్ని నేలకు ఆనించాలి.
అరికాళ్లు పై వైపుకు తిరిగి ఉండాలి.
మోచేతులను వంచి అరచేతులను ఆఖరి పక్కటెముక ప్రక్కగా ఉంచండి.
మోచేతులను దగ్గరగా ఉంచాలి. చేతులపై ఎక్కువ బలాన్ని ఉంచొద్దు.
ముందుగా తలను పైకెత్తుతూ త్రాచుపాము పడగెత్తినట్లు శరీరాన్ని నెమ్మదిగా పైకెత్తండి.
నాభిస్థానము నేలకు అంటీ అంటనట్లుగా ఉంచండి.
తిరిగి మెల్లగా మకరాసనంలోకి రండి.
 

ప్రయోజనాలు:

రుతుక్రమం సకాలంలో రాకుండా బాధపడుతున్న మహిళలకు భుజంగాసనం ప్రత్యేకించి లబ్ది చేకూరుస్తుంది.
అండాశయం మరియు మూత్రాశయానికి సంబంధించిన పలు సమస్యలను ఇది నివారిస్తుంది.
గర్భసంచిని, చుట్టుపక్కల ఉన్న కటి ప్రాంతాలను ఇది క్రమబద్ధంగా పనిచేసేలా చూస్తుంది. పొత్తి కడుపు భాగంలో ఒత్తిడిని పెంచడం ద్వారా ఇది జరుగుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు సైతం ఈ ఆసనం వేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.
మీరు స్వల్ప రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే భుజంగాసనాన్ని తప్పక వేయండి.
పెద్దప్రేగు మరియు పొట్టలోని వాయువును భుజంగాసనం వెలుపలకు నెడుతుంది. మెడ, వీపుకు సంబంధించిన అన్నిరకాల నొప్పులకు భుజంగాసనం దివ్యంగా పనిచేస్తుంది.
వైట్ కాలర్ ఉద్యోగాలు చేస్తున్నవారికి భుజంగాసనం మంచి వ్యాయామం.
ఐటి ఉద్యోగులు క్రమం తప్పకుండా భుజంగాసనం వేయాలి. వీరి శారీరక, మానసిక పటుత్వానికి ఇది సరైన వ్యాయామం.

Comments

Popular posts from this blog

ఆర్మ్స్ ను మంచి ఆకృతిలోకి మార్చే యోగాసనాలు

చాలా మంది యోగ యొక్క ఉపయోగాలపై గల విశ్వాసంతో వారి శరీర భాగాలని బలోపేతం లేదా బిగువుపర్చుకోవటం కోసం చాలా కృషి చేస్తుంటారు మరియు పరిపూర్ణ శిక్షణ ద్వారా మాత్రమే శరీరంను తగినవిధంగా మలచుకోవడం సాధ్యమని వారు భావిస్తారు. ఒకవేళ యోగాను విరుద్ధంగా కాకుండా, సరైన మార్గంలో మరియు ఒక క్రమ పద్ధతిలో సాధన చేస్తే సెక్సీ, బిగువైన చేతులు పొందుటకు సహాయపడుతుంది. కాబట్టి, ఇక్కడ బిగువైన చేతులు పొందుటకు సహాయపడే కొన్ని వేరు వేరు యోగా భంగిమలను తెలియచేయడం జరిగింది ఇవి మీ పూర్తి శరీరంపై ప్రభావం చూపుతాయి, సాధన చేసే కొలది రోజు రోజుకు మీలోని మార్పును గమనించుకోవచ్చు. అధోముఖ స్వనాసన లేదా డౌన్వార్డ్ డాగ్ ఒక చాపపై అధోముఖ భంగిమలో వంగాలి మరియు భుజాలకు సూటిగా చేతులను క్రింద అన్ని నాలుగు భాగములు తాకే విధంగా మోకరిల్లాలి. కాలి వేళ్ళ పై క్రింద ప్రాకాలి మరియు నడుమును పైకి ఎత్తేపుడు శ్వాసను బయటకు వదులేయాలి. భుజాలను చెవుల నుండి దూరంగా తరలించాలి; ఈ విధంగా చేస్తున్నపుడు ముందరి పక్కటెముకలను లోపలి వైపుకు లాగేసుకోవాలి మరియు చేతులను వీలైనంత వరకు పాదాల వైపు నెట్టాలి. సైడ్ ప్లాంక్ సైడ్ ప్లాంక్ భంగిమలో మొండెంను త్రిప్పండి మరియు ...

దృఢమైన ఛాతీ కోసం ''అర్ధ చక్రాసనం''

అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమేకాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతి మరింత దృఢంగా మారుతుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే మెుదటగా రెండు కాళ్లు కలిపి ఉంటి నిటారుగు నిలబడాలి. రెండు చేతులు నడుముకు రెండువైపులా ఉంచాలి. గాలి పీల్చుతూ, మెడను వెనుకకు వంచుతూ, నడుము నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. అలానే చేతులు వెనుకకు సాగదీసి, నేలమీదకు ఆనేలా ఉంచాలి. నడుము, పొట్ట పైకి తన్నినట్టుగా ఉంచి, పాదాలు పూర్తిగా నేలకు ఆన్చాలి. చివరగా గాలి వదులుతూ యధాస్థితికి రావాలి. 

వైట్ డిశ్చార్జ్, ఇన్ఫెక్షన్లు, బరువును తగ్గించే పృధ్వి ముద్ర!

వైట్ డిశ్చార్జ్.. కాలేజీ పిల్లల నుంచి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల వరకూ చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ఈ ఇబ్బంది ఇన్ఫెక్షన్లుగా మారకుండా ఉండటానికి, అదుపులో ఉంచడానికి పృధ్విముద్ర ఆసనాన్ని ఆచరించండి.    పృధ్వి ముద్ర:  పద్మాసనంలో కూర్చుని, రెండు చేతుల ఉంగరం వేళ్లు మడిచి బొటనవేళ్లను వాటిపై ఉంచాలి. తక్కిన వేళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి కళ్లు మూసుకుని శ్వాసమీదే ధ్యాస నిలపాలి. ఐదు సెకన్ల పాటు గాలిని తీసుకుంటే పదిసెకన్ల పాటు గాలిని వదలాలి. అంటే వదిలేటప్పుడు రెండు రెట్ల గాలిని వదలాలి. వెజైనల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండటానికి ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర వల్ల అధిక బరువు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి.